శ్రేష్ఠమైన పేరు


  • Author: Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 2
  • Reference: Sajeeva Vahini

శ్రేష్ఠమైన పేరు 

యెషయా 56:5
నా యింటను నా ప్రాకారములలోను ఒక భాగ మును వారికిచ్చెదను కొడుకులు కూతుళ్లు అని యనిపించుకొనుటకంటె శ్రేష్ఠమైన పేరు వారికి పెట్టుచున్నాను కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను

దేవుడు మూడు విషయాలను వాగ్దానం చేస్తున్నాడు- తనను సంతోషపెట్టి, తన ఒడంబడికను గట్టిగా పట్టుకున్న వారికి సహాయం, అంగీకారం మరియు ఓదార్పు.
ఈ మహిమాన్వితమైన అవకాశం కేవలం ఇశ్రాయేలీయులకే కాదు కాని, ప్రజలందరికీ కూడా విస్తరింపజేయబడుతుంది. మనము ఇశ్రాయేలీయులము కాకపోయినప్పటికీ క్రీస్తును అంగీకరించిన మనము ఇప్పుడు ఆయన కుటుంబములో సభ్యులమైపోయాము. ఆయన కుటుంబములో, ఒకరు ఎక్కువ తక్కువ అనే బేధాలు ఉండవు. అందరూ సమానమే.

ఈరోజు మనము క్రీస్తును తెలుసుకోవడం వలన మన కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు లేదా ఎవరైనా మనల్ని నిషేధించినట్లయితే. దేవుడు మన పక్షాన ఉన్నాడని మరచిపోవద్దు. ఆయన మనతోనే ఉంటూ తన భవిష్యత్ ప్రణాళికతో కూడిన పరలోక కుటుంబంలో కూడా మనకు సభ్యత్వాన్ని ఇస్తున్నాడు. మనము దేవుని కుటుంబానికి చెందినవారము. నీ దైనందిన జీవితంలో ఆ దేవుని రాజ్యాన్ని ఇక్కడే అనుభవించడం ప్రారంభించు. నీవు జీవించే ప్రతి రోజు ప్రభువు రక్షణ హస్తము నీ చుట్టూ ఉండును గాక. ఆమెన్

Telugu Audio: https://youtu.be/kRaqmR59rPQ?feature=shared