Turn Off
21st Century KJV
A Conservative Version
American King James Version (1999)
American Standard Version (1901)
Amplified Bible (1965)
Apostles' Bible Complete (2004)
Bible in Basic English (1964)
Bishop's Bible
Brenton's English Septuagint
Complementary English Version (1995)
Coverdale Bible (1535)
Easy to Read Revised Version (2005)
English Jubilee 2000 Bible (2000)
English Lo Parishuddha Grandham
English Standard Version (2001)
Geneva Bible (1599)
Hebrew Names Version
Hindi Bible
Holman Christian Standard Bible (2004)
Holy Bible Revised Version (1885)
Kannada Bible
King James Version (1769)
Literal Translation of Holy Bible (2000)
Malayalam Bible
Modern King James Version (1962)
New American Bible
New American Standard Bible (1995)
New Century Version (1991)
New English Translation (2005)
New International Reader's Version (1998)
New International Version (1984) (US)
New International Version (UK)
New King James Version (1982)
New Life Version (1969)
New Living Translation (1996)
New Revised Standard Version (1989)
Restored Name KJV
Revised Standard Version (1952)
Revised Version (1881-1885)
Revised Webster Update (1995)
Rotherhams Emphasized Bible (1902)
Tamil Bible
Telugu Bible (WBTC)
The Complete Jewish Bible (1998)
The Darby Bible (1890)
The Douay-Rheims American Bible (1899)
The Message Bible (2002)
The New Jerusalem Bible
The Webster Bible (1833)
Third Millennium Bible (1998)
Today's English Version (Good News Bible) (1992)
Today's New International Version (2005)
Tyndale Bible (1534)
Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537)
Updated Bible (2006)
Voice In Wilderness (2006)
World English Bible
Wycliffe Bible (1395)
Young's Literal Translation (1898)
Telugu Bible Commentary
1. అబ్రాహాము మరల ఒక స్త్రీని వివాహము చేసికొనెను, ఆమె పేరు కెతూరా.
1. abraahaamu marala oka streeni vivaahamu chesikonenu, aame pēru kethooraa.
2. ఆమె అతనికి జిమ్రాను, యొక్షాను, మెదాను, మిద్యాను, ఇష్బాకు, షూవహు అనువారిని కనెను.
2. aame athaniki jimraanu, yokshaanu, medaanu, midyaanu, ishbaaku, shoovahu anuvaarini kanenu.
3. యొక్షాను షేబను దెదానును కనెను. అష్షూరీయులు లెతూషీయులు లెయుమీయులు అనువారు ఆ దెదాను సంతతివారు.
3. yokshaanu shēbanu dedaanunu kanenu. Ashshooreeyulu lethoosheeyulu leyumeeyulu anuvaaru aa dedaanu santhathivaaru.
4. ఏయిఫా ఏఫెరు హనోకు అబీదా ఎల్దాయా అనువారు ఆ మిద్యాను సంతతివారు.
4. ēyiphaa ēpheru hanōku abeedaa eldaayaa anuvaaru aa midyaanu santhathivaaru.
5. వీరందరు కెతూరా సంతతివారు. అబ్రాహాము తనకు కలిగినది యావత్తు ఇస్సాకు కిచ్చెను.
5. veerandaru kethooraa santhathivaaru. Abraahaamu thanaku kaliginadhi yaavatthu issaaku kicchenu.
6. అబ్రాహాము తన ఉపపత్నుల కుమారులకు బహుమానము లిచ్చి, తాను సజీవుడై యుండగానే తన కుమారుడగు ఇస్సాకు నొద్దనుండి తూర్పు తట్టుగా తూర్పు దేశమునకు వారిని పంపివేసెను.
6. abraahaamu thana upapatnula kumaarulaku bahumaanamu lichi, thaanu sajeevuḍai yuṇḍagaanē thana kumaaruḍagu issaaku noddhanuṇḍi thoorpu thaṭṭugaa thoorpu dheshamunaku vaarini pampivēsenu.
7. అబ్రాహాము బ్రదికిన సంవత్సరములు నూట డెబ్బదియైదు.
7. abraahaamu bradhikina samvatsaramulu nooṭa ḍebbadhiyaidu.
8. అబ్రాహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చినవాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతిబొంది తన పితరులయొద్దకు చేర్చబడెను.
8. abraahaamu niṇḍu vruddhaapyamunaku vachinavaaḍai man̄chi musalithanamuna praaṇamu viḍichi mruthibondi thana pitharulayoddhaku cherchabaḍenu.
9. హిత్తీయుడైన సోహరు కుమారుడగు ఎఫ్రోను పొలమందలి మక్పేలా గుహలో అతని కుమారులగు ఇస్సాకును ఇష్మాయేలును అతనిని పాతిపెట్టిరి; అది మమ్రే యెదుట నున్నది.
9. hittheeyuḍaina sōharu kumaaruḍagu ephrōnu polamandali makpēlaa guhalō athani kumaarulagu issaakunu ishmaayēlunu athanini paathipeṭṭiri; adhi mamrē yeduṭa nunnadhi.
10. అబ్రాహాము హేతు కుమారులయొద్ద కొనిన పొలములోనే అబ్రాహామును అతని భార్యయైన శారాయును పాతి పెట్టబడిరి.
10. abraahaamu hēthu kumaarulayoddha konina polamulōnē abraahaamunu athani bhaaryayaina shaaraayunu paathi peṭṭabaḍiri.
11. అబ్రాహాము మృతిబొందిన తరువాత దేవుడు అతని కుమారుడగు ఇస్సాకును ఆశీర్వదించెను; అప్పుడు ఇస్సాకు బేయేర్ లహాయిరోయి దగ్గర కాపురముండెను.
11. abraahaamu mruthibondina tharuvaatha dhevuḍu athani kumaaruḍagu issaakunu aasheervadhin̄chenu; appuḍu issaaku bēyēr lahaayirōyi daggara kaapuramuṇḍenu.
12. ఐగుప్తీయురాలును శారా దాసియునైన హాగరు అబ్రాహామునకు కనిన అబ్రాహాము కుమారుడగు ఇష్మాయేలు వంశావళి యిదే.
12. aiguptheeyuraalunu shaaraa daasiyunaina haagaru abraahaamunaku kanina abraahaamu kumaaruḍagu ishmaayēlu vamshaavaḷi yidhe.
13. ఇష్మాయేలు జ్యేష్ఠకుమారుడైన నేబాయోతు కేదారు అద్బయేలు మిబ్శాము
13. ishmaayēlu jyēshṭhakumaaruḍaina nēbaayōthu kēdaaru adbayēlu mibshaamu
14. మిష్మా దూమానమశ్శా
14. mishmaa doomaanamashshaa
15. హదరు తేమా యెతూరు నాపీషు కెదెమా
15. hadaru thēmaa yethooru naapeeshu kedemaa
16. ఇవి వారి వారి వంశావళుల ప్రకారము వారి వారి పేరుల చొప్పున ఇష్మాయేలు కుమారుల యొక్క పేరులు వారి వారి గ్రామములలోను వారి వారి కోటలలోను ఇష్మాయేలు కుమారులు వీరే, వారి పేరులు ఇవే, వారివారి జనముల ప్రకారము వారు పండ్రెండుగురు రాజులు.
16. ivi vaari vaari vamshaavaḷula prakaaramu vaari vaari pērula choppuna ishmaayēlu kumaarula yokka pērulu vaari vaari graamamulalōnu vaari vaari kōṭalalōnu ishmaayēlu kumaarulu veerē, vaari pērulu ivē, vaarivaari janamula prakaaramu vaaru paṇḍreṇḍuguru raajulu.
17. ఇష్మాయేలు బ్రదికిన సంవత్సరములు నూట ముప్పది యేడు. అప్పుడతడు ప్రాణమువిడిచి మృతిబొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను.
17. ishmaayēlu bradhikina samvatsaramulu nooṭa muppadhi yēḍu. Appuḍathaḍu praaṇamuviḍichi mruthibondi thana pitharula yoddhaku cherchabaḍenu.
18. వారు అష్షూరునకు వెళ్లు మార్గమున హవీలా మొదలుకొని ఐగుప్తు ఎదుటనున్న షూరువరకు నివసించువారు అతడు తన సహోదరులందరి యెదుట నివాస మేర్పరచుకొనెను.
18. vaaru ashshoorunaku veḷlu maargamuna haveelaa modalukoni aigupthu eduṭanunna shooruvaraku nivasin̄chuvaaru athaḍu thana sahōdarulandari yeduṭa nivaasa mērparachukonenu.
19. అబ్రాహాము కుమారుడగు ఇస్సాకు వంశావళి యిదే. అబ్రాహాము ఇస్సాకును కనెను.
19. abraahaamu kumaaruḍagu issaaku vamshaavaḷi yidhe. Abraahaamu issaakunu kanenu.
20. ఇస్సాకు పద్దనరాములో నివసించు సిరియా వాడైన బెతూయేలు కుమార్తెయును సిరియా వాడైన లాబాను సహోదరియునైన రిబ్కాను పెండ్లి చేసికొన్నప్పుడు నలుబది సంవత్సరములవాడు.
20. issaaku paddhanaraamulō nivasin̄chu siriyaa vaaḍaina bethooyēlu kumaartheyunu siriyaa vaaḍaina laabaanu sahōdariyunaina ribkaanu peṇḍli chesikonnappuḍu nalubadhi samvatsaramulavaaḍu.
21. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్యయైన రిబ్కా గర్భవతి ఆయెను.రోమీయులకు 9:10
21. issaaku bhaarya goḍraalu ganuka athaḍu aame vishayamai yehōvaanu vēḍukonenu. Yehōvaa athani praarthana vinenu ganuka athani bhaaryayaina ribkaa garbhavathi aayenu.
22. ఆమె గర్భములో శిశువులు ఒకనితో నొకడు పెనుగులాడిరి గనుక ఆమె ఈలాగైతే నేను బ్రదుకుట యెందుకని అనుకొని యీ విషయమై యెహోవాను అడుగ వెళ్లెను. అప్పుడు యెహోవా ఆమెతో నిట్లనెనులూకా 1:41
22. aame garbhamulō shishuvulu okanithoo nokaḍu penugulaaḍiri ganuka aame eelaagaithē nēnu bradukuṭa yendukani anukoni yee vishayamai yehōvaanu aḍuga veḷlenu. Appuḍu yehōvaa aamethoo niṭlanenu
23. రెండు జనములు నీ గర్భములో కలవు.రెండు జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటె ఒక జనపదము బలిష్టమై యుండును. పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను.రోమీయులకు 9:12
23. reṇḍu janamulu nee garbhamulō kalavu.Reṇḍu janapadamulu nee kaḍupulō nuṇḍi pratyēkamugaa vachunu. Oka janapadamu kaṇṭe oka janapadamu balishṭamai yuṇḍunu. Peddavaaḍu chinnavaaniki daasuḍagunu anenu.
24. ఆమె ప్రసూతి కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కవలవారు ఉండిరి.
24. aame prasoothi kaavalasina dinamulu niṇḍinappuḍu aame garbhamandu kavalavaaru uṇḍiri.
25. మొదటివాడు ఎఱ్ఱనివాడుగా బయటికివచ్చెను. అతని ఒళ్లంతయు రోమ వస్త్రమువలె నుండెను గనుక అతనికి ఏశావు అను పేరు పెట్టిరి.
25. modaṭivaaḍu erranivaaḍugaa bayaṭikivacchenu. Athani oḷlanthayu rōma vastramuvale nuṇḍenu ganuka athaniki ēshaavu anu pēru peṭṭiri.
26. తరువాత అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి ఏశావు మడిమెను పట్టుకొని యుండెను గనుక అతనికి యాకోబు అను పేరు పెట్ట బడెను. ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు అరువది యేండ్లవాడు.మత్తయి 1:2, లూకా 3:34
26. tharuvaatha athani sahōdaruḍu bayaṭiki vachinappuḍu athani cheyyi ēshaavu maḍimenu paṭṭukoni yuṇḍenu ganuka athaniki yaakōbu anu pēru peṭṭa baḍenu. aame vaarini kaninappuḍu issaaku aruvadhi yēṇḍlavaaḍu.
27. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుటయందు నేర్పరియై అరణ్యవాసిగా నుండెను; యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను.
27. aa chinnavaaru ediginappuḍu ēshaavu vēṭaaḍuṭayandu nērpariyai araṇyavaasigaa nuṇḍenu; yaakōbu saadhuvai guḍaaramulalō nivasin̄chuchuṇḍenu.
28. ఇస్సాకు ఏశావు తెచ్చిన వేట మాంసమును తినుచుండెను గనుక అతని ప్రేమించెను; రిబ్కా యాకోబును ప్రేమించెను.
28. issaaku ēshaavu techina vēṭa maansamunu thinuchuṇḍenu ganuka athani prēmin̄chenu; ribkaa yaakōbunu prēmin̄chenu.
29. ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొనుచుండగా ఏశావు అలసినవాడై పొలములోనుండి వచ్చి
29. okanaaḍu yaakōbu kalagoora vaṇṭakamu vaṇḍukonuchuṇḍagaa ēshaavu alasinavaaḍai polamulōnuṇḍi vachi
30. -నేను అలసియున్నాను; ఆ యెఱ్ఱయెఱ్ఱగా నున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగెను; అందుచేత అతని పేరు ఎదోము అనబడెను.
30. -nēnu alasiyunnaanu; aa yerrayerragaa nunna daanilō kon̄chemu dayachesi naaku peṭṭumani aḍigenu; anduchetha athani pēru edōmu anabaḍenu.
31. అందుకు యాకోబు -నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడుగగా
31. anduku yaakōbu -nee jyēshṭhatvamu nēḍu naakimmani aḍugagaa
32. ఏశావు -నేను చావబోవుచున్నాను గదా జ్యేష్ఠత్వము నాకెందుకనెను
32. ēshaavu -nēnu chaavabōvuchunnaanu gadaa jyēshṭhatvamu naakendukanenu
33. యాకోబు-నేడు నాతో ప్రమాణము చేయుమనెను. అతడు యాకోబుతో ప్రమాణముచేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగాహెబ్రీయులకు 12:16
33. yaakōbu-nēḍu naathoo pramaaṇamu cheyumanenu. Athaḍu yaakōbuthoo pramaaṇamuchesi athaniki jyēshṭhatvamunu ammivēyagaa
34. యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏశావు కిచ్చెను; అతడు తిని త్రాగి లేచిపోయెను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను.
34. yaakōbu aahaaramunu chikkuḍukaayala vaṇṭakamunu ēshaavu kicchenu; athaḍu thini traagi lēchipōyenu. Aṭlu ēshaavu thana jyēshṭhatvamunu truṇeekarin̄chenu.