దేవుని మంచితనం


  • Author: Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 1
  • Reference: Sajeeva Vahini

దేవుని మంచితనం

రూతు 2:12 యెహోవా నీవు చేసినదానికి ప్రతిఫలమిచ్చును; ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కలక్రింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి; ఆయన నీకు సంపూర్ణమైన బహుమాన మిచ్చునని ఆమెకుత్తర మిచ్చెను.

బోయజు తన పొలములో పరిగె ఏరుకోడానికి వచ్చిన యువతియైన రూతు పట్ల తన దయ మరియు దాతృత్వాన్ని ప్రదర్శించిన సందర్భంలో ఈ మాటలు పలికాడు బోయజు.

బోయజు మాటలను గమనిస్తే, రూతు తన అత్తగారైన నయోమి పట్ల విధేయత విశ్వసనీయతను గూర్చి, అతని కృతజ్ఞత మరియు ప్రశంసలను వెల్లడిస్తున్నాయి. కానీ అంతకంటే ఎక్కువగా, వారు దేవుని స్వభావం మరియు ఆయన ప్రజలతో ఆయనకున్న సంబంధాన్ని గురించిన లోతైన ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా సూచించాడు బోయజు.

ఇశ్రాయేలు దేవుని రెక్కల క్రింద రూతు భద్రత మరియు కాపుదాలను పొందినదని బోయజు అంగీకరించాడు. నయోమి పట్ల ఆమెకున్న విశ్వసనీయతను మరియనయోమి సేవించే దేవునిపై ఆమెకున్న నమ్మకాన్ని అతను గుర్తించాడు.

ఈ వాక్యం గురించి లోతుగా మనం ఆలోచించినప్పుడు, మనకు దేవుని యొక్క మంచితనం మరియు విశ్వాసం గుర్తుకు వస్తాయి. మనం కష్టాలను ఎదుర్కొంటున్నా లేదా అనిశ్చితి సందర్భాలు ఎదుర్కొంటున్నా, దేవుడు మనతో ఉన్నాడని, మనల్ని చూస్తున్నాడని మరియు మనకు ఏది అవసరమో దానికి దయజేస్తున్నాడని మనం నమ్మవచ్చు. మనం దేవుణ్ణి అనుసరించడానికి మరియు ప్రేమతో ఇతరులకు సేవ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, ఆయన తన స్వంత సమయంలో , తన స్వంత మార్గంలో మనకు ప్రతిఫలమిస్తాడని మనం నమ్మకంగా ఉండవచ్చు.

కాబట్టి దేవుణ్ణి నమ్మకంగా అనుసరించడానికి, ప్రేమతో దయతో ఇతరులకు సేవ చేయడానికి మనకు శక్తిని ఇవ్వమని అనుదినం ప్రార్ధన చేయాలి. మనము కూడా, రూతు వలె, దేవుని నుండి  గొప్ప ప్రతిఫలాన్ని పొందగలము. ఆమెన్.

అనుదిన వాహిని 
Telugu Audio: https://www.youtube.com/watch?v=QXz6yPArwgM