యెషయా 48:22. ఇస్రాయేల్ అంతా, ప్రపంచమంతా శాంతి సమాధానాలతో ఉన్నప్పటికీ దుర్మార్గులకు శాంతి ఉండదు. వారి అంతరంగ పరిస్థితే వారికి శాంతి లేకుండా చేస్తుంది. గనుక శాంతి కలగడం వారికి అసాధ్యం. దానిలో చెడు తలంపులు, కోరికలు, దురాశలు చిందులు తొక్కుతూ ఉంటాయి (ఆదికాండము 6:5; ఆదికాండము 8:21). శాంతి రావాలంటే దేవుని శక్తిమూలంగా మనుషుల్లో మార్పు రావాలి.