సర్వజ్ఞానం


  • Author: Dr. G. Praveen Kumar
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 5
  • Reference: Sajeeva Vahini Daily Inspirations

సర్వజ్ఞానం

చురుగ్గా ఉండే చిన్న బిడ్డలను ప్రశ్నలు అడిగితె సమాధానం వెంటనే చెప్పేయగలరు. సమాధానం సరైనదా లేదా అనే ఆలోచన వారికి ఉండదు కాని వారి ఉద్దేశం “నా కన్నీ తెలుసు”. వాస్తవానికి చిన్న బిడ్డల కంటే పెద్దవారికే బాగా తెలుసు. తరుచు మన దగ్గర జవాబుల కంటే ప్రశ్నలే ఎక్కువగా ఉంటాయి. అనేకసార్లు మనకు ప్రతీ విషయం తెలియకపోయినా, అన్నీ ఎరిగిన దేవునికి సమస్తము తెలుసు అన్నది మరచిపోయి జీవిత మంతా ఎందుకు, ఎప్పుడు, ఎలాగా అన్నవాటిని గురించి ఆలోచిస్తూ ఉంటాము.

అన్నీ ఆవరించి, మన అంతరంగాన్నంతా ఎరిగే దేవుని సర్వజ్ఞానాన్ని గూర్చిన సంగతులను కీర్తనా కారుడు కీర్తన 139:1,3 లో ఇలా అన్నాడు “యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలిసికొనియున్నావు...నా నడకను, నా పడకను నీవు పరిశీలించియున్నావు. నా చర్యలన్నిటిని నీవు బాగుగా తెలిసికొనియున్నావు”. దేవుడు మనలను సంపూర్ణంగా ప్రేమిస్తున్నాడని, మనం ఈ రోజు ఎదుర్కోబోయే వాటన్నిటిని గూర్చి ఆయనకు తెలుసని, జీవితంలో ప్రతి పరిస్థితి లో అత్యుత్తమ మైన రీతిలో ఎలా సహాయం చెయ్యాలో ఆయనకు తెలుసని మనం గ్రహించినప్పుడు, అది మనకు ఎంతో ఆదరణ కలుగజేస్తుంది.

పరిమితమైన మన జ్ఞానం కంటే, అపరిమితమైన జ్ఞానం కలిగిన వానిని ఎరిగినప్పుడే మన జీవితం ఆశీర్వాదకరమవుతుంది. సర్వాధికారి, సర్వాంతర్యామి, సర్వజ్ఞాని యైన దేవుని హస్తాల్లో మనం ఉంటేనే మన జీవితం ధన్యకరమవుతుంది. ఆమెన్.

Audio: https://youtu.be/LIiS9xbWxbI