Daily Bible Verse
"యెహోవాకు అసాధ్యమైనది ఏదైన నున్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయకాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చెదను. అప్పుడు శారాకు కుమారుడు కలుగుననెను. "
ఆదికాండము 18:14
Daily Bible Quote
"తన మూఢతను మరల కనుపరచు మూర్ఖుడు కక్కినదానికి తిరుగు కుక్కతో సమానుడు." సామెతలు 26:11
Whats New
Whatsapp Share Feature Updated

New direct Whatsapp Share is available for Daily Verse, Quote and Devotion

Download PDF Bible

Download Telugu and English parallel bible as PDF for free on this link PDF Parallel Bible Download Here.

Download Telugu Audio Bible for free

You can now download the entire telugu audio bible for free on this link Telugu Audio Bible Download Here

Telugu Cross Reference Bible

Telugu Bible update now with Cross Reference

Telugu Audio Bible

Telugu Audio Bible is updated for all the scriptures.. Read & Listen. Now!! its Free..

Explore
Celebrating the Blessed and Glorious 10 Years of Sajeeva Vahini since 2009. Its been a decade now for Telugu Bible Online!. Thank you for your prayers and support to reach millions across the globe.
Anniversary Update: Read Telugu Bible with Chain and Cross References Online!. Click Here!. Introducing Daily Inspirations along with Daily Devotions on Home Page.
Share on Whatsapp Daily Inspiration

తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా (యోహాను 18: 11).

ఒక చిత్రకారుడు తాను చిత్రిస్తున్న పటం గురించి ఎంత శ్రద్ధ తీసుకుని చిత్రిస్తాడో అంతకంటే ఎన్నో వేల రెట్లు ఎక్కువగా దేవుడు మన జీవితాలను లక్ష్యపెడుతూ ఉంటాడు. ఆయన తన కుంచెతో ఎన్నో దుఃఖాలను మన జీవిత చిత్రంపై గీస్తుంటాడు. ఎన్నో పరిస్థితుల రంగుల్ని పులముతుంటాడు. ఈ విధంగా తన దృష్టిలో అత్యున్నతమైన అతి మనోహరమైన చిత్రంగా తీర్చిదిద్దుతాడు. ఆయన ఇస్తున్న చేదును సవ్యమైన భక్తి ప్రవత్తులతో మనం జీర్ణం చేసుకోగలగాలి.

కానీ ఈ పాత్రను మనం పక్కకి నెట్టేసినట్లయితే ఈ తలంపులను నోరు నొక్కేసి తొక్కిపట్టి ఉంచినట్టయితే, మన ఆత్మకు మరెన్నటికీ నయం కానీ గొప్ప గాయమవుతుంది. ఈ చేదును మనకి త్రాగనివ్వడంలో దేవుని ప్రేమ ఎంత అంతులేనిదో ఎవరు గ్రహించరు. కానీ మన ఆత్మ క్షేమంకోసం మనం తప్పకుండా తాగాలసిన ఈ చేదును మన ఆత్మమాంద్యంలో మత్తులో పక్కకి నెట్టేస్తాం.

ఆపైన "అయ్యో ప్రభూ! నేను ఎండిపోయాను, నాలో చీకటి నిండింది" అంటూ మనం దేవునిపై ఫిర్యాదులు చేస్తాము. నా ప్రియమైన పిల్లలారా, బాధకి మీ హృదయాల్లో చోటివ్వండి. మీ హృదయం అంతా భక్తిపారవశ్యాలతో నిండి ఉండడం కంటే వేదనలు నిండి ఉండడమే ఎక్కువ ఆత్మియ అభివృద్ధికి మూలం.

దేవా బాధని తొలగించు ఆక్రోశించాడు మనిషి నువ్వు చేసిన ప్రపంచాన్ని చీకటి అలుముకుంది గుండెని గొలుసులతో కట్టి రెక్కల్ని నేలకి బిగబట్టి నొక్కిపట్టాయి ఈ ఇక్కట్లు నువ్వు చేసిన ప్రపంచాన్ని భాదలనుండి విడిపించు బాధను రూపుమాపుమంటావా గంభీరంగా పలికాడు దేవుడు ఓర్చుకొని శక్తినొందె అవకాశాన్ని తీసెయ్యమంటావా.

Share on Whatsapp Daily Devotion - నిరీక్షణ కలిగియున్న తలంపులు - Waiting Thoughts

నిరీక్షణ కలిగియున్న తలంపులు:
హబక్కూకు 2:3 - "ఆ దర్శనవిషయము నిర్ణయకాలమున జరుగును".

దేవుని సమయం సరైనది, ఏర్పరచబడినది, ఒక గొప్ప ఉద్దేశాన్ని కలిగియున్నది. దేవుడు జాగు చేయువాడు కాడు ఆయన ఖచ్ఛితమైన సమయంలో ఆదుకొనువాడు, అద్భుతాలను చేయువాడు. నీవు సదా ప్రేమించేవారు క్రీస్తులోకి రావాలని నీవు ప్రార్థించుచూ ఉండవచ్చు. గనుక వేచిచూడుము. నీవు ఇంకేదైనా అద్భుతం కొఱకు ప్రార్థించుచూ ఉండవచ్చు. వ్యాధినుంచి స్వస్థత పొందాలని, వ్యసనాలనుంచి విడుదల పొందాలని ఎవరొకరి గురించి నీవు ప్రార్థించుచూ ఉండవచ్చు. పదోన్నతి గురించో, చక్కటి జీవితభాగస్వామి గురించో, గర్భఫలము గురించో ప్రార్థించుచూ ఉండవచ్చు. నీకు అవసరమైన ప్రతీది నీకు అనుగ్రహించబడడానికి ఒక నిర్దిష్ట సమయాన్ని దేవుడు ఏర్పాటు చేసాడు. గనుక నీవు ఒకదాని గురించి ప్రార్థించుచున్నప్పుడు దానికొక సమయముందని విశ్వసించుము.

ప్రార్థనా మనవి:
పరలోకమందున్న దేవా!!!! ఖచ్చితమైన సమయాల్లో నీవు ఈ నా జీవితంలో కార్యములు జరిగించుచున్నందుకు నీకు వందనములు. నీ సమయమునందు విశ్వాసముంచుట నాకు నేర్పినందుకు నీకు స్తోత్రములు. మేము అడుగు ప్రతీదానికన్నా శ్రేష్ఠమైనదానిని ఒక నిర్ణీత సమయంలో దయచేయుదువని నమ్మి విచారపడకుండా ఉండుటకు సహాయము చేయమని యేసునామములో ప్రార్థించుచున్నాము పరమతండ్రి, ఆమేన్.

Waiting Thoughts: Habakkuk 2:3 - because it is not yet time for it to come true.”
God's time which means the right time, the affixed time, the divinely chosen time that God permits something to happen. There’s an old saying that God is rarely early, never late, and always right on time. Maybe you’ve been praying for what seems like forever for someone you love to come to Christ. So you wait. You might be asking God for another kind of miracle. For someone to be healed. For someone to be freed from an addiction. For a promotion. Or a spouse. So you pray. You wait. But remember God acts and reacts at the right time. He's never late or delayed.

Talk to The King: Father God, I thank You for the right time you act. Thank You for teaching me faith in waiting for Your time. Help me never to get disheartened. In Jesus name, I pray, Amen.