అప్పగింపు తలంపులు - Committing Thoughts


  • Author: Unleashed for Christ
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 7
  • Reference: Sajeeva Vahini

కీర్తనలు 37:5 - "నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యము నెరవేర్చును".
మనము యేసుక్రీస్తును సొంత రక్షకునిగా స్వీకరించినపుడు ఆయన యొక్క ఎడతెగని కృపను, శాంతిని పొందగలము. ఆయన మనందరి యెడల ఒక ఉద్దేశ్యమును కలిగియున్నాడు. మనము భయపడక స్థిరచిత్తులుగా ఉండవలెను. దేవునియందు విశ్వాసమును కలిగియుండడమంటే ముందు ఏమున్నదో మనకు తెలియకపోయినా ధైర్యముగా ముందుకు అడుగువేయడమే. మనము యోగ్యులము కాకపోయినా ఆయన మనయందు తన కార్యములను నెరవేర్చనుద్దేశించుచున్నాడు‌. మనము ఆయన చిత్తాన్ని అనుసరించని యెడల మన శక్తిని తెలుసుకోగలము. మన ఆత్మీయ జీవితాన్ని బలపరచుకోలేము.

ప్రార్థనా మనవి:
పరలోక తండ్రి!!! అన్నీ పరిస్థితుల్లో నీ యెడల విశ్వాసముంచుటకు సహాయము చేయము. నీయందు నమ్మకముంచుటకు సహాయము చేయమని యేసునామములో ప్రార్థించుచున్నాము పరమతండ్రి ఆమేన్.

Committing Thoughts:
Psalms 37:5 - “Commit everything you do to the Lord, trust Him, and He will help you.” When we receive Jesus as Lord and Saviour, we experience overwhelming peace on the inside. God begins to give us a sense of purpose for our lives. We need to be careful that we do not allow fear to prevent us from moving forward. Often we may feel unworthy and unqualified to do what God has planned for our lives. Trusting in God is like walking over the line, not knowing what is on the other side. Whether or not we feel qualified, we must trust that the Lord will help us accomplish His purposes for us, regardless of how great the task. We must be willing to trust in God and say yes. If we do not say yes to God, we may never discover our strengths and learn to flourish.

Talk to The King:
Father God, help me trust in You in all circumstances. Let me never doubt you. Help me trust Your purposes. In Jesus name, I pray, Amen.