కృతజ్ఞత కలిగిన జీవితాలు


  • Author: Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 1
  • Reference: Sajeeva Vahini

కృతజ్ఞత కలిగిన జీవితాలు

ఆత్మీయ జీవితంలో నైపుణ్యత మరింత పెరగాలని సూజన్ (Suzan) ఒక పాత్రని తీసుకొని, తన రోజువారి జీవితంలో యే సందర్భంలోనైనా దేవునికి కృతఙ్ఞతలు చెల్లించాలనే ఆలోచన వచ్చినప్పుడల్లా ఒక చీటీ రాసి ఆ పాత్రలో జారవిడిచేదంట. ఒక్కో రోజు 4 లేదా 5 చీటీలు రాస్తే కొన్ని సార్లు అసలు చీటీలు ఉండేవి కాదంటా. రోజులు గడిచాయి నెలలు గడిచాయి. ఓ రోజు సాయంత్రం ఆ పాత్రను ఖాళీ చేసి ఆ చీటీలన్నిటిని చదివింది. దేవుడు తన జీవితంలో ఇచ్చిన చిన్న చిన్న ఆనందాలను చదువుకుంటూ సంతోషించింది. మరి కొన్ని సార్లు ఏవిధంగా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొని దేవుడు చేసిన సహాయాన్ని జ్ఞాపకం చేసుకొని ఆనందించింది. అనేక సార్లు తానూ చేసిన ప్రార్ధనలు దేవుడిచ్చిన జవాబులను బట్టి దేవుణ్ణి మరింత స్తుతించడం మొదలు పెట్టింది. 

దావీదు అంటాడు "పచ్చికగల చోట్లను ఆయన నన్ను పరుండజేయు చున్నాడు శాంతికరమైన జలములయొద్ద నన్ను నడిపించుచున్నాడు. నేను బ్రదుకు దినములన్నియు కృపాక్షేమములే నా వెంట వచ్చును (కీర్తన 23:2,6)". 

మన జీవితంలో దేవునికి కృతఙ్ఞతలు చెల్లించగల సందర్భాలు ఎన్నో ఉంటాయి. అవి చిన్నవైనా పెద్దవైనా. ఎటువంటి పరిస్థితుల్లోనైనా దేవుని స్తుతించే జీవితాలు బ్రదికినంత కాలం కృపాక్షేమములే వెంట వస్తాయి. ఆమెన్.

Telugu Audio: https://youtu.be/BxGI9l1sTvg