భవిష్యత్తును గూర్చిన తలంపులు


  • Author: Unleashed for Christ
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 7
  • Reference: Sajeeva Vahini

భవిష్యత్తును గూర్చిన తలంపులు :

ఫిలిప్పీయులకు 3:13 - "వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటికొరకై వేగిరపడుము."

మనందరమూ గతాన్ని కలిగియున్నాము గానీ ఆ గతం మనల్ని నిర్వచించలేదు.  ఓటమే అంతిమం కాదు.  బాధ శాశ్వతం కాదు.  క్రీస్తునందు ఎవ్వరూ ఓటమి చెందరు.  క్రీస్తునందు ఎవ్వరూ హీనము కాదు.  నీ గతాన్ని నీవు వెంటాడినంత కాలము నీ భవిష్యత్తుమీద దృష్టిసారించలేవు.  గతం గతించపోయినది.  దేవుడు మనకు ఎప్పుడూ నూతనారంభాన్ని దయచేయువాడు. గనుక నీ గతం నిన్ను ఎంతో బాధపెట్టేదైనా ఆ జ్ఞాపకాలు నిన్ను ఎంతగా హింసిస్తున్నా ఆయనయొక్క హస్తమును బలముగా పట్టుకొనుము.  ఆయన నీ భవిష్యత్తు గురించి ప్రణాళికను కలిగియున్నాడు అందుచేత విచారింపకుము.

ప్రార్థనా మనవి:

పరలోక తండ్రి!!! నా గతమును బట్టి నన్ను యెంచక నాకు నూతన ఆశను నూతనారంభాన్ని అనుగ్రహించినందుకు నీకు వందనములు.   నా గతమువైపు తిరిగి నన్ను కృంగనియ్యక ముందున్నవాటియందు చూచుటకు నన్ను నడిపించుమని యేసునామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్.


Future Thoughts:  

Philippians 3:13 - “Forgetting those things which are behind and reaching forward to those things which are ahead.” The truth is, all of us have a past, but that past does not have to define us. Failure is not final. Pain is not permanent—unless we choose to believe the lies. In Christ, no one is a failure. In Christ, no one is a loser. In Christ, no one is a mistake. So it’s time to begin anew. For if you keep carrying around the same bricks from your past, you’ll end building the same house in which you will live in the future. The past is the past. And there’s a reason it’s called that. Our God is a God of fresh starts, new beginnings and second chances.

While you may feel overwhelmed at times, paralyzed by a painful memory, holding on to a form of shame and guilt, God is not. The truth is He’s not interested in your past—but He is most definitely fully invested in your future.

Talk to The King:   

Heavenly Father, thank you for not judging by my past but giving me a hope for future. Help me never cling to my past but move on. In Jesus name, I Pray, Amen.