Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

మరువని నీదు ప్రేమతో కాచితివే కనుపాపగా - Maruvani Needu Prematho Kaachithivi Kanupaapagaa


    • మరువని నీదు ప్రేమతో కాచితివే కనుపాపగా
    • విడువని స్నేహ బంధమై నడిచితివే నా తోడుగా (2)
    • ఇంతవరకు ఉన్న ఊపిరి నీదు దయకు సాక్ష్యమేగా
    • పొందుకున్న మేలులన్ని నీదు ఎన్నిక ఫలితమేగా (2)       ||మరువని||

    • కరుగుతున్న కాలమంతా నీదు కృపలో నన్ను తడిపె
    • వెలుగు పంచే నీదు వాక్యం నీదు మార్గము నాకు తెలిపె (2)
    • పాడెదను నూతన గీతములు ఎల్లవేళల స్తుతిగానములు
    • ఘనత మహిమ ఆరోపణము నాదు జీవితమే అర్పితము (2)       ||మరువని||

    • నిన్న నేడు ఎన్నడైనా మారిపోని మనసు నీది
    • తల్లి మరచినా మరచి పోక కాపు కాసే ప్రేమ నీది (2)
    • పొందుకున్న జన్మ దినము నీవు ఇచ్చే దయా కిరీటము
    • నీవు ఇచ్ఛే వాగ్ధానాలు చేయు అధికము బ్రతుకు దినములు (2)       ||మరువని||

    • Maruvani Needu Prematho Kaachithivi Kanupaapagaa
    • Viduvani Snehabandhamai Nadichithive Naa Thodugaa (2)
    • Inthavaraku Unna Oopiri Needu Dayaku Saakshyamegaa
    • Pondukunna Melulanni Needu Ennika Phalithamegaa (2)     ||Maruvani||

    • Karuguthunna Kaalamanthaa Needu Krupalo Nannu Thadipe
    • Velugu Panche Needu Vaakyam Needu Maargamu Naaku Thelipe (2)
    • Paadedanu Noothana Geethamulu Ella Velala Sthuthigaanamulu
    • Ghanatha Mahima Aaropanamu Naadu Jeevithame Arpithamu (2)     ||Maruvani||

    • Ninna Nedu Ennadainaa Maariponi Manasu Needi
    • Thalli Marachinaa Marachipoka Kaapu Kaase Prema Needi (2)
    • Pondukunna Janma Dinamu Neevu Ichche Dayaa Kireetamu
    • Neevu Ichche Vaagdhaanaalu Cheyu Adhikamu Brathuku Dinamulu (2)     ||Maruvani||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 202 times