పునరుద్ధరణకు మూలం దేవుడు


  • Author:
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 6
  • Reference: Sajeeva Vahini

పునరుద్ధరణకు మూలం దేవుడు అయి ఉండి, మానవత్వ పునః నిర్మాణ ప్రణాళికలలో పాల్గొనమని మనలను ఆహ్వానిస్తున్నాడు.

ఆయన మనకు పరిశుద్ధాత్మను ఇస్తాడు. తద్వారా మన రోజువారి జీవితంలో పునరుద్ధరణ కొరకు కావలసిన సామర్ధ్యము, సాధనాలను కలిగి ఉంటాము. (ప్రతీ రోజు మన జీవితంలో పునరుద్ధరణ కోరే శక్తి, సాధనాలను కలిగి ఉండటానికి ఆయన మనకు పరిశుద్ధాత్మను ఇస్తాడు.)

మనము దేవునిని ప్రేమిస్తాము, అంతేకాకుండా ఆయనను సేవించాలనుకుంటున్నాము, కాని తరచుగా ఆయన ఆత్మను మరియు మార్గదర్శకత్వాన్ని విస్మరిస్తూ పాపములో కొనసాగుతూ ఉంటాము.

సర్వజ్ఞుడైన దేవునికి ఇది తెలుసు, దేవుని ఆత్మపై మన మనస్సులను నిరంతరం లగ్నం చేయడానికి సహాయపడే సంగతులను ఆయన కల్పిస్తూ ఉంటాడు.

నీవు ఒంటరివి కావు; నిస్సహాయంగా లేవు. దేవుడు మన మొరలను వింటాడు, సమ్రక్షిస్తూ ఉంటాడు. ఆయన నీ ప్రార్థనలను వినాలనుకుంటాడు, నీ పాపాలను క్షమించాలని కోరుకుంటాడు, నీ సంఘంలోని వ్యక్తులను నీకు సహాయం చేయడానికి వాడుకుంటాడు. నిన్ను బలపరుస్తాడు. ఆమేన్.