Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

Nenunna Naathi Antu | నేనున్నా నీతో అంటూ


    • నేనున్నా నీతో అంటూ
    • నా చెంతకు చేరావు
    • యేసయ్యా.. యేసయ్యా…

    • కనుచూపు మేరలోన ఏ ఆశ లేని వేళ
    • ఎటు తోచక లోలోన నే కృంగియున్న వేళ
    • నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు
    • నా కన్నీరంతా తుడిచి నీ కౌగిట దాచావు (2)

    • మొదలుపెట్టిన కార్యం మధ్యలో ఆగిపోగా
    • బెదిరిపోయి నా హృదయం బేలగా మారిపోగా (2)
    • పని పూర్తి చేయగ బలము లేని వేళ (2)
    • నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు
    • నా ఆటంకాలన్నిటిని యేసూ తొలగించావు (2)

    • శ్రమలు తెచ్చిన దుఃఖం శాంతినే దోచుకోగా
    • చెదిరిపోయి ఆశల సౌధం నా గొంతు మూగబోగా (2)
    • స్తుతి పాట పాడగ స్వరము రాని వేళ (2)
    • నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు
    • నా నోటను నూతన గీతం యేసూ పలికించావు (2)

    • కపట మిత్రుల మోసం అగ్నిలా కాల్చబోగా
    • సడలిపోయి నా విశ్వాసం ధైర్యమే లేకపోగా (2)
    • అడుగేసి సాగగ అనువుకాని వేళ (2)
    • నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు
    • నా ప్రార్థనకు ఫలమిచ్చి యేసూ నడిపించావు (2)         ||కనుచూపు||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 403 times