దేవునికి మరుగైనది ఏదైనా ఉన్నదా?


  • Author: Anudina Vaahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi |
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 3
  • Reference: Sajeeva Vahini - Daily Devotion

దేవునికి మరుగైనది ఏదైనా ఉన్నదా?

మీకు తెలుసా? 2015 నాటికి ప్రపంచమంతా 245 మిలియన్ల cctv కెమెరాలు అమర్చబడియున్నాయని అంతర్జాతీయ పరిశోధన సంస్థ వెల్లడిచేసింది. ప్రతీ సంవత్సరం 15 శాతం పెరుగుతూ 2020 నాటికి ఆ సంఖ్యా కొన్ని బిలియన్ల కెమరాలు మనలను పతీరోజు గమనిస్తూనే ఉన్నాయి. హోటల్స్, షాపింగ్ మాల్స్, రోడ్డుపై ట్రాఫిక్ సిగ్నల్ వంటి ఎన్నో ప్రదేశాల్లో అమర్చి దోపిడీలను, అక్రమాలను అరికట్టే ప్రయత్నం చేస్తున్నారనేది ఒకటైతే, మరో వైపు మానవుని రహస్య జీవనాన్ని బట్టబయలు చేయడంలో ఎటువంటి సందేహం లేదని నేనంటాను. ఇదిలా ఉంటే, సామాజిక మాధ్యమాలలో మనవాళ్ళు తమ వ్యక్తిగత సామాజిక జీవితాలను వారికి వారే ఇతరులకు తెలియజేసే స్థితి గతులను చూసినప్పుడల్లా ఆశ్చర్యమే కదా. 

ఏది ఏమైనా, నిఘా కేమేరాలు మన బాహ్య సంబంధమైన సంగతులను, సమాజం పట్ల జవాబుదారీతనాన్ని మాత్రమే  బధ్రం చేయగలదు కాని, మానవుని అంతరంగంలోని దైవ సంబంధమైన జవాబుదారీతనాన్ని ఏ విధంగా పరిశీలిస్తుందో గమనిస్తే, ఈ సంగతిని గూర్చి పరిశుద్ధ గ్రంథంలోని హెబ్రీ పత్రిక తెలియజేస్తుంది.  దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంతమట్టుకు దూరుచు, హృదయముయొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్ఠము ఏదియు లేదు. మనమెవనికి లెక్క యొప్పచెప్పవలసియున్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది (హెబ్రీ 4:12-13).

యేసు క్రీస్తు మన బలహీనతలయందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని, సమస్త విషయములలోను మనవలెనే శోధింపబడినను, ఆయన పాపము లేనివాడుగా ఉండెను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయముకొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము (హెబ్రీ 4:15-16). ప్రార్ధనలో క్రీస్తును ఎదుర్కొనే మనము, ధైర్యము కలిగినవారమై, దేవుని చెంతకు వచ్చు ప్రతీసారి అయన కృప పొందగలమనే నమ్మకం కలిగియుందము. ఆమెన్.

Telugu Audio: https://youtu.be/RXCJ4z1yP7I