మెలకువగా నుండి ప్రార్థన చేయుడి | Wakeful and Prayerful


  • Author: Anudina Vaahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 4
  • Reference: Sajeeva Vahini - Daily Devotion

జాన్ కొత్త ఉద్యోగం కోసం పోస్ట్ చేయబడ్డాడు మరియు అతని ప్రధాన కార్యాలయం ఉన్న ఆ విదేశీ దేశం ప్రకారం అతని పని రాత్రి 9 గంటలకు ప్రారంభమవుతాయి. ఇది అతను కలలు కంటున్న ఉద్యోగం, దానిలో రాణించడానికి, ఏదైనా చేయడానికి అతడు సిద్ధంగా ఉన్నాడు.

ఆ ఉద్యోగం రాత్రి సమయంలో కాబట్టి, జాన్ తన నిద్రవేళలు, తినే సమయాలను మార్చుకోవలసి వచ్చింది మరియు తన దినచర్యలో ప్రతిదీ సర్దుబాటు చేసుకోవలసి వచ్చింది, తద్వారా అతను తన పనివేళల్లో నిద్రపోకుండా రాత్రంతా మెలకువగా జాగ్రత్త కలిగి ఉండాలని సిద్ధపడ్డాడు.
అయితే అతడు, ఉద్దేశపూర్వకంగా కొన్ని పనులు చేయవలసి వచ్చింది. అతను నిద్రపోకుండా ఉండటానికి, రాత్రి అంతా మెలకువగా ఉండటానికి ఒక నిర్దిష్ట దినచర్యకు శిక్షణ పొందవలసి వచ్చింది.

అదేవిధంగా, క్రీస్తును మన రక్షకునిగా అంగీకరించిన మనం చీకటి రాజ్యం నుండి వెలుగు రాజ్యం వైపు నడిపించబడ్డాము.
మనము మన దినచర్యను మార్చుకొని మెలకువగా ఉండాలి, ఇప్పుడు మనము ఆయన బిడ్డలము కాబట్టి మనము మన పాత పాపపు స్వభావములోనికి తిరిగి పడిపోకుండా ఉండడానికి ప్రయత్నించాలి. దీనికి శిక్షణ అవసరం. కొన్ని అలవాట్లను చెరిపివేయడం మరియు కొత్త అలవాట్లను పెంపొందించడం చేయాలి. మన నడవడి ద్వారా మరియు ప్రార్థన ద్వారా 

దేవునితో స్థిరమైన సంభాషణ ద్వారా మనం ఆయన మాటకు కట్టుబడి ఉండాలి మరియు ఎటువంటి ప్రలోభాలకు గురికాకుండా చూచుకోవాలి
ఇప్పుడు, మన ఆత్మ పునరుద్ధరించబడింది, కానీ మన శరీరం ఇంకా బలహీనంగానే ఉంది.

అందుకే మార్కు 14:38 ప్రకారం మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా నుండి ప్రార్థన చేయుడి; ఆమెన్.

అనుదిన వాహిని
https://youtu.be/Syiat2FsmVc

Wakeful and Prayerful

John was posted for a new job and his working hours start at night 9pm according to the foreign  country where his head office resides.
This was a job he has been dreaming of and was ready to do everything to excel in it

John had to change his sleeping hours, eating times and adjust everything in his routine so that he is all awake and watchful all throughout night without falling asleep, during his working hours.

John purposely had to do things certain things and train himself to a certain routine for him to not fall asleep but to be wide awake and watchful throughout.
Similarly, when we accept Christ as our saviour we are translated from kingdom of darkness to light.

We need to change our routine and be watchful, now that we are His children so that we would not fall back into our old sinful nature.
This needs conscious training ,erasing few habits  and cultivating new habits , through guidance and consistent communication with God through prayer so that we abide in His word and will not fall for any temptation

Our spirit is renewed but our flesh is weak, and that-s our scripture for today.

Mark 14:38  Watch and pray so that you will not fall into temptation. The spirit is willing, but the body is weak."

May God help us all to be watchful and prayerful always. Amen God Bless you.

https://youtu.be/xS37yGoddWI