Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

భూమ్యాకాశములను సృజియించిన దేవా - Bhoomyaakaashamulanu Srujiyinchina Devaa


    • భూమ్యాకాశములను సృజియించిన దేవా
    • నీ సన్నిధిలోనే ప్రవేశించెదను
    • నీ పరిశుద్ధతను ప్రకాశించుటకు
    • నీ పరిపూర్ణతలో నన్ను నడిపించుము
    • మహిమా నీకే… ఘనతా నీకే…
    • ప్రతి దినం నా ఆరాధన నీకే
    • మహిమా నీకే… ఘనతా నీకే…
    • నిరంతరం ఈ స్తోత్రార్పణ నీకే
    • యేసయ్యా.. నీకే వందనం – (4)

    • మట్టి ముద్దనైన నన్ను మనిషిగా రూపించావు
    • వట్టి వాడనైన గాని మహిమతో నను నింపావు (2)
    • నీ కౌగిలిలో నను హత్తుకొని
    • అర చేతులలో నను చెక్కుకొని
    • నీ సన్నిధి కాంతిని నాపైనే ఉదయింపజేసావు (2)
    • ఏమివ్వగలను నేను నీ ప్రేమకై
    • పగిలిన హృదయముతో ఆరాధింతును         ||మహిమా||

    • ఘోర పాపినైన నన్ను ఎంతగా ప్రేమించావు
    • సిలువ పైన ప్రాణమిచ్చి వింతగా నను మార్చావు (2)
    • నా మనో నేత్రమును వెలిగించి
    • నా హృదయ కాఠిన్యమును మార్చి
    • అర్హతే లేని బలహీనుడనే ఎన్నుకున్నావు (2)
    • ఏమిచ్చి నీ ఋణమును నే తీర్తును
    • విరిగి నలిగిన మనస్సుతో ఆరాధింతును         ||మహిమా||

    • Bhoomyaakaashamulanu Srujiyinchina Devaa
    • Nee Sannidhilone Praveshinchedanu
    • Nee Parishuddhathanu Prakaashinchutaku
    • Nee Paripoornathalo Nannu Nadipinchumu
    • Mahimaa Neeke… Ghanathaa Neeke…
    • Prathi Dinam Naa Aaraadhana Neeke
    • Mahimaa Neeke… Ghanathaa Neeke…
    • Nirantharam Ee Sthothraarpana Neeke
    • Yesayyaa.. Neeke Vandanam – (4)

    • Matti Muddhanaina Nannu Manishigaa Roopinchaavu
    • Vatti Vaadanaina Gaani Mahimatho Nanu Nimpaavu (2)
    • Nee Kougililo Nanu Hatthukoni
    • Ara Chethulalo Nanu Chekkukoni
    • Nee Sannidhi Kaanthini Naapaine Udayimpajesaavu (2)
    • Emivvagalanu Nenu Nee Premakai
    • Pagilina Hrudayamutho Aaraadhinthunu        ||Mahimaa||

    • Ghora Paapinaina Nannu Enthagaa Preminchaavu
    • Siluva Paina Praanamichchi Vinthagaa Nanu Maarchaavu (2)
    • Naa Mano Nethramunu Veliginchi
    • Naa Hrudaya Kaatinyamunu Maarchi
    • Arhathe Leni Balaheenudane Ennukunnaavu (2)
    • Emichchi Nee Runamunu Ne Theerthunu
    • Virigi Naligina Manassutho Aaraadhinthunu        ||Mahimaa||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 341 times