Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

నా దేవుడే నాకు ప్రాణ స్నేహితుడు - Naa Devude Naaku Praana Snehithudu


    • నా దేవుడే నాకు ప్రాణ స్నేహితుడు
    • నా దేవుడే నాకు మార్గ దర్శకుడు
    • నా దేవుడే నాకు నిత్య పోషకుడు
    • నా దేవుడే నాకు జీవన దాయకుడు
    • గతి లేని నన్ను వెదకిన – అతి కాంక్షనీయుడాయనే
    • మితి లేని ప్రేమ చూపిన – రవికోటి తేజుడాయనే         ||నా దేవుడే||

    • శ్రమలలో నా తోడుగా నన్ను నడిపించెను
    • నా నీడగా వెన్నంటియున్న నా ప్రాణనాథుడు
    • మరణపు సంకెళ్ళ నుండి నన్ను విడిపించెను
    • నా బంధకాలన్ని తెంచి వేసిన నా నీతిసూర్యుడు
    • క్షణమైన మరువని వీడని నా క్షేమా శిఖరము
    • క్షమియించి నాకు అందించెను ఈ రక్షణానందము
    • క్షయమైన బ్రతుకు మార్చి అక్షయతనొసగెను        ||గతి లేని||

    • వాక్యమే నా జీవమై నన్ను బ్రతికించెను
    • నా పాదములకు చిరు దీపమైన నా దివ్య తేజము
    • ఆత్మయే పరిపూర్ణమై నన్ను బలపరచెను
    • నా అడుగు జాడలను స్థిరము చేసిన నా జీవ మార్గము
    • నా గమ్యమేమిటో తెలియక నా పరుగు ఆగిపోగా
    • నా చేయి పట్టి నను నడిపిన నా మార్గదర్శి యేసే
    • విలువైన ప్రేమ నాపై నిలువెల్ల కురిసెను        ||గతి లేని||

    • Naa Devude Naaku Praana Snehithudu
    • Naa Devude Naaku Maarga Darshakudu
    • Naa Devude Naaku Nithya Poshakudu
    • Naa Devude Naaku Jeevanadaayakudu
    • Gathi Leni Nannu Vedakina – Athi Kaankshaneeyudaayane
    • Mithi Leni Prema Choopina – Ravikoti Thejudaayane          ||Naa Devude||

    • Shramalalo Naa Thodugaa Nannu Nadipinchenu
    • Naa Needagaa Vennantiyunna Naa Praana Naathudu
    • Maranapu Sankella Nundi Nannu Vidipinchenu
    • Naa Bandhakaalanni Thenchi Vesina Naa Neethi Sooryudu
    • Kshanamaina Maruvani Veedani Naa Kshemaa Shikharamu
    • Kshamiyinchi Naaku Andinchenu Ee Rakshanaanandamu
    • Kshayamaina Brathuku Maarchi Akshayathanosagenu         ||Gathi Leni||

    • Vaakyame Naa Jeevamai Nannu Brathikinchenu
    • Naa Paadamulaku Chiru Deepamaina Naa Divya Thejamu
    • Aathmaye Paripoornamai Nannu Balaparachenu
    • Naa Adugu Jaadalanu Sthiramu Chesina Naa Jeeva Maargamu
    • Naa Gamyamemito Theliyaka Naa Parugu Aagipogaa
    • Naa Cheyi Patti Nanu Nadipina Naa Maargadarshi Yese
    • Viluvaina Prema Naapai Niluvella Kurisenu           ||Gathi Leni||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 1679 times