సాగిలపడి మ్రొక్కెదము - సత్యముతో - ఆత్మతో
-
-
-
- సాగిలపడి మ్రొక్కెదము - సత్యముతో - ఆత్మతో
- మన ప్రభుయేసుని ఆ....ఆ....ఆ.... !!సాగి!!
- 1. మోషేకంటె శ్రేష్ఠుడు - అన్ని - మోసములనుండి - విడిపించున్
- వేషధారులను ద్వేషించున్ - ఆశతో - మ్రొక్కెదము !!సాగి!!
- 2. అహరోనుకంటె శ్రేష్ఠుడు - మన ఆరాధనకు పాత్రుండు
- ఆయనే ప్రధాన యాజకుడు - అందరము - మ్రొక్కెదము !!సాగి!!
- ౩. ఆలయముకన్న - శ్రేష్ఠుడు - నిజ ఆలయముగ తానే యుండెన్
- ఆలయము మీరే యనెను - ఎల్లకాలము మ్రొక్కెదము !!సాగి!!
- 4. యోనకంటె శ్రేష్ఠుడు - ప్రాణ - దానముగా తను అర్పించెన్
- మానవులను విమోచించెన్ -ఘనపరచి మ్రొక్కెదము !!సాగి!!
- 5. సొలొమోను కన్న శ్రేష్ఠుడు - సర్వజ్ఞనమునకు ఆధారుండు
- పదివేలలో అతి ప్రియుండు - పదిలముగా మ్రొక్కెదము !!సాగి!!
- 6. రాజులకంటె శ్రేష్ఠుడు - యాజకులనుగా మనలను చేసెన్
- రారాజుగ త్వరలో వచ్చున్ - రయముగను మ్రొక్కెదము !!సాగి!!
- 7. అందరిలో అతి శ్రేష్ఠుడు - మనకందరికీ తానే ప్రభువు
- హల్లెలూయకు పాత్రుండు - అనుదినము మ్రొక్కెదము !!సాగి!!