మెళుకువ


  • Author: Rev. Anil Andrewz
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 6
  • Reference: Sajeeva Vahini Daily Inspirations

మెళుకువ

Audio: https://youtu.be/US7G-vKwVz8

మార్కు 13:34 లో ఒక మనుష్యుడు తన యింటిలో ఉన్న దాసులకు అధికారమిచ్చి ఇంటిలో ఉన్న ప్రతివానికి వాని వాని పని నియమించి దేశాంతరము వెళ్లెను. ఇక్కడ సంఘము గురించి వ్రాయబడింది. దేవుడు సంఘములో దాసులకు అధికారం ఇచ్చి, ప్రతివానికి వానివాని పని నియమించాడు. కాని, కొంతమంది దేవుని పని చేయకుండా ఈ పని నాదికాదని తప్పించుకొని తిరుగుతున్నారు. మరి కొందరైతే మంచి పేరు వచ్చే పనులనే కోరుకుంటారు.

ప్రతి క్రైస్తవుడు దేవుని పని చెయ్యాలి. దేవుడు చెప్పిన పని చేయాలి. దేవునికి మెప్పు తెచ్చే విధముగా పని చెయ్యాలి. మత్తయి 20:16 లో ద్రాక్షతోట యజమాని దగ్గర పని ఉంది. పనిచేసేవారికి ఇవ్వడానికి జీతము కూడ ఆయన దగ్గర ఉంది. దేవుని పని అంటే వాక్యము బోధించుట మాత్రమే కాదు. సంఘములో చా లా పరిచర్యలు ఉన్నాయి. అవి చేయవలసిన బాధ్యత క్రైస్తవుడు అని పిలువబడే ప్రతి ఒక్కరిది. కాని, కొంతమంది నిర్లక్ష్యముగా జీవిస్తున్నారు. క్రీస్తుని తెలుసుకొనక ముందుకంటే, క్రీస్తుని తెలుసుకొనిన తరువాతనే ఎక్కువగా పాపం చేస్తున్నారు.

రక్షణ, బాప్తిస్మము అంటే పాపాములనుండి విడుదల పొందుకోవడమే కాదు ఆ పాపము వైపునకు మళ్ళీ వెళ్లకూడదని మరచి, భయం విడచి పాపం చేస్తున్నారు. ఇల్లు కట్టుకోవాలి, పెళ్లి చేసుకోవాలి, ఏ కష్టం లేకుండా సుఖముగా జీవించాలని సంవత్సరాలు సంవత్సరాలు ఆలోచిస్తున్నారే కాని,ఆత్మీయముగా ఎలా ఎదగాలి? పరలోక ధనం ఎలా సంపాదించాలి?
అని దినములో కొన్ని నిమిషములు కూడా ఆలోచించలేకపోతున్నారు.

ప్రియా స్నేహితుడా, మన రక్షకుడు, విమోచకుడైన యేసుక్రీస్తు మనకు నియమించిన పనిని చేస్తూ మెలుకువ కలిగి జీవించుటకు ప్రయత్నిద్దాం.