నీటి ఊటలు | Water Springs


  • Author: Anudina Vaahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 4
  • Reference: Sajeeva Vahini - Daily Devotion

యోహాను 4:15 ఆ స్త్రీ ఆయనను చూచి అయ్యా,నేను దప్పిగొనకుండునట్లును, చేదుకొనుట కింతదూరము రాకుండునట్లును ఆ నీళ్లు నాకు దయచేయుమని అడుగగా
నీటి ఊటలను వీక్షించడం ఒక అందమైన ప్రశాంతమైన అనుభవం. నీటి ఊటలు భూమి నుండి ఉద్భవించే మంచినీటి వనరులు మరియు తరచుగా దట్టమైన వృక్షసంపద వన్యప్రాణులచే చుట్టుముట్టబడతాయి. నీటి ఊటలు ఎల్లప్పుడూ కదులుతూ ఉల్లాసంగా ఉంటాయి.

ఆధ్యాత్మిక నీటి ఊటలు మన రక్షణకు సాదృశ్యమైన జీవజలాన్ని సూచిస్తాయి. ప్రయాస లో ఉన్నవారికి, వారి భారాన్ని తొలగించుకొని, శాంతిని కోరుకునే వారికి, ఆధ్యాత్మిక దాహాన్ని తీర్చడానికి ఈ నీటి ఊటల దగ్గర సేదదీరమని దేవుడు ఆహ్వానిస్తున్నాడు.  ఈ సజీవమైన నీటి ఊటలైన యేసు క్రీస్తు వద్దకు మనం వచ్చినప్పుడు, ఎడారి మోడైన మన స్థితిని తిరిగి పునరుద్ధరిస్తుంది, మన జీవితాలను పవిత్రపరుస్తుంది.

ఆధ్యాత్మిక దాహం తీర్చుకోవడానికి యేసు క్రీస్తు ఒక్కడే ఏకైక మార్గం, అది మనల్ని రక్షణ కోసం, శాంతి మరియు ప్రశాంతత యొక్క స్థానానికి నడిపిస్తుంది. ఈరోజు మనం చేయవలసిందల్లా ఆయన యెదుట సాగిలపడి, మన హృదయాన్ని జీవితాన్ని ఆయనకు సంపూర్ణంగా సమర్పించుకొని ఈ నీటి ఊటల వద్ద సేదదీరడమే. ఈ రోజు మీ హృదయాన్ని తెరిచి, ఆయన్ను ఆహ్వానించండి మరియు దాహాన్ని తీర్చడానికి రక్షణ యొక్క ఈ జీవజలాన్ని ప్రార్ధన ద్వారా అడగడానికి ప్రయత్నించండి. ఆమెన్.

అనుదిన వాహిని
https://youtu.be/x1Zc04ZwbAM

Water Springs 

John 4 : 15 The woman said to him, "Sir, give me this water so that I won-t get thirsty and have to keep coming here to draw water."

Witnessing a natural spring can be a beautiful and peaceful experience. Springs are sources of fresh water that emerge from the ground and are often surrounded by lush vegetation and wildlife.Water springs are always  moving and lively,giving away life to all the plants and animals including Humans
In spiritual realm,water springs denote  the living water of salvation.Any one who is burdened and needs peace ,God is inviting to sit by these springs to quench spiritual thirst.

 The living water of salvation cleanses us from all unrighteousness when we come to Jesus,our living Water spring.
He is the only one,only way,only resource to quench the thirst,that will satisfy us for eternity,to the place of peace and serenity.
All you need is to bow down before Him,surrender your heart and life and acknowledge your need to drink from the living water of salvation.
Open your heart and invite him today and ask for this living water of salvation to quench all thirst.Amen. God Bless!

Connecting With God
https://youtu.be/I4MMPLGu_fI