Daily Bible Verse
"నీవు పోయి, పండుకొమ్ము, ఎవరైన నిన్ను పిలిచినయెడలయెహోవా, నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞనిమ్మని చెప్పుమని సమూయేలుతో అనగా సమూయేలు పోయి తన స్థలమందు పండుకొనెను. "
1 సమూయేలు 3:9
Daily Bible Quote
"వాని మూఢతచొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తర మిమ్ము ఆలాగు చేయనియెడల వాడు తన దృష్టికి తాను జ్ఞానిననుకొనును." సామెతలు 26:5
Whats New
Whatsapp Share Feature Updated

New direct Whatsapp Share is available for Daily Verse, Quote and Devotion

Download PDF Bible

Download Telugu and English parallel bible as PDF for free on this link PDF Parallel Bible Download Here.

Download Telugu Audio Bible for free

You can now download the entire telugu audio bible for free on this link Telugu Audio Bible Download Here

Telugu Cross Reference Bible

Telugu Bible update now with Cross Reference

Telugu Audio Bible

Telugu Audio Bible is updated for all the scriptures.. Read & Listen. Now!! its Free..

Explore
Celebrating the Blessed and Glorious 10 Years of Sajeeva Vahini since 2009. Its been a decade now for Telugu Bible Online!. Thank you for your prayers and support to reach millions across the globe.
Anniversary Update: Read Telugu Bible with Chain and Cross References Online!. Click Here!. Introducing Daily Inspirations along with Daily Devotions on Home Page.
Share on Whatsapp Daily Inspiration

అతడు మాటలాడుట చాలింపక ముందే... అబ్రాహామను నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక; ఆయన నా యజమానుని తన కృపను తన సత్యమును చూపుట మానలేదు (అనెను) (ఆది 24: 15,27).

యధార్ధమైన ప్రతి ప్రార్ధనకి ఆ ప్రార్థన ముగియకముందే జవాబు దొరుకుతుంది. మనం మాటలాడుట చాలించకాకముందే మనవి అంగీకరించబడుతుంది. ఎందుకంటే దేవుడు ఎప్పుడో మాట ఇచ్చాడు. క్రీస్తు నామం పేరిట (అంటే క్రీస్తుతో ఏకమై అయన చిత్త ప్రకారం) విశ్వాసంతో మనం అడిగినవన్నీ అనుగ్రహింపబడుతాయని.

దేవుని మాట నిరర్ధకం కానేరదు. ప్రార్ధనకి సంబంధించిన ఈ కసిని నిబంధనను మనం అనుసరిస్తే, మన ప్రార్థిస్తున్నప్పుడే మన ప్రార్థనలకి జవాబు వస్తుంది. పూర్తి అవుతుంది. అది ఇహలోకంలో మన కంటికి కనిపించడం అసాధ్యం అయితే కావచ్చు.

కాబట్టి ప్రతి ప్రార్ధనను స్తుతులతో ముగించడం అలవాటు చేసుకోవాలి. అడుగుతున్నప్పుడు జవాబు ఇచ్చేసిన దేవుణ్ణి కీర్తించాలి. ఆయన తన కృపని, సత్యాన్ని చూపించడం మానడు (దానియేలు 9: 20-27, 10: 12 కూడా చదవండి).

మనం ఒక ఆశీర్వాదం వస్తుందని ఎదురు చూసేటప్పుడు అది విశ్వాస సహితంగా ఉండాలి. ఆ ఆశీర్వాదం మనకి దక్కిందన్నట్టే మన పనులు, ప్రార్థనలు ఉండాలి. మనం అడిగిన దానిని దేవుడు ఇచ్చేశాడు అన్నట్టు ఆయనతో వ్యవహరించాలి.

మనం అడిగి దానిని బట్టి ఆ భారాన్ని దేవుని మీదే మోపాలి. దాన్ని దేవుడు మనకి ఇచ్చేసినట్టే అనుకోవాలి. ఇదే మనకి ఉండవలసిన నమ్మకం.

ఒక కన్యక పెళ్లయినప్పుడు ఆమె దృక్పథం అంతా ఒక్కసారిగా మారిపోతుంది. ఆ వాస్తవానికి తగినట్టుగా ఆమె ప్రవర్తన అంతా ఉంటుంది. అలాగే మనం క్రీస్తుని మన రక్షకుడిగా, పరిశుద్ధపరిచేవాడిగా, బాగుచేసేవాడిగా, విడిపించేవాడిగా స్వీకరించినప్పటి నుంచి ఆయన మీద మనం ఎలాంటి ఆశపెట్టుకున్నామో దానికి తగిన రీతిలో ఆయనకి స్థానం ఇవ్వాలని క్రీస్తు కోరుకుంటాడు. ఆయనే మనకి సర్వస్వం అన్నది గుర్తించి, ఆయన పట్ల ఏవిధంగా ఉండాలని ఎదురుచూస్తున్నామో అలా ఉంటున్నాడు అని నమ్మాలి.

ప్రార్ధనలో నేనడిగిన మాట ప్రార్థించిన ప్రకారమే ప్రార్థిస్తూ ఉండగానే దక్కింది నాకు.

Share on Whatsapp Daily Devotion - బలమునిచ్చు తలంపులు - Lifting Thoughts

బలమునిచ్చు తలంపులు:
లూకా 10:19 - "శత్రువు బలమంతటిమీదను మీకు అధికారము అనుగ్రహించియున్నాను".
మనందరి జీవితాల్లో వేదన మనలను క్రిందికి లాగి అగాధంలోకి త్రోసివేస్తుంది. వేదన మనలను అశక్తులుగా చేస్తుంది. మనము గ్రహింపలేని విధంగా మనపై ఆధిపత్యాన్ని చెలాయిస్తుంది. గనుక మనకు శక్తి కొఱకు దేవుని వాక్యము అవసరము. కానీ కొన్నిసార్లు అపవాది పూర్తిగా నశించిపోడు లేదా నలుగగొట్టబడడు. అది నశించాలంటే బలమునంతా పాదములో నింపి అణగద్రొక్కాలి. నీ ప్రతీకారం శక్తివంతంగా ఉండాలి. భయపడకుము. దేవుడు నీ పక్షమున ఉన్నాడు గనుక పోరాటం చేయుము.

ప్రార్థనా మనవి:
నా జీవితంలో నేను కలిగియున్న ప్రతీ శ్రమను బట్టి నీకు వందనములు. నా ప్రతీ శ్రమలో వేదనలో నాకు తోడైయుండుమని యేసునామములో ప్రార్థించుచున్నాము పరమతండ్రి, ఆమేన్.

Lifting Thoughts:
Luke 10:19 - I have given you authority...to overcome all the power of the Enemy.” We all have disappointments in our lives, things that have let us down, or that have ended up being a destructive force. Disappointment in and of itself can be debilitating, and can dictate how we feel and easily master us without us noticing. We need God's word for strength. But sometimes the enemy isn't going to be crushed fully or die completely. You can't tiptoe around the scorpion that is disappointment – you have to stamp and use your full body weight to land that victory on its head. Your retaliation should be powerful. Don't be afraid. Fight back for You have God on Your side.

Talk to The King:
Father God, I thank You for all the disappointments in my life. Strengthen me in my disappointments so that I stand victorious. In Jesus name, I pray, Amen.