సిలువ ధ్యానాలు - Day 9 - సిలువ త్యాగం


  • Author: Rev Anil Andrewz
  • Category: Devotions
  • Reference: Sajeeva Vahini - సిలువ ధ్యానాలు - 40 Days

సిలువ ధ్యానాలు - Day 9 - సిలువ త్యాగం
Audio: https://youtu.be/WIDoWFvWtYs

 

త్యాగం అనగా ఇతరులకు కావలసినది ఇచ్చుటకు లేదా నీకు కావలసినది పొందుకొనుటకు నీ దగ్గరవున్న మేలైనది వదులుకోవడమే త్యాగం.
ఇతరులకు మేలు కలుగకుండ, నీవు ఆశించినది జరగకుండ నీకున్న మేలైనది త్యాగము చేయడం వ్యర్ధం.

కొంతమంది మా ఆనందాలన్ని త్యాగం చేసుకొని నా కుమార్తె/కుమారుడు అడిగినవన్ని ఇచ్చాము, మంచి చదువులు చదివించాము కాని, చివరికి మాకు ఇష్టములేని వివాహము చేసుకున్నారని, మమ్ములను పట్టించుకోవడం లేదని బాధపడుతుంటారు. త్యాగం చేసినప్పుడు మేలు జరుగకపోతే మనోవేదన మిగులుతుంది.

ఈ రోజులలో కొంతమంది నేను క్రైస్తవునిని అని చెప్పుకోడానికి సిగ్గుపడుతుంటారు. మరికొందరైతే పరిశుద్ద గ్రంథం చేతపట్టుకోవడానికి, అందరిముందు ప్రార్ధించుటకు సిగ్గుపడుతుంటారు. ఇలా చేయడానికి ముఖ్యకారణం క్రైస్తవ జీవితము యొక్క విలువ తెలియకపోవడమే. సిగ్గుపడేది కాదు తెగింపు కలిగినదే క్రైస్తవ జీవితం. ఆడుతుపాడుతు జీవించేది క్రైస్తవ జీవితం కాదు త్యాగంతో కూడినదే క్రైస్తవ జీవితం. తాత్కాలికమైన సంతోషాల కోసం కాదు శాశ్వతమైన సంతోషం పొందుకోవడమే క్రైస్తవ జీవితం. నీ త్యాగమునకు ప్రతిఫలముగా పొందబోయే బహుమానం పొందుకొనుటకు క్షణకాలముండే చులకని శ్రమను అనుభవించడమే క్రైస్తవ జీవితం. దాచుకొనేది కాదు పంచిపెట్టేది క్రైస్తవ జీవితం. మరణానికి భయపడిదాగేది కాదు ధైర్యముతో మరణానికి ఎదురువెళ్ళడమే క్రైస్తవ జీవితం. ఇలా చెప్పుకుంటు వెళ్తె క్రైస్తవ జీవితము గురించి ఎంతో అద్భుతముగా వర్ణించవచ్చు. క్రైస్తవ జీవితమంటేనే త్యాగములతో కూడినది. త్యాగం లేని చోట ప్రేమ ఉండదు; ప్రేమలేని చోట పరిపూర్ణత ఉండదు.

మోషే 40 సం।।ల వయస్సులో ఐగుప్తు సకల విద్యలు అభ్యసించి ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు; నేను ఈ ఫరో కుమార్తె యొక్క కుమారుని కాను, ఈ దేశానికి చెందినవాడను కాను, ఈ ఐగుప్తు పౌరసత్వం నాకు అవసరం లేదని భవనమును విడిచిపెట్టి బురదను కోరుకున్నాడు. మోషే చేసిన త్యాగం ఎంత భయంకరంగా ఉందంటే ఏ ప్రజలకి రోల్ మోడల్ గా ఉన్నాడో, ఎవరి మధ్య ఉన్నతమైన స్థితిలో ఉన్నాడో అదే ప్రజల మధ్య బానిసగా ఉండుటకు ఇష్టపడ్డాడు. దేవుని కొరకు మోషే చేసిన త్యాగానికి ప్రతిఫలముగా బహుమానం పొందుకున్నాడు. ఈ రోజు అదే దేవుని కొరకు నీవేమి త్యాగం చేయగలుగుతావు?

యెషయా 53:12 కావున గొప్పవారితో నేనతనికి పాలు పంచిపెట్టెదను ఘనులతో కలిసి అతడు కొల్లసొమ్ము విభాగించుకొనును. ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను

2000 సం।।ల క్రితం యేసు ప్రభువు పరలోక వైభవమును మన కొరకు విడిచిపెట్టి దాసుని శరీరము ధరించి రిక్తునిగా ఈ లోకమునకు వచ్చి మనందరి రక్షణ కొరకు తన ప్రాణమును ఆ కల్వరి సిలువలో ధారపోసాడు. అవునుమరి సిలువ అంటే త్యాగం. ఆనాడు యేసు ప్రభువు తన ప్రాణం త్యాగం చేయకపోయింటే ఈనాడు మన పరిస్థతి ఎలా ఉండేది?

యేసు క్రీస్తు రక్తములో కడుగబడి ఉచితముగ రక్షణ పొందినవారు క్రీస్తు కొరకు ఏ త్యాగం చేయ్యాలో పరిశుద్ద గ్రంథములో స్పష్టముగ వ్రాయబడి ఉంది ఆ త్యాగం చేయుటకు నీకు ధైర్యమున్నదా?

(మార్కు 10:29-31) దేవుని నిమిత్తము, సువార్త నిమిత్తము ఇంటిని, అన్న తమ్ముడిని, అక్క చెల్లలిని, తల్లిని తండ్రిని పిల్లలను విడిచిపెట్టాలి.ఇదే నీవు నేను చేయవలసిన త్యాగం. విడిచిపెట్టమంటే - దేవుని కొరకు, సువార్త కొరకు అనగా నీవు ప్రార్ధన చేయవలసిన సమయంలో, నీ కుటుంబ ప్రార్ధన సమయంలో, నీవు దేవుని మందిరమునకు వచ్చేసమయంలో నాకు పని ఉంది మీరు చేసుకోండని లేదా బంధువులొచ్చారు ఇప్పుడు కుదరదని, ఆ పని ఈ పనని, వారున్నారు, వీరున్నారని సాకులు చెప్పకుండా ఇది నా దేవుని సమయమని అందరిని విడిచిపెట్టి ప్రార్ధన చేయగలవా? నీ పనులను ప్రక్కనపెట్టి దేవుని మందిరమునకు రాగలవా? అంటికంటే నాకు దేవుడే ముఖ్యం నా దేవునికి ఇవ్వవలసిన సమయం దొంగిలించనని చెప్పగలవా? దేవుని కొరకు ఏ త్యాగం చేయుటకు నీవు సిద్ధం?

ఇశ్రాయేలు చేసిన తిరుగుబాటు వలన 40 సంవత్సరములు అరణ్యములో తిరిగారు. దావీదు తాను చేసిన పొరపాటువలన కొంత కాలం అరణ్యములో తిరిగాడు. యూదయ చేసిన పొరపాటులవలన కొన్ని సంవత్సరాలు బబులోను చెరలో ఉన్నారు. అన్ని సంవత్సరములు వారి వలన కలిగే నష్టము గురించి దేవుడు ఆలోచించలేదు కాని, వారిలో మార్పు కొరకు సహనముతో ఎదురు చూసాడు, వారి బాధలు బలహీనతలు భరించాడు. లేదు దేవా నీవు పొరపాటు పడుతున్నావు ఆ మనిషిని చేసింది నీవే

ఈ చెరలో ఉన్న ప్రతి ఒక్కరు తమను విడిపించమని దేవునికి కన్నీటి ప్రార్ధనలు చేసారు కానికొన్ని సంవత్సరములు వారి విడుదల కొరకు సహనముతో ఎదురు చూసారు. కాని, ఇక్కడ విడుదల కొరకు వీరికున్న సహనము కంటే దేవునికి ఎలా ఉండాలి?


Support & Donate Us | Google Play Store | సజీవ వాహిని - Sajeeva Vahini 2009-2022. info@sajeevavahini.com
Sajeeva Vahini, Hyderabad & Chennai, India. SajeevaVahini.org Email: , . Whatsapp: 8898 318 318 or call us: +918898318318
Content on this website is prepared manually by Sajeeva Vahini, India. Our Content is free and open to use for any kind of distrubution. We request to carry a physical bible to churches rather than using bible on mobile or tablets. Please email any information for any suspected content/audio subject to piracy/copyright act on this website can be considered/removed. Which can help us to improve better. Note: we dont have any data/content related to Life Way Study Bible as a part of Sajeeva Vahini Notes or Verse Explanations.