ఆశ్చర్యకరమైన తలంపులు - Wonderful Thoughts


  • Author: Unleashed for Christ
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 7
  • Reference: Sajeeva Vahini

ఆశ్చర్యకరమైన తలంపులు:
కీర్తనలు 77:14 - ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే
దేవుడు నిన్ను మరిచాడని నీవు అనుకొనినట్లయితే నిశ్చయముగా నీవు ఆయనను మరిచిపోయావనే అర్థం. జీవితం నిన్ను ఎంతో శ్రమపెట్టినా దేవుడు నీ కొరకు గతములో చేసిన గొప్ప కార్యములవైపు చూడుము. మనకొఱకు ఎన్నిసార్లయినా ఆయన చేస్తాడు చేయగలడు. ఆయన యొక్క మహిమా ప్రభావములను ఎన్నడూ మరువకుము. ఆయన నీవు ఊహించిన దానికన్నా ఎన్నోరెట్లు అద్భుతకరుడు. కొన్నిసార్లు మనం జీవితం ఏదో అగాధంలోకి వెళ్ళిపోతున్నట్లు అనిపిస్తుంది ఎంతో చీకటి మనలను అలుముకున్నట్లు ఉంటుంది కానీ ఆ చీకటిలో మనకు వెలుగును అనుగ్రహించు దేవుడు మనకు తోడైయున్నాడు. ఆయన మన కొఱకు ఇంతవరకు చేసిన కార్యములను జ్ఞాపకం చేసుకోని ధైర్యముగా విశ్వాసముంచిన యెడల ఆశ్చర్యకార్యములను చూడగలవు.

ప్రార్థనా మనవి:
పరలోక తండ్రి!!! నీ అద్భుతకరమైన నామమును బట్టి నీకు వందనములు. నా శ్రమలలో నన్ను బలపరచినందుకు నీ శక్తిగల నామమునకు స్తోత్రములు. నీవు చేసిన ఉపకారములను నేనెన్నడునూ మరువక నిత్యం నిన్ను స్తుతించి మహిమపరిచే భాగ్యాన్ని కలిగించుమని యేసునామములో ప్రార్థించుచున్నాము పరమతండ్రి, ఆమేన్.

Wonderful Thoughts:
Psalms 77:14 - “You are the God who does wonders.” If you think God has forgotten you, then you have forgotten who God is. Even though life is treating you hard, remember what God has been to you and ponder on all His deeds in the past. If God has done something, He will and can do it again. Never forget His worth and capability. He is more able than your mind could ever imagine. Sometimes when we go through tough times it feels like we are in a deep abyss where we cannot see light. But remember God is very much present and available even in the deepest and darkest places. You remember what God has done. And dare to believe that what he’s done before, he will do again.

Talk to The King:
Father God, I thank You for the wonderful God you are. Thank You for the strength I receive in You in every troublesome situation. Help me never forget what You did for me. In Jesus name, I pray, Amen .