ప్రేమను పొందే తలంపులు - Lovable Thoughts


  • Author: Unleashed for Christ
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 7
  • Reference: Sajeeva Vahini

ప్రేమను పొందే తలంపులు:
రోమా 5:8 - "అయితే దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను".

ప్రేమకు దేవుడు కలిగియున్న నిర్వచనానికి ఈ లోకము కలిగియున్న నిర్వచనానికి ఎంతో వ్యత్యాసం ఉన్నది. మనము ఒకరిపై కలిగియుండే ప్రేమ వారిలో మనకు సారూప్యమైన లక్షణమును బట్టి, వారి కలిగియున్న సౌందర్యమును బట్టి, అందమైన హృదయమును బట్టి, ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని బట్టి ప్రేమను కలిగియుంటాము. కానీ మనలో ఉన్న చెడ్డ లక్షణములను బట్టి మనపై ఎవరూ ప్రేమను కలిగియుండరు. కానీ దేవుడు మాత్రమే మనలను ఎలాంటి పక్షపాతం లేకుండా మనమెలాంటి వారమైనా
గొప్ప ప్రేమను మనపై కలిగియున్నాడు. ఈ ప్రపంచంలో మనం చూసే, పొందే మరియు ఇచ్చే ప్రేమకు ఒక కారణం ఒక పరిమితి ఉంటాయి కానీ దేవుని ప్రేమకు అవేమీయు లేవు. అదే నిజమైన ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ.

ప్రార్థనా మనవి:
ప్రియమైన తండ్రి!!! నాయెడల నీకున్న ప్రేమను బట్టి నన్ను పాపమునుండి రక్షించుటకై నా కొఱకు నీ అద్వితీయ కుమారుని ఈ లోకమునకు పంపినావు గనుక వందనములు. ఆయన ద్వారా నిత్యజీవాన్ని దయచేసావు నీకు స్తోత్రములు. ఆ స్వచ్ఛమైన ప్రేమను తెలుసుకొని నిన్ను స్తుతించి మహిమపరిచే భాగ్యాన్ని కలిగించుమని యేసునామములో ప్రార్థించుచున్నాము పరమతండ్రి, ఆమేన్.

Lovable Thoughts:
Romans 5:8- “But God demonstrates His own love toward us, in that while we were still sinners, Christ died for us.” The definition of "love" for the world is entirely different from God"s definition. Love in the world is always linked up with some or the other asset or positive quality of a person. It may be good looks, good heart, good character, great attitude , good physique etc. But none of us will consider a negative asset to base our love for someone. We may oversee some negatives over a higher amount of positives which we feel are good. But God has loved us in our sin. That"s the most negative thing anyone will detest. Because God knows Your entire list of sins. As the world is celebrating "Valentine"s Day", stop looking at worldly love. Instead you can find True Love only when you look at the cross.

Talk to The King:
Father God, I thank You for Your love and for sending your only begotten son to die for me. Thank You for not sparing Him to give me eternal life. Today help me realise what true love is. In Jesus name, I pray, Amen.