Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

మనలో ప్రతి ఒక్కరి పేరు యేసుకు తెలుసు - Manalo Prathi Okkari Peru Yesuku Thelusu


    • మనలో ప్రతి ఒక్కరి పేరు యేసుకు తెలుసు
    • మనలో ప్రతి ఒక్కరి ఊహలు యేసుకు తెలుసు (2)
    • హృదయాంత రంగములో బాధలు తెలుసు
    • మన గుండె లోతుల్లో వేదనలు తెలుసు (2)
    • జగత్తు పునాది వేయబడక ముందే
    • మనలను ఏర్పరచుకున్నాడు యేసయ్యా (2)       ||మనలో||

    • మనసులోని మాట నీవు పలుకకముందే
    • ఎరిగియున్నాడు – యేసు ఎరిగియున్నాడు
    • తల్లి గర్భమునందు నిను రూపించకముందే
    • ఎరిగియున్నాడు – యేసు ఎరిగియున్నాడు (2)
    • సుదూర సముద్ర దిగంతాలలో నీవు నివసించినా
    • ఆకాశ వీధులలో నీవు విహరించినా (2)
    • ప్రభు యేసు క్రీస్తు నిన్ను విడువడు నేస్తమా
    • ప్రభు యేసుని నీ హృదయములోనికి ఆహ్వానించుమా        ||మనలో||

    • నీవు నడిచే దారిలో నీతో సహవాసిగా
    • యేసు ఉన్నాడు – ప్రభు యేసు ఉన్నాడు
    • నీవు మాట్లాడు వేళలో మంచి స్నేహితునిగా
    • యేసు ఉన్నాడు – ప్రభు యేసు ఉన్నాడు (2)
    • నీ యవ్వన కాలమున ప్రభు యేసుని స్మరియించి
    • నీ ఒంటరి సమయములో కన్నీటితో ప్రార్ధించు (2)
    • ప్రభు యేసు క్రీస్తు నిన్ను విడువడు నేస్తమా
    • ప్రభు యేసుని నీ హృదయములోనికి ఆహ్వానించుమా        ||మనలో||

    • Manalo Prathi Okkari Peru Yesuku Thelusu
    • Manalo Prathi Okkari Oohalu Yesuku Thelusu (2)
    • Hrudayantha Rangamulo Baadhalu Thelusu
    • Mana Gunde Lothullo Vedanalu Thelusu (2)
    • Jagatthu Punaadi Veyabadaka Munde
    • Manalanu Erparachukunnaadu Yesayyaa (2)         ||Manalo||

    • Manasuloni Maata Neevu Palukakamunde
    • Erigiyunnaadu – Yesu Erigiyunnaadu
    • Thalli Garbhamunandu Ninu Roopinchakamunde
    • Erigiyunnaadu – Yesu Erigiyunnaadu (2)
    • Sudoora Samudra Diganthaalalo Neevu Nivasinchinaa
    • Aakaasha Veedhulalo Neevu Viharinchinaa (2)
    • Prabhu Yesu Kreesthu Ninnu Viduvadu Nesthamaa
    • Prabhu Yesuni Nee Hrudayamuloniki Aahvaaninchumaa         ||Manalo||

    • Neevu Nadiche Daarilo Neetho Sahavaasigaa
    • Yesu Unnaadu – Prabhu Yesu Unnaadu
    • Neevu Maatlaadu Velalo Manchi Snehithunigaa
    • Yesu Unnaadu – Prabhu Yesu Unnaadu (2)
    • Nee Yavvana Kaalamuna Prabhu Yesuni Smariyinchi
    • Nee Ontari Samayamulo Kanneetitho Praardhinchu (2)
    • Prabhu Yesu Kreesthu Ninnu Viduvadu Nesthamaa
    • Prabhu Yesuni Nee Hrudayamuloniki Aahvaaninchumaa         ||Manalo||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 1969 times