నిన్ను గుర్తించలేదా?

  • Author: Dr G Praveen Kumar
  • Category: Devotions
  • Reference: Sajeeva Vahini - Daily Devotion

నిన్ను గుర్తించలేదా?

తోలుబొమ్మలాట అనేది భారత దేశం లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన జానపద కళారూపం. ఈ తోలుబొమ్మలాటలో చర్మంతో చేసిన వివిధ బొమ్మలతో ఒక కథని తయారుచేసి గ్రామాలలో కళారూపంగా ప్రదర్శిస్తారు. ఈ బొమ్మలు సమ్మోహనాత్మక ప్రదర్శనతో ప్రేక్షకులను రంజింపజేస్తూ ఉర్రూతలూగిస్తాయి. అయితే కథనంతా నడిపించే ఈ బొమ్మల ప్రధాన ఆకర్షణ మరియు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసే విషయము, కేవలం వాటి వెనక ఉన్న కళాకారుల గొప్పతనమే. కళాకారులు ఎవరికీ కనబడకుండా కేవలం బొమ్మలను ఆడిస్తూ, చూసే వారికి కనువింపు కలిగించేలా ఈ పదర్శన, చివరకు కథను మాత్రమే గుర్తుపెట్టుకొని కథానాయకుడెవరో తెలియని ప్రేక్షకుల చప్పట్లతో అది వింతగా కనబడుతుంది. ఇదిలా ఉంటే, చలన చిత్రాల్లో నటీమణుల విజయవంతమైన సంగతి వారి గొంతులకు డబ్బింగ్ చెప్పే వారినిబట్టే కదా.

మనుష్యులకు కనబడే పాత్రలు పోషించేవారికి తరచూ ఎంతోనమ్మకముగా తోడ్పడే వారు క్రీస్తు శరీరంలో కూడా ఉన్నారు. తన పరిచర్యలో సరిగ్గా అలాంటి వ్యక్తులపైనే ఆధారపడ్డాడు అపోస్తలుడైన పౌలు. లేఖికుడుగా తెర్తియు చేసిన పని పౌలు వ్రాతలకు శక్తివంతమైన స్వరాన్ని చేకూర్చింది. వెనుకనుండి అనునిత్యము ఎపఫ్రా చేసిన ప్రార్ధనలు పౌలుకు మరియు ఆది సంఘానికి ప్రాముఖ్యమైన పునాదిగా నిలిచాయు. అలసియున్న పౌలు పునరుజ్జీవింప బడవలసిన అవసరం వచ్చినప్పుడు లూదియా తన గృహాన్ని ఏంతో ఉదారంగా తెరిచింది. క్రీస్తులో ఈ తోటి దాసుల సహాకారం లేకుండా పోలు పని సాధ్యపడియుండేది కాదు.

అందుకే యేసు క్రీస్తు ప్రభువు మత్తయి 5:16 లో అంటారు “మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారియెదుట మీ వెలుగు ప్రకాశింప నియ్యుడి.” అనేకసార్లు అందరి దృష్టిలో పడే పాత్రలను మనము పోషిస్తూ ఉండక పోవచ్చు. అయితే తన ప్రణాళికలో మనదైన ముఖ్య పాత్రను పోషించినప్పుడు దేవుడు సంతోషిస్తాడని మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఇతరులను గూర్చి ప్రార్ధించడంలో, దేవుని సేవకులకు వారి పరిచర్యలో సహాయపడుటలో, పరిశుద్ధ దినమున సంఘాన్ని సిద్ధపరచడంలో మరియు తోటి విశ్వాసులకు సహాయం చేయాలనే మన ఆలోచనలు ఇలా మనల్ని మనము దేవుని పనికి సంపూర్ణంగా అప్పజేప్పుకున్నప్పుడే, అది దేవునికి మహిమను తేవడంతోపాటు ఇతరులను కూడా ఆయన తట్టు ఆకర్షించేలా చేస్తుంది. అప్పుడే మనము చేసే సేవలో విలువలను, పరమార్ధాన్ని కనుగొనగలమని జ్ఞాపకము చేసుకుందాము. ఆమెన్.

https://youtu.be/V5iKR5wTgFw