నిత్య భధ్రత పాపము చేయడానికి అనుమతిని ధృవీకరిస్తుందా?


  • Author: Christian Tracts
  • Category: Articles
  • Reference: http://www.gotquestions.org/Telugu/Telugu-license-sin.html

నిత్య భధ్రత సిధ్దాంతమునకు తరచుగా వచ్చే ఆక్షేపణ ఏంటంటే ఒక వ్యక్తి తన కిష్టమువచ్చినట్లు పాపం చేసి మరియు రక్షింపబడటుకు ప్రజలకు అనుమతినిచ్చినట్లు కన్పడుతుంది. సాంకేతికంగా ఆలోచించినట్లయితే ఇది సత్యమే, వాస్తవికంగా అది సత్యం కాదు. ఒక వ్యక్తి నిజంగా యేసుక్రీస్తుచేత విమోచింపబడినట్లయితే ఆ వ్యక్తి తన ఇష్ట్టనుసారంగా పాపభూయిష్టమైనా జీవితం జీవించుటలో కొనసాగడు. ఒక క్రైస్తవుడు ఏ విధంగా జీవించాలి మరియు ఆ వ్యక్తి రక్షణను పొందుటకుగాను ఏమిచేయవలెనో, మనము వీటిమధ్య భేధమును గ్రహించియుండాలి.

బైబిలు గ్రంధమయితే చాల స్పష్టముగా చెప్తుంది రక్షణ కృపవలనే, కేవలం విశ్వాసము వలనే, యేసుక్రీస్తువలనే (యొహాను 3:16). ఒక వ్యక్తి నిక్కర్చిగా యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన క్షణములోనే అతడు లేక ఆమె రక్షింపబడి, ఆ రక్షణలో భద్రపరచబడియుంటారు. రక్షణ విశ్వాసమువలనే పొందుకొనుట ద్వారానే కాదు గాని, వాటితో క్రియలు కూడ చేస్తూ ఆ విశ్వాసమును కాపాడుకుంటారు ద్వార. అపోస్తలుడైన పౌలు ఈ విషయమును గలతీ 3:3 లో సంభోధించాడు. ఒకడు అడిగినప్పుడు మీరింత అవివేకులైతిరా? మొదట ఆత్మానుసారముగా ఆరంభించి, యిప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా? ఒకవేళ విశ్వాసమువలనే రక్షింపబడినట్లయితే మన రక్షణకూడ విశ్వాసముచేత భద్రపరచబడి కొనసాగబడుతూ వుండాలి. మన రక్షణను మనము సంపాదించుకొనలేము. అందునుబట్టి, మన రక్షణను కొనసాగించే స్థోమతను కూడ సంపాదించుకొనలేం. అది దేవుడు మాత్రమే మన రక్షణను కొనసాగిస్తాడు (యూదా 24). గనుక దేవునిచేతిలోనుండి మనలను ఎవరూ అపహరింపకుండా గట్టిగా పట్టుకొనును (యొహాను 10:28-29). అదే దేవుని ప్రేమ దానినుండి మనలను ఎవరునూ వేరుచేయలేరు(రోమా 8:38-39).

ఎటువంటి నిత్య భధ్రతనైనా ఉల్లఘించినట్లయితే , దాని తత్వములో ఒకనమ్మిక ఏంటంటే మన సొంత రక్షణను మంచిపనులద్వారా ప్రయత్నముల ద్వారా కొనసాగించాలనేది , ఇది పూర్తిగా కృపవలనే రక్షణ అనేదానికి విరుద్దమైనది. మనము రక్షింపబడ్డాము ఎందుకంటే క్రీస్తు అర్హమైన పాత్రాగా గాని మన సొంతగా కాదు (రోమా 4:3-8). అది మనది, అని హక్కును బహిర్గంగ చెప్పాలంటే దేవుని వాక్యమునకు విధేయత చూపించాలి లేక దేవుని మార్గాలలో నడిపించబడి రక్షణను కొనసాగిస్తూన్నాము అంటే మనము చెప్తునది యేసుక్రీస్తు నాపాపములకై చెల్లించిన వెల చాలదు. యేసుక్రీస్తు మరణమొందుట ద్వారా మన పాపములకై సంపూర్తిగా తగినరీతిలో వెల చెల్లించాడు- వర్తమాన, భూత, భవిష్యాత్కాలములకు , రక్షణముందు మరియు రక్షణ తర్వాత (రోమా 5:8; 1కొరింథీయులకు 15:3; 2 కొరింథీయులకు 5:21).

అయితే ఇది ఒక క్రైస్తవునికి తన తన కిష్టమువచ్చినట్లు పాపం చేసి మరియు రక్షింపబడటమా అని అర్థమిస్తుందా? ఇది కేవలం ప్రాధాన్యమైన ఊహాజనికమైన ప్రశ్నయే. ఎందుకంటే బైబిలు చాల స్పష్టంగా చెప్తుంది ఒక క్రైస్తవుడు తన కిష్టమొచ్చినట్లు జీవించడానికి వీలులేదు అని. క్రైస్తవులు నూతన సృష్టి ( 2 కొరింథీయులకు 5:17). క్రైస్తవులు ఆత్మీయవరాలను ప్రత్యక్షంగా ప్రదర్శిస్తారు (గలతీయులకు 5:22-23) గాని శరీరానుసారమైనవి కావు (గలతీయులకు 5:19-21). మొదటి యోహాను 3:6-9 స్పష్టముగా చెప్తుంది క్రైస్తవుడు పాపములో కొనసాగుతూ జీవించలేడు. ఈ నిందకు ఉత్తర్వుగా కృప పాపముచేయుటకు అనుమతిస్తుందని, అందుకే అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు ఆలాగైన ఏమందుము? కృపవిస్తరింపవలెనని పాపమందు నిలిచియుందుమా? అట్లనరాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇకమీదట ఏలాగు దానిలో జీవించుదుము? (రోమా 6:1-2).

నిత్య భధ్రత అనేది పాపము చేయటానికి అర్హతను ధృవీకరించుట కాదు. దానికన్నా, భధ్రత అంటే దేవునిని ఎరిగినందుకు, ఎవరతే క్రీస్తునందు విశ్వాసముంచుతారో వారికి దేవుని ప్రేమ పొందుటకు అభయమిస్తుంది. దేవుడిచ్చిన అధ్భుతమైన రక్షణ అనే వరాన్ని ఎరిగి దాని గ్రహించి పాపముచేయటానికి విరుధ్దముగా అర్హతను దృవీకరాన్ని సాధించటమే. యేసుక్రీస్తు మనపాపాలకు వెల చెల్లించాడనే సత్యాన్ని ఎరిగి పాపములో జీవిస్తూ ఎవరైనా ఏవిధంగానైనా పాపములో కొనసాగగలరు (రోమా 6:15-23)? దేవుని షరతులులేని ప్రేమను మరియు అభయమిచ్చే ప్రేమను విశ్వసించినవారికి అనుగ్రహించి ప్రేమను పొందుకొని ఎవరైనా ఏవిధంగానైనా దేవుని ముఖంవెనుకకు త్రిప్పికొట్టగలరు? అటువంటి వ్యక్తి నిత్య భధ్రతను పాపముచేయటానికి అర్హతను ధృవీకరించినదని ప్రదర్శించుట లేదుగాని, అతడు లేక ఆమే తప్పనిసరిగా యేసుక్రీస్తు ఇచ్చిన రక్షణానుభవములో కలిగిలేరు అనేది విశదమవుతుంది ఆయనయందు నిలిచియుండువాడెవడును పాపము చేయడు; పాపముచేయువాడెవడును ఆయనను చూడనులేదు ఎరుగనులేదు(1 యోహాను 3:6).