ఇలా అనడంద్వారా యేసు ఈ విషయాలను సూచిస్తున్నాడు – కాలం మారుతున్నది, ఎక్కువ విరోధం, ఎక్కువ హింస శిష్యులకు కలుగుతాయి గనుక వారు సిద్ధపడి ఉండాలి. తమ సొంత ఖర్చులతో వారు ప్రయాణాలు చెయ్యాలి (మత్తయి 18:11-14 లో చెప్పినట్టు కాదు). కత్తిని గురించి చెప్పడంలో యేసు తాను ఇంతకుముందు చెప్పిన మాటలను వదిలేసి (మత్తయి 5:11-12, మత్తయి 5:38-41) యుద్ధ మార్గాన్ని అవలంబించాలని సూచించడం లేదు. బహుశా “కత్తి” అనేది ఇక్కడ అలంకారికంగా ఉపయోగించిన మాట. ముందు రాబోతున్న గొప్ప బాధలను ఇది సూచిస్తూ ఉండవచ్చు. మత్తయి 26:51-52 లో యేసుప్రభువు హింసా ప్రవృత్తిని, బలాత్కారాన్ని ఖండించడం గమనించండి.