Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

Manaserigina Yesayya | మనసెరిగిన యేసయ్యా


    • మనసెరిగిన యేసయ్యా
    • మదిలోన జతగా నిలిచావు }2
    • హృదయాన నీ ఆజ్ఞలు వ్రాసి
    • నీ పత్రికనుగా మార్చావు } 2|| మనసెరిగిన ||

    • నిర్జీవ క్రియలను విడిచి పరిపూర్ణ పరిశుధ్ధతకై
    • సాగిపోదును నేను ఆగిపోలేనుగా } 2
    • సాహసక్రియలు చేయు నీ హస్తముతో
    • నన్ను పట్టుకొంటివే విడువలేవు ఎన్నడు } 2|| మనసెరిగిన ||

    • వెనకున్న వాటిని మరచి నీతోడు నేను కోరి
    • ఆత్మీయ యాత్రలొ నేను సొమ్మసిల్లి పోనుగా } 2
    • ఆశ్ఛర్యక్రియలు చేయు దక్షిణ హస్తముతో
    • నన్ను ఆదుకొంటివే ఎడబాయవు ఎన్నడు } 2|| మనసెరిగిన ||

    • మర్త్యమైన దేహము వదిలి అమర్త్యతను పొందుటకై
    • ప్రభు బల్లారాధనకు దూరము కాలేనుగా } 2
    • నేలమంటితో నన్ను రూపించిన హస్తములే
    • నన్ను కౌగలించెనే వదలలేవు ఎన్నడు } 2|| మనసెరిగిన ||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 6416 times