“వీరులు”– 1 దినవృత్తాంతములు 11:10-41. దావీదు కాలమంతా ఎక్కువగా యుద్ధాలతో నిండిన కాలం. ఇక్కడ ప్రఖ్యాతి చెందిన వీరులను వారి గౌరవార్థం ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. క్రీస్తు తిరిగి వచ్చేటప్పుడు ఆయన ఆధ్యాత్మిక పోరాటాల్లో పాల్గొన్నవారి గురించి ఇలాంటి జాబితా ఉంటే అది ఆశ్చర్యకరం కాదు గదా. 2 తిమోతికి 4:7-8 చూడండి.
“ముగ్గురు”– ముగ్గురు ఉన్న గుంపులు రెండు, ముప్ఫయిమంది ఉన్న గుంపు ఒకటి ఇక్కడ కనిపిస్తున్నాయి. (8-12,13-23,23-39). కొన్ని ప్రాచీన ప్రతుల్లో ఈ వచనంలో మరో మాట ఉంది – “ఎజిని వాడైన ఆదినో ఎనిమిది వందలమందిని చంపాడు”. ఇది నిజమే కావచ్చు.