మీరు చాలా బిజీగా ఉన్నారా? Are You Too Busy For Jesus?


  • Author: Anudina Vaahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 4
  • Reference: Sajeeva Vahini - Daily Devotion

మీరు చాలా బిజీగా ఉన్నారా?

తినడం, పని చేయడం, వ్యాయామం చేయడం, నిద్రపోవడం, చదవడం, వినోదం, సంభాషణలు, సువార్త ప్రకటించడం, ప్రార్థించడం వంటి పనులకు, వేటికి ప్రాధాన్యత ఇవ్వాలని మీరు ఎలా నిర్ణయించుకుంటారు? అయితే, ఈ విషయాలకు మన దినచర్యలో ఎంత సమయం కేటాయించాలో మీ సమయ నిష్పత్తిని నిర్దేశించే నిర్దిష్ట నియమాలు బైబిల్‌లో లేవు.

నా బాల్కనీలో ఒక చక్కని మొక్క ఉంది, అది తాజాగా కనిపిస్తుంది. ప్రతిరోజు నేను దానికి నీళ్ళు పోస్తూ సమయం గడుపుతున్నాను. ఆ మొక్క పచ్చగా ఉండడం గమించాను. నేను కొన్ని పనుల్లో బిజీగా ఉన్న సందర్భాల్లో, సమయం గడపలేకపోయాను.
అనుకోకుండా వర్షాకాలం కావడంతో దానికి నీళ్ళు సమృద్దిగా దొరకడం ద్వారా నేను నీళ్ళు పోయకపోయినా ఆ మొక్క పచ్చగా కనిపించింది. సరేలే ఆ మొక్క బాగానే ఉందనుకొని కొన్ని వారాల తరువాత నా బిజీ షెడ్యూల్‌తో, నేను మొక్క గురించి పూర్తిగా మరచిపోయాను.
అనుకోకుండా ఒకరోజు నా బాల్కనీలోనికి వెళ్ళినప్పుడు, ఆ మొక్కకు ఒక ఎండిన కొమ్మను గమనించాను. అయ్యో నీళ్ళు పోయలేకపోయాననే అనుకొన్నాను, నాలో కొంత బాధ కలిగింది. ఒక పాస్టర్ గారు తమ జీవితం కొరకైన ప్రాధాన్యతను గుర్తుచేస్తూ ఈ ఉపమానాన్ని తన సంఘానికి వివరించాడు.
ఫిలిప్పీయులు 2:21 - ఎందుకంటే ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు ప్రయోజనాల కోసం కాకుండా తన సొంత ప్రయోజనాల కోసం చూస్తారు.

ప్రియమైన మిత్రులారా, ప్రభువు కొరకు సమయాన్ని వెచ్చించడంలో మన జీవితాలకు ప్రాధాన్యతనివ్వాలి. మనలో మనం చాలా బిజీగా ఉండకూడదు, అలాగని ప్రాముఖ్యమైన విషయాలను నిర్లక్ష్యం కూడా చేయకూడదు.నేటి నుండైనా  ప్రార్థన మరియు వాక్యము ద్వారా క్రీస్తులో ఎదుగుతూ మన దినచర్యలో వీటిని సంసిద్ధం చేసి తగినంత సమయాన్ని వెచ్చించే నిర్ణయం తీసుకుందాం. దేవుని రాజ్యానికి సిద్ధపడుతూ అనేకులను కూడా ఆహ్వానిద్దాం. ఆమెన్.

Are You Too Busy For Jesus?

How do you decide to prioritize what you do with the minutes of your days — eating, working, exercising, sleeping, reading, entertainment, conversations, evangelism, praying? There are no specific rules in the Bible that dictate the proportion of your time that goes into these things.

There is a plant on my balcony it looks fresh. Every day I spend time watering it and the plant was all luscious green. While I was busy with some work, and could not spend time 
watering it, it continued to look green, as it was rainy season. A few weeks later with my busy schedule, I completely forgot about the plant.
The moment I realized, I came back only to look at the dried branches of the plant, which waited too long for me to water them, and I was saddened. A Pastor explained this parable to a church congregation. 
Philippians 2:21
For everyone looks out for his own interests, not those of Jesus Christ.

Dear Friends, we need to prioritize our lives in spending time for the Lord. Let us not get too busy within ourselves and neglect the things that matter most.
Let us prepare our schedules and spend time, growing in Christ through Prayer and Word. Also inviting people to the Kingdom of God. Amen

Telugu Audio: https://youtu.be/jHFkR5RNMjI

English Audio: https://youtu.be/I_kw-ojbxVQ