సమస్తము క్రీస్తు ద్వారా


  • Author: Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 1
  • Reference: Sajeeva Vahini

సమస్తము క్రీస్తు ద్వారా

పౌలు, తన పరిచర్యలో అనేక పరీక్షలు మరియు హింసలను ఎదుర్కొన్నాడు. సముద్ర మార్గంలో ఎన్ని సార్లు ఓడ బ్రద్దలైనప్పటికీ, పరిచర్యలో ఎన్నో కష్టాలను అనుభవించినప్పటికీ, అతను దేవునిలో బలాన్ని పొందాడు మరియఅన్ని పరిస్థితులలో సంతృప్తి చెందడం నేర్చుకున్నాడు. అతను కేవలం దేవునిపై తనకున్న విశ్వాసంపై ఆధారపడినందున అతని కలిగిన క్లిష్ట పరిస్థితులు తనను ప్రభావితం చేయలేకపోయాయి.

క్రీస్తును విశ్వసించేవారిగా, మన పరీక్షల సమయంలో మనం కూడా దేవునిలో నిశ్చయతను పొందాలి, మనం ఎదుర్కొనే ప్రతి సవాలు ఆయనపై ఎక్కువగా ఆధారపడటానికి సహాయపడుతుందని తెలుసుకోగలిగితే. మనకు ఎలాంటి ఆటంకాలు ఎదురైనా, ఫిలిప్పీయులకు 4:13 ప్రకారం “నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను”  అనే విశ్వాసాన్ని కలిగియుంటాము.

ఈరోజు, ప్రతి పరీక్షను సహించుటకు మరియు ఆయన చేత బలపరచబడుటకు ప్రభువు యొక్క పట్టుదల కొరకు ప్రార్థిద్దాం. ఆయనపై మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక. ఆమెన్.

అనుదిన వాహిని
Telugu Audio: https://www.youtube.com/watch?v=wrPWJoxS-5U