ఆసక్తి కలిగిన తలంపులు


  • Author: Unleashed for Christ
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 7
  • Reference: Sajeeva Vahini

ఆసక్తి కలిగిన తలంపులు:

తీతుకు 2:14 - "సత్‌క్రియలయందాసక్తిగల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసికొనెను". 

మనము దేవునియందు ఉత్సాహము కలిగిన వారిగా సృష్టింబడ్డాము.  ఆయన స్తోత్రార్హుడు.  మన ప్రేమను అందుకోతగిన దేవుడు.  ఆయన యొక్క అమోఘమైన కార్యశక్తిని చూచినవారు నిత్యము ఆయనయందు కృతజ్ఞులై సత్క్రియలయందు ఆసక్తిని కలిగి ఉంటారు.  కొందరు చూచినా సత్క్రియలయందు ఆసక్తిని కలిగిలేక కేవలం ఆయనను తీవ్రమైన భక్తితో ఆరాధిస్తారు. నీ నీ జీవితంలో ఏకాగ్రత, నీ భక్తి, నీ ప్రేమ ఎవరిపైన ఉన్నాయో సరిచూచుకో. అన్నీ మనం చూచినప్పుడు మనం దేవునికే  మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి.  మంచి విశ్వాసమును కలిగినవారిగా ఉండాలి.

ప్రార్థనా మనవి:

 ప్రియ పరలోక తండ్రి!!! పరలోకము చేర్చేయంత ప్రేమను నాపై కలిగియున్నందుకు నీకు వందనములు.  నా జీవితంలో ప్రతీ విషయంలో నీకే నా మొదటి ప్రాధాన్యతనిచ్చే భాగ్యాన్ని కలిగించుమని యేసునామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్.

Zealous Thoughts:  

Titus 2:14 -   “Purify for Himself His own special people, zealous for good works.” We were created to be zealous for God. He is worthy of our praise, our communication, our acknowledgment, and all of our love.  The appropriate response by those touched by God’s amazing work and power is continual thankfulness and a passion to share His hope. Those who recognize God’s greatness and awesome power can’t help but worship and praise God with overwhelming reverence. Check What in your life is competing for your attention, your devotion, and your love?  When listing the things in our lives that we speak most about, brag about, or take pride in, our Lord should be at the top. No one and nothing has the power of our God. Believers are to give all we are and all we have to God.

Talk to The King:   

Father God, I thank You that Your love for me stretches to the heavens and extends above the clouds. Remind me daily that everything and every person I place above You will fail me, but You never will. In Jesus’ name. Amen.