భయపడకుడి | Do not be afraid


  • Author: Anudina Vaahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi |
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 3
  • Reference: Sajeeva Vahini - Daily Devotion

భయపడకుడి

1 సమూయేలు 12:20 అంతట సమూయేలు జనులతో ఇట్లనెను భయపడకుడి, మీరు ఈ కీడు చేసిన మాట నిజమే, అయి నను యెహోవాను విసర్జింపకుండ ఆయనను అనుసరించుచు పూర్ణహృదయముతో ఆయనను సేవించుడి.

ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి తమ రాజుగా తిరస్కరించి, బదులుగా తమకొక మానవ రాజును కోరుకున్న సందర్భాన్ని గుర్తుచేస్తుంది. అయితే, ప్రవక్తయైన సమూయేలు ఆ ప్రజలతో,  వారి ఎంపిక యొక్క పరిణామాల గురించి హెచ్చరించాడు మరియు నిజమైన నాయకత్వం దేవుని నుండే వస్తుందని వారికి గుర్తు చేశాడు.

ప్రజలకు ప్రవక్త చెప్పిన మాటలు నేటికీ మనకు గుర్తుగా ఉంటాయి. మనం ఎలాంటి పొరపాటులు చేసినా, ఎలాంటి పాపాలు చేసినా, దేవుని వైపు తిరగడానికి భయపడకూడదు. దేవుడు ప్రేమ పూర్వకంగా మనల్ని ఆహ్వానించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు.

అయితే దేవుని నుండి క్షమాపణ పొందుకోవాలని కోరుకోవడం కంటే పశ్చాత్తప హృదయం కలిగియుండడం అత్యంత ప్రాముఖ్యమైనదని ప్రవక్త మనకు గుర్తు చేస్తున్నాడు. మనము మన పాత స్వభావాలను విడిచిపెట్టి, మన పూర్ణహృదయముతో దేవుణ్ణి సేవించడానికి పూర్తిగా కట్టుబడి ఉండాలి. దీనర్థం మనం మన జీవితాల్లో దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి, మన స్వంతదాని కంటే ఆయన ఇష్టాన్ని వెదకాలి మరియు ఆయన ఆజ్ఞలకు లోబడి జీవించాలి.

ఈరోజు, మీరు పాపంతో పోరాడుతున్నట్లయితే లేదా దేవునికి దూరమైనట్లు భావించినట్లయితే, సమూయేలు మాటలను గుర్తుంచుకోండి: " భయపడకుడి, పూర్ణహృదయముతో ఆయనను సేవించుడి." మనము మనస్పూర్తిగా ఆయనను అనుసరించాలని కోరుతూ ఆయన క్షమాపణ మరియు మార్గదర్శకత్వం కోసం పశ్చాత్తాపపడిన హృదయాలతో దేవుని వైపుకు తిరిగి వెళ్దాం. అట్టి మనసు ప్రభువు మనందరికీ దయజేయును గాక. ఆమెన్.

Telugu Audio: https://youtu.be/kGcl-8wMxAc

Do not be afraid

1 Samuel 12:20 says, "And Samuel said to the people, -Do not be afraid; you have done all this evil. Yet do not turn aside from following the Lord, but serve the Lord with all your heart.-"

This verse remembers a moment in Israel-s history when they had rejected God as their king and asked for a human king instead. Samuel, the prophet, was warning the people of the consequences of their choice and reminding them that true leadership comes from God.

Samuel-s words to the people serve as a reminder to us today as well. No matter what mistakes we have made or what sins we have committed, we should not be afraid to turn back to God. He is always waiting with open arms to welcome us back into His loving embrace.

But Samuel also reminds us that true repentance involves more than just asking for forgiveness. We must turn away from our old ways and fully commit ourselves to serving God with all our heart. This means that we must put God first in our lives, seeking His will above our own, and live in obedience to His commands.

Today, if you have been struggling with sin or feeling distant from God, remember Samuel-s words: "Do not be afraid...serve the Lord with all your heart." Let us turn back to God with repentant hearts, seeking his forgiveness and his guidance as we seek to follow him wholeheartedly. Amen.


English Audio: