కృతజ్ఞతతో కూడిన తలంపులు


  • Author: Unleashed for Christ
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 7
  • Reference: Sajeeva Vahini

కృతజ్ఞతతో కూడిన తలంపులు :

లూకా 2:7 - "పొత్తిగుడ్డలతో చుట్టి, సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను".

ఏదైనా సున్నితమైనదానిని మనము బహుమతిగా యిచ్చేటప్పుడు పైన జాగ్రత్తగా వ్యవహరించమని పెద్ద అక్షరాల్లో రాస్తాము. దేవుడు మనకు దయచేసే బహుమానం కూడా ఎంతో సున్నితంగా ఉంటుంది. యేసుబాలుడే ఆ బహుమానం. ఒక గ్రీటింగ్ కార్డ్ మీద క్రిస్మస్ చిత్రాన్ని చూసినప్పుడు అది ఎంతో దివ్యంగా ఉంటుంది. కానీ ఒక తల్లికి మాత్రం మరియ ఆ సమయంలో ఎంత వేదనను అనుభవించిందో తెలుసు. ఎందుకంటే యేసు ఆమెకు మొదటి బిడ్డ. మరియు ఆయన ఎంతో అపరిశుభ్రంగా ఉండే పరిసరాల్లో ఆయన జన్మించాడు. అప్పుడే పుట్టిన చిన్నిబిడ్డను ఎంతో సున్నితంగా సంరక్షించుకోవాలి. వారికి సమయానికి ఆహారం ఇవ్వాలి. వారు ఏడుస్తుంటే లాలించి నిద్దురబుచ్చాలి. మరియ యేసుకి జన్మనిచ్చినప్పటి పరిస్థితుల్లో శిశుమరణాలు ఎక్కువగా ఉండేవి. బిడ్డకు జన్మనిచ్చిన వెంటనే తల్లి చనిపొయిన సందర్భాలు తరచూ జరుగుతుండేవి. మరి ఎందుకు దేవుడు తన కుమారుని ఈ లోకమునకు పంపడానికి అలాంటి పరిస్థితులను ఎంచుకున్నాడు? ఎందుకంటే యేసు మనలను రక్షించడానికి మనలా ఉండాలని కోరుకున్నాడు. దేవుని బహుమానం ఎంతో సున్నితంగా యేసుని స్వరూపంగా వచ్చింది. అందుకై మన దేవుని సంతోషముగా స్తుతించెదము.

ప్రార్థనా మనవి:

పరలోక తండ్రి!!! నీవు నాకు అందించిన ఈ గొప్ప బహుమానమును బట్టి నీకు వందనములు. మా కొరకు నీ మహిమను పక్కనపెట్టి నిన్ను నువ్వు ఎంతో తగ్గించుకొని ఈ లోకమునకు వచ్చావు. నిన్ను స్తుతించి నిన్ను అనుసరించే భాగ్యం మాకు ప్రసాదించుమని యేసునామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్.


Thankful Thoughts:

Luke 2:7 - “wrapped Him in swaddling cloths, and laid Him in a manger, because there was no room for them in the inn.” When we give a fragile gift, we make sure it is marked on the box that contains it. The word fragile is written with big letters because we don’t want anyone to damage what is inside. God’s gift to us came in the most fragile package: a baby. Sometimes we imagine Christmas day as a beautiful scene on a postcard, but any mother can tell you it wasn’t so. Mary was tired, probably insecure. It was her first child, and He was born in the most unsanitary conditions. A baby needs constant care. Babies cry, eat, sleep, and depend on their caregivers. They cannot make decisions. In Mary’s day, infant mortality was high, and mothers often died in childbirth. Why did God choose such a fragile way to send His Son to earth? Because Jesus had to be like us in order to save us. God’s greatest gift came in the fragile body of a baby, but God took the risk because He loves us. Let us be thankful today for such a gift.


Talk to The King: Father thank you for the amazing gift of Jesus Christ You have given us. Thank you for the low and humble way you have given Jesus so that even His birth may be an example to us. Help me imitate Christ in everything. In Jesus name, Amen.