Daily Bible Verse
"మాణిక్యమణులతో నీ కోటకొమ్ములను సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచు దును. "
యెషయా 54:12
Daily Bible Quote
"నీతిమంతుని జ్ఞాపకముచేసికొనుట ఆశీర్వాదకర మగును భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును" సామెతలు 10:7
Whats New
Whatsapp Share Feature Updated

New direct Whatsapp Share is available for Daily Verse, Quote and Devotion

Download PDF Bible

Download Telugu and English parallel bible as PDF for free on this link PDF Parallel Bible Download Here.

Download Telugu Audio Bible for free

You can now download the entire telugu audio bible for free on this link Telugu Audio Bible Download Here

Telugu Cross Reference Bible

Telugu Bible update now with Cross Reference

Telugu Audio Bible

Telugu Audio Bible is updated for all the scriptures.. Read & Listen. Now!! its Free..

Explore
Celebrating the Blessed and Glorious 10 Years of Sajeeva Vahini since 2009. Its been a decade now for Telugu Bible Online!. Thank you for your prayers and support to reach millions across the globe.
Anniversary Update: Read Telugu Bible with Chain and Cross References Online!. Click Here!. Introducing Daily Inspirations along with Daily Devotions on Home Page.
Share on Whatsapp Daily Inspiration

నా హస్తకార్యములను గూర్చియు నాకే ఆజ్ఞాపింతురా? (యెషయా 45:11) (ఆజ్ఞాపించండి అని భావం).

యేసుప్రభువు తన అద్భుత కార్యాలు చేసేటప్పుడు ఈ వాక్యభాగాన్ని ఆధారం చేసుకున్నాడు. యెహోషువకి విజయ ఘడియలు సమీపించగా, శత్రునాశనం సంపూర్ణమయ్యేలా తన కత్తిని ఆకాశం వైపుకి చాపి సూర్యుడా అస్తమించకు అని ఆయన ఆజ్ఞాపించినప్పుడు ఈ వాగ్దానాన్నే ఉపయోగించుకున్నాడు.

మూడున్నర సంవత్సరాలు ఏలీయా ఆకాశపు వాకిళ్ళను మూసి వర్షం లేకుండా చేసిన సందర్భం దేవుని కార్యాలను గురించి ఆయన్నాజ్ఞాపించినట్టే కదా.

మరణశయ్య పైన ఉన్న వ్యక్తి దగ్గర మోకాళ్ళూని మరణాన్ని దూరంగా తరిమిన మార్టిన్ లూథర్ కి ఆ అధికారాన్నిచ్చింది ఈ మాటే.

దేవుడు మనల్ని తనతో ఒక ఉత్కృష్టమైన సంబంధాన్ని కలిగి ఉండడానికి పిలుస్తున్నాడు. "ఆకాశ విశాలాన్ని నా చేతులతో పరిచాను. దానిలోని నక్షత్ర సమూహాలను ఆజ్ఞాపిస్తున్నాను" అంటూ యెహోవా దేవుడనే మాటలు మనందరికీ తెలుసు. అయితే ఇలాటి దేవుడు మన ఆజ్ఞలను స్వీకరించడానికి సిద్దపడి మనల్ని ఆహ్వానిస్తున్నాడు. ఏమిటీ విపరీతం. ఇలాటి సంబంధం ఎంత ఆశ్చర్యకరం"

దేవుణ్ణి ఆజ్ఞాపించడానికి మనకున్న అవకాశానికీ, నత్తినత్తిగా అవిశ్వాసంతో మనం చేసే సగం సగం ప్రార్థనలకి పొంతన ఎక్కడ? నమ్మకం లేక మనం చేసిన ప్రార్థనలనే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటే ఇక వాటికి పదునెలా ఉంటుంది?

తన ఇహలోకపు అవతారంలో దేవుడైన యేసుక్రీస్తు చాలాసార్లు మనుషుల ఆజ్ఞలకోసం అడిగాడు. యెరికో పట్టణంలో ప్రవేశిస్తూ ఉన్నప్పుడూ గ్రుడ్డివాళ్ళు ఎదురైతే తనకై తాను ఏమీ చెయ్యలేదు.

"నేను మీకు ఏమి చెయ్యాలని కోరుతున్నారు?" అంటే "చెప్పండి, నేను సిద్ధంగా ఉన్నాను" అన్నట్టే కదా.

తన మహిమల తాళపు చెవిని సురోఫెనికయ స్త్రీకి అప్పగించి "నీ ఇష్టం. ఏం కావాలో తీసుకో" అన్నట్టు యేసుక్రీస్తు ప్రవర్తించలేదా.

తన పిల్లలను ఎలాటి ఉన్నత స్థానానికి వాగ్దానం ద్వారా దేవుడు హెచ్చిస్తూ ఉన్నాడో, మన మానవ జ్ఞానం అర్ధం చేసుకోగలదా? ఆయన ఏమంటున్నాడు "నా మహిమా ప్రభావాలన్నీ నీ ఆధీనంలో ఉన్నాయి. నా నామం చొప్పున నువ్వు ఏది అడిగినా నేను నెరవేరుస్తాను"

కొండతో చెప్పండి
కడలిలో పడమని
గుండెలో శంక వదలండి
తండ్రి మాటని నమ్మండి
అడ్డమైన కొండల్ని
తండ్రి పేరట అదిలించండి

హూంకరించిన అడ్డుగోడను
తృణీకరించండి మౌన ప్రార్థనతో
నేలకూలిన బురుజుల్ని చూసి
జయగీతాలు పాడండి
విశ్వాసంతో విశ్రమించండి
ఇత్తడి తలుపులు ఇనుప గడియలు
విశ్వాసి సాగిపోవడానికి వింతగా తెరుచుకుంటాయి
ఇది జరుగుతుంది ఆధీనుడౌతాడు పగవాడు

విలువైన నెత్తురు తెచ్చిన
విమోచన రాత్రిని పిలవండి
త్రిత్వం ఏకమై తెస్తుంది దాన్ని
ఇది జరుగుతుంది నమ్మండి వాక్యాన్ని
అడ్డమైన కొండలి తండ్రి పేర అదిలించండి

విశ్వాసాన్ని చేబూని
సందేహాన్ని త్యజించి
అసాధ్యాలను సాధ్యం చేసే
అద్భుతమైన శక్తిని ధరించి
అన్నింటినీ జరిగించండి
వాక్యంలో నిలబడి
అడ్డమైన కొండల్ని తండ్రి పేర అదిలించండి

Share on Whatsapp Daily Devotion - The Son
A wealthy man and his son loved to collect rare works of art. They had Everything in their collection, from Picasso to Raphael. They would often sit together and admire the great works of art. 

When the Viet Nam conflict broke out, the son went to war. He was very courageous and died in battle while rescuing another soldier. The father was notified and grieved deeply for his only son. 

About a month later, just before Christmas, there was a knock at the door. A young man stood at the door with a large package in his hands. He said, Sir, you dont know me, but I am the soldier for whom your son gave his life. He saved many lives that day, and he was carrying me to safety when a bullet struck him in the heart and he died instantly. He often talked about you, and your love for art. 

The young man held out his package. 

I know this isnt much. Im not really a great artist, but I think your son would have wanted you to have this. 

The father opened the package. It was a portrait of his son, painted by the young man. He stared in awe at the way the soldier had captured the personality of his son in the painting. The father was so drawn to the eyes that his own eyes welled up with tears. He thanked the young man and offered to pay him for the portrait. 

Oh, no sir, I could never repay what your son did for me. Its a gift. 

The father hung the portrait over his mantle. Every time visitors came to his home he took them to see the portrait of his son before he showed them any of the other great works he had collected. The man died a few months later. There was to be a great auction of his paintings. Many influential people gathered, excited over seeing the great paintings and having an opportunity to purchase one for their collection. On the platform sat the painting of the son. 

The auctioneer pounded his gavel. We will start the bidding with this portrait of the son. Who will bid for this painting? There was silence. Then a voice in the back of the room shouted. We want to see the famous paintings. Skip this one. But the auctioneer persisted. Will someone bid for this painting? Who will start the bidding? $100, $200? Another voice shouted angrily. We didnt come to see this painting. We came to see the Van Goghs, the Rembrandts. Get on with the real bids! But still the auctioneer continued. The son! The son! Wholl take the son? 

Finally, a voice came from the very back of the room. It was the long-time gardener of the man and his son. Ill give $10 for the painting. Being a poor man, it was all he could afford. We have $10, who will bid $20? Give it to him for $10. Lets see the masters. $10 is the bid, wont someone bid $20?

The crowd was becoming angry. They didnt want the painting of the son. They wanted the more worthy investments for their collections. The auctioneer pounded the gavel. Going once, twice, SOLD for $10! A man sitting on the second row shouted. Now lets get on with the collection! 

The auctioneer laid down his gavel. 

Im sorry, the auction is over. When I was called to conduct this auction, I was told of a secret stipulation in the will. I was not allowed to reveal that stipulation until this time. Only the painting of the son would be auctioned. Whoever bought that painting would inherit the entire estate, including the paintings. The man who took the son gets everything! 

God gave his son 2,000 years ago to die on a cruel cross. Much like the auctioneer, His message today is, The son, the son, wholl take the son?