బైబిల్ క్విజ్ - 2


 • Author: Jyothi Swaraj
 • Category: Bible Quiz
 • Reference: Sajeeva Vahini Feb - Mar 2011 Vol 1 - Issue 3

 • 1. తూర్పు దేశపు జ్ఞానులు దేనిని చూచి యెరూషలేమునకు వచ్చిరి? ఎందుకు వచ్చిరి?
 • 2. సువార్తలలో ఉన్న దానిని బట్టి మొదటి క్రిస్మస్ ఎక్కడ జరపబడింది?
 • 3. యేసుని చంపించాలని పన్నాగం పన్నిన రాజు ఎవరు?
 • 4. యేసుక్రీస్తు జననం గూర్చి ఈ ప్రవచనం ఇదిగో కన్యక గర్భవతియై కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టబడును అని పలికిన ప్రవక్త ఎవరు?
 • 5. తూర్పు దేశపు జ్ఞానులు యేసుని కనుగొని,కలుసుకొనుటకు వచ్చినప్పుడు ఆయనకు సుమారుగా ఎంత వయసు కలదు?
 • 6. ఎన్ని దినములకు బాలుడైన యేసుకు సున్నతి చేసారు?
 • 7. రోమీయులు జరుపుకొనే మన క్రిస్మస్ లాంటి పండుగ ఏది?
 • 8. యే దూత ద్వారా మరియకు ప్రత్యక్షమై ఎలీసబెతు గర్భవతి అని తెలియజేసింది?
 • 9. ఎన్ని మాసములు మరియ ఎలీసబెతు తో కలిసి వుండెను?
 • 10. మరియ గర్భవతియైన ఎలీసబెతును ఎవరి ఇంటిలో కలిసింది?
 • సమాధానాలు : 1. నక్షత్రం 2. బెత్లెహేము లో యేసు వుండిన ఇంటిలో3. హేరోదు 4. యెషయా 5. రెండు సంవత్సరముల లోపు 6. 8 7. సతుర్నలియా 8. గాబ్రియేలు 9. 3 నెలలు 10. జెకర్యా