Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

జీవితాంతమూ నే నీతో నడవాలని


    • జీవితాంతమూ నే నీతో నడవాలని.. ఎన్నడూ నీ చేయి నేను విడువరాదని..
    • నీ సన్నిధిలో నిత్యమూ నేనుండాలని.. నీ నిత్య ప్రేమలో నేను నిలవాలని..
    • నా మనస్సంత నీవే నిండాలని.. తీర్చుమయ్య నా ప్రభు ఈ ఒక్క కోరిక..
    • పడితినయ్య పడితిని నీ ప్రేమలోనే పడితిని.. యేసయ్య ఓ యేసయ్య నీ ప్రేమ ఎంత గొప్పదయ్య..
    • దారి తప్పి యున్న నన్ను వెదకి రక్షించినవయ్య..

    • నే కన్న పగటి కలలన్ని కల్లలాయెను.. నీవు లేని నా స్వనీతి వ్యర్ధమాయెను..
    • నరుని నమ్ముటే నాకు మోసమాయెను.. భయముతోటి నా కన్ను నిద్ర మరిచెను..
    • మనసులోన మానిపోని గాయమాయెను.. నీ ప్రేమ ఇచ్చే నాకు ఓ కొత్త జీవితం..
    • పడితినయ్య పడితిని నీ ప్రేమలోనే పడితిని.. యేసయ్య ఓ యేసయ్య నీ ప్రేమ ఎంత గొప్పదయ్య..
    • దారి తప్పి యున్న నన్ను వెదకి రక్షించినవయ్య..

    • లోక భోగాట్టాలకు నే పొంగిపోతిని.. దాని కనుసైగలోన నేను నడచుకొంటిని..
    • చెడ్డదైన బ్రతుకు సరిజేయ చూసితి.. ప్రయాసం వ్యర్ధమై నే నీరసిల్లితి..
    • ముగిసిపోయెననుకొంటి నా ప్రయాణము.. నీ ప్రేమ ఇచ్చే నాకు ఓ కొత్త జీవితం..
    • పడితినయ్య పడితిని నీ ప్రేమలోనే పడితిని.. యేసయ్య ఓ యేసయ్య నీ ప్రేమ ఎంత గొప్పదయ్య..
    • దారి తప్పి యున్న నన్ను వెదకి రక్షించినవయ్య..
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 556 times