Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

నూతన హృదయము నూతన స్వభావము - Noothana Hrudayamu Noothana Swabhaavamu


    • నూతన హృదయము నూతన స్వభావము
    • నూతన ప్రారంభం నాకు దయచేయుము
    • చెదరిన బ్రతుకును పగిలిన గుండెను
    • నలిగిన మనస్సును నూతన పరచుము
    • యేసు నీవే నన్ను సృజియించిన వాడవు
    • నా బలహీనతలన్ని యెరిగియున్నావు
    • రాతి గుండెను నాలో తీసివేయుము
    • అతి మెత్తని హృదయము దయచేయుము         ||నూతన హృదయము||

    • జీవమును వదులుకుని వెలుపలకు నే పారిపోతిని
    • పాపములో భోగమును ఆశించి నే మోసపోతిని
    • నా దేహం నా హృదయం వ్యసనముతోనే నిండిపోయెను
    • హీనముగా దిగజారి ఘోరముగా నే కృంగిపోతిని
    • నిన్ను విడచి నే క్షణమైనా బ్రతుకలేక
    • వెనుతిరిగి నీ చెంతకు వచ్చుచున్నాను
    • శుద్ధజలమును నాపై వెదజల్లుము
    • హిమము కంటెను తెల్లగా కడిగివేయుము         ||నూతన హృదయము||

    • నా పాపం అపరాధం నానుండి దూరము చేయుదువు అని
    • నా భయము అవమానం బిడియమును తొలగించి వేతువని
    • నా గతము జ్ఞాపకము నీ మదిలో ఇక దాచుకోవు అని
    • నిన్నెరిగి ధైర్యముగా నీ ముందు నే నిలబడియున్నాను
    • నీ శరణు కోరువారిని త్రోసివేయవు
    • కృపగల మహాదేవ నన్ను మన్నించుము
    • సదా కృతజ్ఞత స్తుతులు నీకే అర్పింతును
    • సర్వ మహిమ ప్రభావము నీకే చెల్లును         ||నూతన హృదయము||

    • Noothana Hrudayamu Noothana Swabhaavamu
    • Noothana Praarambham Naaku Dayacheyumu
    • Chedarina Brathukunu Pagilina Gundenu
    • Naligina Manassunu Noothana Parachumu
    • Yesu Neeve Nannu Srujiyinchina Vaadavu
    • Naa Balaheenathalanni Yerigiyunnaavu
    • Raathi Gundenu Naalo Theesiveyumu
    • Athi Metthani Hrudayamu Dayacheyumu        ||Noothana Hrudayamu||

    • Jeevamunu Vadulukuni Velupalaku Ne Paaripothini
    • Paapamulo Bhogamunu Aashinchi Ne Mosipothini
    • Naa Deham Naa Hrudayam Vyasanamuthone Nindipoyenu
    • Heenamugaa Digajaari Ghoramugaa Ne Krungipothini
    • Ninnu Vidachi Ne Kshanamainaa Brathukaleka
    • Venuthirigi Nee Chenthaku Vacchuchunnaanu
    • Shuddha Jalamunu Naapai Vedajallumu
    • Himamu Kantenu Thellagaa Kadigiveyumu        ||Noothana Hrudayamu||

    • Naa Paapam Aparaadham Naanundi Dooramu Cheyuduvu Ani
    • Naa Bhayamu Avamaanam Bidyamunu Tholaginchi Vethuvani
    • Naa Gathamu Gnaapakamu Nee Madilo Ika Daachukovu Ani
    • Ninnerigi Dhairyamugaa Nee Mundu Ne Nilabadiyunnaanu
    • Nee Sharanu Koruvaarini Throsiveyavu
    • Krupagala Mahaadeva Nannu Manninchumu
    • Sadaa Kruthagnatha Sthuthulu Neeke Arpinthunu
    • Sarva Mahima Prabhaavamu Neeke Chellunu        ||Noothana Hrudayamu||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 520 times