Daily Bible Verse
"నీవు మొఱ్ఱపెట్టునప్పుడు నీ విగ్రహముల గుంపు నిన్ను తప్పించునేమో గాలి వాటినన్నిటిని ఎగరగొట్టును గదా? ఒకడు ఊపిరి విడిచినమాత్రమున అవియన్నియు కొట్టుకొనిపోవును నన్ను నమ్ముకొనువారు దేశమును స్వతంత్రించు కొందురు నా పరిశుద్ధ పర్వతమును స్వాధీనపరచుకొందురు. "
యెషయా 57:13
Daily Bible Quote
"లోలోపల ప్రేమించుటకంటె బహిరంగముగా గద్దించుట మేలు" సామెతలు 27:5
Whats New
Whatsapp Share Feature Updated

New direct Whatsapp Share is available for Daily Verse, Quote and Devotion

Download PDF Bible

Download Telugu and English parallel bible as PDF for free on this link PDF Parallel Bible Download Here.

Download Telugu Audio Bible for free

You can now download the entire telugu audio bible for free on this link Telugu Audio Bible Download Here

Telugu Cross Reference Bible

Telugu Bible update now with Cross Reference

Telugu Audio Bible

Telugu Audio Bible is updated for all the scriptures.. Read & Listen. Now!! its Free..

Explore
Celebrating the Blessed and Glorious 10 Years of Sajeeva Vahini since 2009. Its been a decade now for Telugu Bible Online!. Thank you for your prayers and support to reach millions across the globe.
Anniversary Update: Read Telugu Bible with Chain and Cross References Online!. Click Here!. Introducing Daily Inspirations along with Daily Devotions on Home Page.
Share on Whatsapp Daily Inspiration

బావీ ఉబుకుము. దాని కీర్తించుడి (సంఖ్యా 21: 17).

ఇది చాలా వింతైన పాట. ఇది వింతైన భావి, ఇజ్రాయేలీయులు ఎడారి దారుల్లో నడిచి వస్తున్నారు. కనుచూపు మేరలో నీళ్లులేవు, దాహంతో నోరెండిపోతున్నది. అప్పుడు దేవుడు మోషేతో ఇలా చెప్పాడు.

"ప్రజలను సమకూర్చు, నేను వాళ్ళకి నీళ్ళిస్తాను" ఇసుక తిన్నెలమీద చుట్టూ నిలబడ్డారు జనమంతా. తమ కర్రలతో మలమల మాడిపోతున్న ఇసుకలో లోతుగా తవ్వారు. తవ్వుతూ పాటపాడారు.

"బావి ఉబుకుము, దానిని కీర్తించుడి." చూస్తుండగానే బుడబుడమని శబ్దంతో నీళ్ళు పైకి ఉబికి ఆ గుంటను నింపి పొర్లిపారినాయి.

వాళ్లు ఎడారిలో నేలను త్రవ్వారు, అలా త్రవ్వుతూ భూగర్భంలో పరుగులెడుతున్న ప్రవాహం వరకు వెళ్లారు. ఎంతోకాలంగా కంటికి కనిపించని ప్రవాహాలను చేరుకున్నారు.

ఇది ఎంత మనోహరమైన దృశ్యం! ఆశీర్వాదపు ఊటలు మన జీవితపు ఎడారుల్లో మన కంటికి కనిపించకుండా ఎక్కడో లోతున ప్రవహిస్తూ ఉంటాయట. మనం విశ్వాసంతోనూ, స్తుతి కీర్తనలతోను త్రవ్వుతూ వెళ్లగలిగితే, ఎండిన ఎడారుల్లో కూడా మన అవసరాలకు ఏమి లోటు ఉండదు.

మీ ఊటలోని నీళ్లను వాళ్ళు ఎలా బయటకు తీస్తారు? స్తుతి పాటల ద్వారా తమ విశ్వాసగీతాలు ఆ ఇసుకపై పాడారు, వాగ్దానాలనే దుడ్డుకర్రలతో ఆ బావిని త్రవ్వారు.

మన స్తుతికి ఎడారుల్లోని ఊటల్ని తెరిచే శక్తి ఉంది. సణుగుడు అయితే మన మీదికి తీర్పు తెస్తుంది. ఒక్కోసారి ప్రార్థన కూడా ఆశీర్వాదాల ఊటల్ని విప్పెశక్తిని కోల్పోతుంది.

స్తుతి తప్ప దేవుణ్ణి సంతోషపెట్టేది మరొకటి లేదు. కృతజ్ఞతలు చెప్పగలగడమే అన్నిటి కంటే కఠినమైన విశ్వాస పరీక్ష. నువ్వు చాలినంతగా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నావా? అసంఖ్యాకంగా నీపై కురుస్తున్న కంటికి కనిపించే ఆశీర్వాదాలకై దేవునికి కృతజ్ఞతలు చెబుతున్నావా? శ్రమలలాగా కనిపిస్తూ వాస్తవానికి ఆశీర్వాదాలయిన వాటికై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విశ్వాసం నీకుందా? నీకింకా అనుగ్రహించబడని దీవెనల కోసం ముందుగానే స్తుతించడం నేర్చుకున్నావా?

విడుదలకోసం వేచియున్నావా నా హృదయమా, ఎంతో కాలంగా నీ విడుదల నీ స్తుతి పాటల్లోనే వేచి ఉంది తెలుసా నీకు.

నిట్టూర్పుకు విడుదల ఎంతో దూరం లేదు కట్టిన నీ కాళ్ల గొలుసులు ఇట్టే విడిపోతాయి విమోచన గీతాలతో ప్రభువు నిన్ను ముంచెత్తుతాడు.

Share on Whatsapp Daily Devotion - సందేహము లేని తలంపులు

సందేహము లేని తలంపులు :

యాకోబు 1:6 - "అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను".

సందేహపడుటవలన మనకు ప్రమాదం పొంచియుంది. మనము ద్విమనస్కులుగా అస్థిరులుగా మారిపోయే అవకాశముంది. దేవుని యొక్క నీతిపైన మనము సందేహాపడినప్పుడు ఆయనను మనం ఆయన పట్ల విధేయులుగా ఉండలేము. దేవుడు తాను ఏమయివున్నాడని వాక్యము వివరించుచున్నదో వాక్యమును కనిపెట్టుకొని ఉండాలి. దేవుడు ఎల్లప్పుడూ మనయెడల యదార్థముగా, నమ్మకమైనవానిగా ఉన్న దేవుడు. అది నీవు అర్థం చేసుకోక కలవరపడే సందర్భాలు ఉండవచ్చు‌. కానీ ఒక విశ్వాసికి శ్రమలను ఎదుర్కొనే శక్తి దేవుని శక్తి పైన ఉన్న విశ్వాసము ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది.

ప్రార్థనా మనవి:

ప్రియ పరలోక తండ్రి!!! నీ యొక్క శక్తిని, మహిమను బట్టి నీకు వందనములు. నా జీవితంలో నీవు చేసిన ఉపకారములకై నీకు వేలాది స్తోత్రములు. శ్రమలలో పరిస్థితులమీద గాక నీ శక్తిపై దృష్టియుంచుటకు సహాయము చేయమని యేసునామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్.

Doubtless Thoughts:  James 1:6 - “But let him ask in faith, with no doubting.” There is a danger associated with doubt. We can become double-minded and unstable. When we doubt that God is righteous and good, we will not be willing to obey and serve Him.  Believers must cling to the biblical truth about who God says He is in His Word. Our God is in control at all times, and He is good, trustworthy, and just.There might be circumstances where you are struggling to believe God’s goodness. But A believer’s strength during uncertain times comes from trust and faith in God’s sovereignty and inherent goodness. 

Talk to The King: Father God, I thank You for Your power and glory in my life.  Remind me that anything and everything good in my life is solely because of You.  Help me to focus on You and not my circumstances. In Jesus’ name. Amen.