దేవునితో నడచిన హనోకు


  • Author: Anil Andrewz
  • Category: Messages
  • Reference: Sajeeva Vahini Vol 2 Issue 2

ఆది 5:21-24 “హనోకు అరువదియైదేండ్లు బ్రతికి .. దేవుడతని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను”.

హనోకు దాదాపు 300 యేండ్లు దేవునితో నడచినాడు. ఇది అందరికీ తెలిసిన విషయం, హనోకు ఎటువంటి పరిస్థితులలో దేవునితో నడిచాడు? దేవునితో నడవడం అంటే ఏమిటి?

ఆది 5:28,29 లో గమనిస్తే, నెమ్మది అనేది ఎరుగని దినములలో జనులు ఉన్నట్లు తెలుసుకోవచ్చు. లెమేకు ఒక కుమారుని కని, ఇతడు మనకు నెమ్మది కలుగజేస్తాడు అని అనుకొని నోవహు అని పేరు పెట్టాడు. హనోకు దేవునితో నడుస్తున్న రోజులలో అనగా 300 సంవత్సరములు, పనిలో నెమ్మది లేదు. భూమి శపించబడి ఉంది. చేతుల కష్టం ఎక్కువగా ఉంది. అందులో నెమ్మది లేదు. ఆది 1:28లో ఆదామును దేవుడు ఆశీర్వదించాడు, ఆదాము పాపము చేసిన తరువాత; ఆదాము నిమిత్తం నేల శపించబడింది. అప్పటి నుండి అబ్రాము, అబ్రహాముగా మార్చబడే వరకు ఆశీర్వాదము అనేది భూమి మీద లేదు. శాపం హనోకు మీద ఉంది; పరలోక నిరీక్షణ లేదు, దేవుని కార్యం ఒక్కటి కూడా లేదు. హనోకు ఇటువంటి పరిస్థితులలో లోకమును చూడకుండా, ఒక దినము విడువకుండా దేవునితో నడిచాడు. తనకు భార్యా పిల్లలు ఉన్నారు, చేతులతో కష్టము చేస్తునాడు. ఇంటి బాధ్యతలు అన్ని నెరవేరుస్తూ; నెమ్మది అనేది లేకపోయినా సాకులు చెప్పకుండా దేవునితో నడుస్తున్నాడు.

క్రీస్తునందు ప్రియులారా! క్రీస్తు యేసు మరణం ద్వారా మనం శాపం నుండి విడుదల (రక్షణ) పొండుకొని, ఆశీర్వాదమునకు పాత్రులమైనాము. పరలోకం మనకు తెరువబడింది. ప్రతి రోజు దేవుని స్వరం వింటున్నాము. అడుగడుగునా దేవుని కార్యములు చూస్తున్నాము కాని, దేవునితో నడుస్తున్నామా? ఆదివారం చర్చికి రావడానికే కొందరికి కష్టముగా మారిపోయింది. సాకులు చెప్పడం క్రైస్తవులకు వ్యసనముగా మారిపోయింది. కొందరు చదువుకోవాలని, కొందరు కొత్తగా పెళ్ళి అయిందని, కొందరు పిల్లలున్నారు అని, కొందరు ఉద్యోగం అని ఏదో ఒక సాకు చెప్తుంటారు. కొంతమంది దేవునితో నడవడంకాదు, దేవుడే నడిపిస్తాడు అని చెప్తుంటారు; దేవునికి తనతో నడిచే క్రైస్తవులు కావాలి, తనను నడిపించేవారు కాదు.

దేవునితో నడవడం అంటే ?

ఆది 6:9లో .. నోవహు నీతిపరుడు..దేవునితో నడచినవాడు. అంటే?. ఎవరు నీతిగాను, నిందారహితునిగాను ఉంటారో వారినే దేవునితో నడిచేవారు అంటారు. నీతిపరునిగా ఎలా తీర్చబడుతాము? లూకా 18:13,14లో సుంకరి దేవుని దగ్గర తనను తాను తగ్గించుకొని, తాను పాపిని అని ఒప్పుకున్నప్పుడు, 14వ వచనంలో దేవుని చేత నీతిమంతునిగా తీర్చబడినాడు. కాని, అనేకులు మనుష్యుల ముందు తగ్గించుకొని, మనుష్యుల చేత మంచివాడు, గొప్పవాడు అని అనిపించుకుంటారు. దేవుని ముందు ఏపాపం చేయనట్లు ప్రతి పాపమును కప్పుకుంటారు. కొంతమంది సేవకులు కూడా ఇతరులకు వాక్యం చెప్పడానికి వారి తప్పులను చూపించడాకే బైబిల్ చదువుతారు కాని వారి కోసం చదవరు. మాలో ఏ తప్పు లేదన్నట్లు ప్రవర్తిస్తారు. దేవుని దగ్గర మనం తప్పులను మొట్ట మొదట రక్షణకు ముందు ఒప్పుకోవడం కాదు, ప్రతీ రోజు మనకు తెలిసి తెలియక కొందరిని బాధపెట్టవచ్చు. Iకోరింథీ 8:8-13లో పౌలు గారు, మనకున్న విశ్వాసము ద్వారా మన క్రియల ద్వారా బలహీనమైన మనస్సాక్షి గల తోటి సహోదరుని మనసుని నొప్పిస్తే; అని క్రీస్తుకు విరోధముగా పాపము చేసినట్లే అని చెబుతున్నారు. మనకు నచ్చినది ఇతరులకు నచ్చక పోవచ్చు. ఇలాంటి క్రీస్తునకు విరోధమైన పనులు చేస్తుంటాము. మనము ప్రతీరోజు ఇతరుల కొరకే కాదు, మన జీవితము కొరకు కూడా బైబిల్ చదవాలి. ప్రార్ధన చేయాలి. దేవుని దగ్గర మనలను మనము తగ్గించుకొనినప్పుడే మనము నీతిమంతులముగా తీర్చబడుతాము.

దావీదుహారాజు, ఆదాము వలే పాపము కప్పుకోలేదు, ఒప్పుకున్నాడు. అందుకే ఆదాము గురించి ఎక్కడ బైబిల్ ఎక్కువగా జ్ఞాపకము చేయబడలేదు కాని, దావీదు గురించైతే సొలోమోను మొదలుకొని అనేక సందర్భాలలో తన సేవకుడైన దావీదు వలే తన దేవుడైన యెహోవా యెడల యధార్ధముగా లేకపోయెను అని జ్ఞాపకము చేయబడినది. ఎవరు దీనులై యదార్ధముగా దేవుని దగ్గర తన పాపములను ఒప్పుకుంటారో వారే నీతిమంతులు. నీతిపరుడును ఎవరిచేత నిందింపబడని వారినే దేవునితో నడిచేవారు అంటారు. హనోకులాంటి క్రైస్తవులు దేవునికి కావాలి. అలాంటి వారితోనే దేవుడు నడుస్తాడు. పరలోకంలో స్థానం కూడా హనోకు లాంటి వారికే కాని, లూకా 18:11లో దేవుని ముందు తనను తాను నీతిమంతునిగా కనబరచుకొని హేచ్చించుకొనిన వరిసయ్యుని లాంటి వారు కాదు కావలసినది.

ప్రియులారా! ఒక సారి మనము క్రీస్తుతో ఎలా నడుస్తున్నామో పరీక్షించుకుందాము!!!

rigevidon reddit rigevidon risks rigevidon quantity