సంతోషాన్ని వ్యక్తపరచే పాటలు | Songs- Our expression of Joy in Heart


  • Author: Anudina Vaahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 4
  • Reference: Sajeeva Vahini - Daily Devotion

మీకు ఇష్టమైన పాట ఏది అని ఎవరైనా మమ్మల్ని అడిగితే, కొంచం కూడా ఆలోచించకుండా వెంటనే పాడేస్తాము. పాటలు మన ఆనందాన్ని వ్యక్తీకరించడానికి మరియు ఆ పాట చరణాల్లోని పదాలను 
గుర్తుంచుకోవడానికి మనలో అది ఒక అందమైన అనుభూతి.

కీర్తనలలోని కొన్ని అధ్యాయాలు అందమైన పాటలకు మంచి రాగాన్ని సిద్ధపరచిన ఎన్నో పాటలను ఎన్నడు మనం మరచిపోలేము. పాటలు మరియు కీర్తనలతో ఒకరికొకరు శుభాకాంక్షలు కూడా చెప్పుకోవడం మనం దేవుని వాక్యం ద్వారా గమనించగలం.

దేవుడు కూడా మన యెడల తన హర్షాన్ని సంతోషాన్ని వ్యక్తపరచే విధానం కూడా అదే; జెఫన్యా 3:17 ఆయన బహు ఆనందముతో నీయందు సంతోషించును, నీయందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీయందలి సంతోషముచేత ఆయన హర్షించును.

అవును, ఒక ప్రముఖ రచయిత జాన్ మాక్ ఆర్థర్ ఈ విధంగా చెప్పారు- "ఆత్మీయతలో సమృద్ధి కలిగిన జీవితం తనకు మంచి గాత్రం ఉన్నా లేకపోయినా మంచి సంగీతాన్ని ఉత్పత్తి చేస్తుంది. సంతోషభరితమైన క్రైస్తవుడు ఎల్లప్పుడూ దేవుని పాటలతో స్తుతిస్తూనే ఉంటాడు. పరిపూర్ణమైన జీవితానికి ఇది ఒక నిదర్శనం".

సంతోషభరితమైన హృదయంతో, స్తుతులతో, పాటలతో మన దేవుణ్ణి ఘనపరచడం ద్వారా మనము ఆయనను అనుకరించిన వారమవుతాము. కీర్తనల గ్రంథము 95:1 రండి యెహోవానుగూర్చి ఉత్సాహధ్వని చేయుదము మన రక్షణ దుర్గమునుబట్టి సంతోషగానము చేయుదము. ఆమెన్ .

Audio: https://youtu.be/jeK3Janyvq0

Songs- Our expression of Joy in Heart

Psalms 95:1 Come, let us sing for joy to the LORD; let us shout aloud to the Rock of our salvation.

If anyone asked us, what is your favourite song, we hardly take a moment and just sing it.
Songs are a way to express our joy and a beautiful way to remember words.

No wonder we remember few chapters of Psalms so well, as they were tuned to beautiful songs.
We also see in word of God to greet each other with songs and hymns.

Do you know God also loves to sing; Zephaniah 3:17 says God exalts over his people with loud singing.
Very rightly, Author John Mac Arthur says this way-"The spirit filled life produces music. Whether he has a good voice or cannot carry a tune, the spirit filled Christian is a singing Christian. Nothing is more indicative of a fulfilled life, a contented soul, and a happy heart than the expression of song"

Let us imitate our God by exalting Him with a joyful heart and shouts of praise through singing. As our scripture says in Psalm 95:1 Come, let us sing for joy to the LORD; let us shout aloud to the Rock of our salvation. Amen ..God Bless you.

Audio: https://youtu.be/0Hd_uUrfNeQ