Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

పువ్వులాంటిది జీవితం రాలిపోతుంది - Puvvulaantidi Jeevitham Raalipothundi


    • పువ్వులాంటిది జీవితం రాలిపోతుంది
    • గడ్డిలాంటిది జీవితం వాడిపోతుంది (2)
    • ఏ దినమందైనా ఏ క్షణమైనా (2)
    • రాలిపోతుంది నేస్తమా
    • ఆ.. వాడిపోతుంది నేస్తమా (2)

    • పాల రాతపైన నడిచినా గాని
    • పట్టు వస్త్రాలే నీవు తొడిగినా గాని (2)
    • అందలము పైన కూర్చున్నా గాని
    • అందనంత స్థితిలో నీవున్నా గాని
    • కన్ను మూయడం ఖాయం
    • నిన్ను మోయడం ఖాయం (2)
    • కళ్ళు తెరచుకో నేస్తమా
    • ఆ.. కలుసుకో యేసుని మిత్రమా (2)          ||పువ్వు||

    • జ్ఞానమున్నదని నీవు బ్రతికినా గాని
    • డబ్బుతో కాలాన్ని గడిపినా గాని (2)
    • జ్ఞానము నిన్ను తప్పించదు తెలుసా
    • డబ్బు నిన్ను రక్షించదు తెలుసా
    • మరణము రాకముందే
    • అది నిన్ను చేరకముందే (2)
    • పాపాలు విడువు నేస్తమా
    • ఆ.. ప్రభుని చేరు మిత్రమా (2)         ||పువ్వు||

    • ఇలలో నీవు నేను స్థిరము కాదుగా
    • ధరలో మనకేది స్థిరము కాదుగా (2)
    • ఎంత సంపాదించినా వ్యర్ధము తెలుసా
    • ఏది నీతో రాదనీ తెలుసా
    • వాడిపోయి రాలకముందే
    • ఎత్తి పారవేయక ముందే (2)
    • పాపాలు విడువు నేస్తమా
    • ఆ.. ప్రభుని చేరు మిత్రమా (2)        ||పువ్వు||

    • Puvvulaantidi Jeevitham Raalipothundi
    • Gaddilaantidi Jeevitham Vaadipothundi (2)
    • Ae Dinamandainaa Ae Kshanamainaa (2)
    • Raalipothundi Nesthamaa
    • Aa Vaadipothundi Nesthamaa (2)

    • Paala Raathpaina Nadachinaa Gaani
    • Pattu Vasthraale Neevu Thodiginaa Gaani (2)
    • Andalamu Paina Koorchunnaa Gaani
    • Andanantha Sthithilo Neevunnaa Gaani
    • Kannu Mooyadam Khaayam
    • Ninnu Moyadam Khaayam (2)
    • Kallu Therachuko Nesthamaa
    • Aa.. Kalusuko Yesuni Mithramaa (2)       ||Puvvu||

    • Gnaanamunnadani Neevu Brathikinaa Gaani
    • Dabbutho Kaalaanni Gadipinaa Gaani (2)
    • Gnaanamu Ninnu Thappinchadu Thelusaa
    • Dabbu Ninnu Rakshinchadu Thelusaa
    • Maranamu Raakamunde
    • Adi Ninnu Cherakamunde (2)
    • Paapaalu Viduvu Nesthamaa
    • Aa.. Prabhuni Cheru Mithramaa (2)       ||Puvvu||

    • Ilalo Neevu Nenu Sthiramu Kaadugaa
    • Dharalo Manakedi Sthiramu Kaadugaa (2)
    • Entha Sampaadinchinaa Vyardhamu Thelusaa
    • Aedi Neetho Raadani Thelusaa
    • Vaadipoyi Raalakamunde
    • Etthi Paaraveyaka Munde (2)
    • Paapaalu Viduvu Nesthamaa
    • Aa.. Prabhuni Cheru Mithramaa (2)     ||Puvvu||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 18337 times