Day 8 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)


  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

వారిని, నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెన కరముగా చేయుదును. ఋతువుల ప్రకారము వర్షం కురిపించెదను, దీవెనకరమగు వర్షములు కురియును (యెహెజ్కేలు 34: 26).

ఈ వేళ ఎ ఋతువు? అనావృష్టి కాలమా? వర్ష ఋతువు ఇంకెంతో దూరం లేదు. గొప్ప భారంతో కూడిన మబ్బులు కమ్మిన కాలమా? వర్ష రుతువు వచ్చేసింది. నీ బలం దిన దినం అభివృద్ధి చెందుతుంది. దీవెనకరమైన వర్షాలు కురుస్తాయి. ఇక్కడ బహువచనం ఉంది. అన్ని రకాలైన దీవెనలను దేవుడు కురిపిస్తాడు. దేవుని దీవెనలన్నీ కలిసికట్టుగా వస్తాయి. బంగారు గొలుసులోని లింకుల్లాగే అన్ని ఒకదానివెంట ఒకటి వస్తాయి. మారుమనసు పొందడానికి ఆయన కృపనిస్తే నిన్ను ఆదరించే కృపలను కూడా ఆయన ఇస్తాడు. ఆయన "దీవెనకరమైన వర్షాలు" కురిపిస్తాడు. ఎండిపోయిన మొక్కలుల్లారా, పైకి చూడండి. మీ ఆకుల్ని, పువ్వుల్ని విప్పండి. పరలోక వర్షాలు మిమ్మల్ని తడుపుతాయి.

దిగుడులోయగా మార్చుకో నీ గుండెను
అది నిండి, పొంగి పోర్లేదాకా
దేవుడు కురిపిస్తాడు దీవెన వర్షాన్ని

ప్రభూ, నా ముల్లుని నువ్వుగా మార్చగలవు. నా నివేదన ఇదే. యోబు జీవితంలో వర్షం తర్వాత ఎండ కాసింది. కాని కురిసిన వర్షం అర్థం కాలేదుగా. యోబు అడిగాడు.నేను అడుగుతున్నాను. వర్షం తర్వాత వచ్చే తళతళలకూ వర్షానికి సంబంధం లేదా? నువ్వు చెప్పగలవు - నీ సిలువ చెప్పగలదు. నీ బాధల్లో కిరీటం ఉంది ప్రభూ, ఆ కిరీటం నాకు కావాలి. వర్షం కురిసి వెలిసిన తర్వాత ఉండే తళతళల్లోని తళుకుని నాకు బోధపరచు. అప్పుడే నేను జయాశీలిగా ఉండగలను.

జీవితం ఫల భరితం కావాలంటే సూర్యరశ్మితో పాటు వర్షం కూడా కావాలి.

ఎండి పగుల్లువారినానేలపై
జీవవాయువు పోసే వర్షం కావాలి
ఆ వర్షానికి తమ శాఖలు తడిశిపోవచ్చు
ధరణితలం హరిత శాద్వలంగ మారాలంటే
మబ్బు నీళ్ళు కావలసిందే!

భయాల మొయీళ్ళు
బాధల వర్షాన్ని మోసుకోచ్చాయీ
బ్రతుకు భూమీపై కురిసి
గుండెలోతుల్లోకి తేమను తెచ్చాయీ

దేవుని దివ్య సూత్రాన్ని ఆచరించగా పగుళ్ళు విచ్చిన దిగుళ్ళ నేలలో
పచ్చదనం మందహాసం చేసింది
నిన్ను ఆవరించిన ప్రతి కారుమబ్బులో
పౌలు రాసిన పవిత్ర హక్కులు గమనించు
ఈ మేఘాలు నీ ఆత్మకు క్షేమాలు
అవి నీకు మేలే చేస్తాయీ
అది నీవు గుర్తించు