సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు


  • Author: Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 1
  • Reference: Sajeeva Vahini

సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు

ద్వితీయోపదేశకాండము 10:17 ఏలయనగా నీ దేవుడైన యెహోవా పరమదేవుడును పరమప్రభువునై యున్నాడు. ఆయనే మహాదేవుడు పరాక్రమవంతుడు భయంకరుడైన దేవుడు. ఆయన నరులముఖమును లక్ష్యపెట్టనివాడు, లంచము పుచ్చుకొననివాడు.

సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడైన దేవుడు న్యాయమైన దేవుడు నరులముఖమును లక్ష్యపెట్టనివాడు.
సమాజంలోమీరు ఏ స్థితిలో ఉన్నారో మరియు మీరు ఎంత ధనవంతులు లేదా పేదవారు, మీ రంగును బట్టి, మీ చదువు ఇవేవీ ఆయనకుముఖ్యం కాదు. ఆయన అందరికీ ఒకే దేవుడు మరియు సమస్త మానవాళికి దేవుడై, మన రక్షణకు కూడా మార్గం తానే అయ్యాడు.

మీ భూసంబంధమైన హోదాలు లేదా స్థానాలు మీ పరలోకపు ఆస్తులను ప్రభావితం చేయగలవని మీరు అనుకుంటే పొరపాటే. అందరునూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు.
ఆయన లేకుండా మన ఉనికి లేదని, మనకు ఉన్నదంతా ఆ సర్వశక్తిమంతుడి కృప మరియు దయ ద్వారా మనకు ఇవ్వబడిందని మనం మరచిపోకూడదు.

ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు మరియు ప్రతిదానిపై నియంత్రణ కలిగి ఉన్నాడు, ఆయన మహిమలో శక్తిలో గొప్పవాడు. ఈరోజు ఒక విషయాన్ని జ్ఞాపకము చేసుకొందాము. మనమందరమూ విశ్వాసముతో భక్తితో ఆయనకు భయపడితే, వాడబారని శక్తివంతమైన పరలోకపు కిరీటాలను దయజేయగలడని విశ్వసిద్దాం. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక. ఆమెన్.

అనుదిన వాహిని
Telugu Audio: https://youtu.be/MLCHbjgB-lA