సిద్ధపాటు కలిగిన తలంపులు - Willing Thoughts

  • Author: Unleashed for Christ
  • Category: Devotions
  • Reference: Sajeeva Vahini

సిద్ధపాటు కలిగిన తలంపులు:
1 తిమోతికి 4:14 - "ప్రవచనమూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకుము".
దేవుడు నీయందు ఒక కార్యము చేయదలచినప్పుడు ఆయన నీపై ఉంచిన మహిమను గ్రహించి నిన్ను ఆటంకపరచువాటిని, భయపెట్టువాటిని జయించాలి. నీవు క్రీస్తువాడవని పరిశుద్ధాత్ముని శక్తి నీలో ఉన్నదని గ్రహించాలి. ఆయన మనలో ప్రతీ ఒక్కరికీ ఒక్కొక్క బహుమానములను అనుగ్రహించాడు అవి ఆత్మసంబంధమైనవి వాటిని నిర్లక్ష్యపెట్టకూడదు. నీవు ఆయనకు లోబడినప్పుడు నీ జీవితం మొత్తం మారిపోతుంది. నీకు ముందర ఆయన సన్నిధి నడుచుచున్నది. సిద్ధపాటు మనస్తత్వాన్ని కలిగియున్న వారిని ఆయన కోరుకొనుచున్నాడు.

ప్రార్థనా మనవి:
పరలోక తండ్రి! నీ కృప వలన మరొక నూతన నెలలోనికి ప్రవేశించుచున్నాము గనుక నీకు వందనములు. నీ చిత్తానికి లోబడి జీవించుటకు సహాయము చేయము. బలమైన విశ్వాసమును కలిగి నీ కృపలో వర్థిల్లుటకు సహాయము చేయమని యేసునామములో ప్రార్థించుచున్నాము పరమతండ్రి ఆమేన్.

Willing Thoughts:
I Timothy 4:14- “Do not neglect the gift that is in you, which was given to you.” When God puts something in you that you are called to do, you must learn to break intimidation and recognize that you are graced to accomplish His purposes. You must remind yourself of who you are in Christ and that the power of the Holy Spirit is in you to do all things in Jesus’ name. As you are obedient to God, He will take you through a process of overcoming fear and preventing it from taking hold of you and keeping you from doing what God has called you to do. Fear holds us back from doing anything. When you decide to obey the Lord and step out in faith, your life will change. His presence will go before you, and you just have to follow. As you step out, others will do the same. God wants willing vessels to be His hands and feet.

Talk to The King:
Father, as I enter into a new month, help me be willing to obey Your purposes in my life. Help me step out in faith. Lead me in Your grace. Amen.