Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

Yesanna Swaramanna | యేసన్న స్వరమన్నా


    • యేసన్న స్వరమన్నా
    • నీవెప్పుడైనా విన్నావా (2) ||యేసన్న||

    • ఏదేను తోటలో ఆదాము చెడగా
    • ఆ దేవుడే పిలిచె (2)
    • యెహోవా ఎదుటను ఆదాము దాగిన (2)
    • అటులనే నీవును దాగెదవా (2) ||యేసన్న||

    • జనముల శబ్దము జలముల శబ్దము
    • బలమైన ఉరుములతో (2)
    • కలిసిన స్వరము పిలిచిన యేసు (2)
    • పిలిచిన పిలుపును నీవింటివా (2) ||యేసన్న||

    • ఆనాడు దేవుడు మోషేను పిలువగా
    • ఆలకించెను స్వరము (2)
    • ఈనాడు నీవును ఈ స్వరము వినగా (2)
    • కానాను చేరగా కదిలి రావా (2) ||యేసన్న||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 242 times