పునరుద్ధరించే దేవుడు


  • Author: Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 1
  • Reference: Sajeeva Vahini

పునరుద్ధరించే దేవుడు

యెషయా 57:15 : నేను మహోన్నతమైన పరిశుద్ధస్థలములో నివసించు వాడను అయినను వినయముగలవారి ప్రాణమును ఉజ్జీవింప జేయుటకును నలిగినవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయముగలవారి యొద్దను దీనమనస్సుగలవారి యొద్దను నివసించుచున్నాను.

ఉన్నత పరిశుద్ధ స్థలంలో నివసించే సర్వాధికారియైన దేవుడు, తన అమితమైన ప్రేమ ద్వారా మనలను ఉజ్జీవింపజేయడానికి, నిరాడంబరమైన ఆత్మతో మన హృదయాలలో నివసిస్తాడు.   

ఈ రోజు మీరు ఎక్కడ ఉన్నా మరియు మీ పరిస్థితి ఎలా ఉన్నా దేవుడు మీ హృదయాన్ని పునరుద్ధరించడానికి సిద్ధంగా ఉన్నాడు. జీవిత పరిస్థితులు మీ ఆత్మను అణిచివేసినప్పుడు, విరిగి నలిగిన వారికి, పశ్చాత్తాపం గల హృదయాలకు దగ్గరగా ఉంటానని దేవుడు మనకు వాగ్దానం చేశాడు.

మనుష్యుల ఆలోచనలు చెడ్డవైనవని గ్రహించినప్పుడు, వారి హృదయాలోచనల ద్వారా ఎన్నో సమస్యలకు దారి తీస్తున్నాయని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రతి చెడు తలంపులను పునరుజ్జీవింపజేసి ఆశీర్వాదకరమైన జీవితాన్ని దయజేయగల సమర్ధుడు మనతో ఉన్నవాడు.  ఈ రోజు మీ కథను మార్చడానికి, మీకు ఎల్లప్పుడూ సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు...

మీ ఆరంభాలు చిన్నవి కావచ్చు కానీ మీరు ఆయనలో నిలిచియుంటే తగిన రీతిలో సరిదిద్దుతాడు.

అవును, పరిశుద్ధుడు శక్తిమంతుడైన దేవుడు మీ జీవితానికి కావలసిన మహిమాన్వితమైన ముగింపుని అందజేస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో చెప్పినట్లు మీలో నివసించడానికి ఈరోజు ఆయనను ఆహ్వానించండి. దేవుని కృప ఎల్లప్పుడూ మీతో ఉండును గాక. ఆమెన్.

Telugu Audio: https://youtu.be/M7OfXtbmiZY