క్రీస్తులేకుండా మనము ఏమీ చేయలేము

  • Author:
  • Category: Devotions
  • Reference: Sajeeva Vahini

యోహాను 15:5 ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నాయందు నిలిచియుండునో నేను ఎవనియందు నిలిచి యుందునో వాడు బహుగా ఫలించును

- మన రక్షణ కొరకు మరియు ప్రతీవిధమైన ఆశీర్వాదముల కొరకు మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువు కారకుడై యున్నాడు.

- ఆయన దేవుని కుమారుడై మనకు మధ్యవర్తిగా ఉండి, పాప శరీరమందు జన్మించి ద్రాక్షావల్లితో పోల్చబడుతున్నాడు.

- ఈ విధంగా ప్రతి తీగ భారం ఆ వల్లి భరిస్తుంది అదే విధంగా అయన మన ప్రతీ పాపమును భరించాడు.

- అంతే కాకుండా తన మరణ పునరుద్ధానం ద్వారా మన పాపములవలన ఆయన మరణించి మనలను మరల బ్రదికింప జేసి ఆ నిజమైన ద్రాక్షావల్లియైన యేసు క్రీస్తు ప్రభువుతో చిగురింప చేసి నిత్యజీవమనుగ్రహించాడు.

- ఇట్టి మహా అద్భుతమైన మహిమను క్రీస్తు ద్వారా మనకనుగ్రహించెను. అంతేకాకుండా, యేసు క్రీస్తు ప్రభువు చిగురించబడుటకు కారకుడై యున్నాడు ఎట్లనగా తీగలైన మనము ఫలించాలి అంటే ఆయనలో మనము ఇమిడి యుండాలి, ఆయనలో మనము నిలిచి యుంటేనే, ఆయన మనలో ఉంటాడు.

అంతేకదా! క్రీస్తులేకుండా మనము ఏమీ చేయలేము. మంచి ఫలము ఫలించాలి అంటే ఆయనలో నిలిచి యుండాలి.