Acts - అపొ. కార్యములు 10 | View All

1. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి యైన కొర్నేలీ అను భక్తిపరుడొకడు కైసరయలో ఉండెను.

2. అతడు తన యింటి వారందరితోకూడ దేవుని యందు భయభక్తులు గలవాడైయుండి, ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడును దేవునికి ప్రార్థన చేయు వాడు.

3. పగలు ఇంచుమించు మూడు గంటలవేళ దేవుని దూత అతనియొద్దకు వచ్చి కొర్నేలీ, అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను.

4. అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా, యేమని అడిగెను. అందుకు దూతనీ ప్రార్థనలును నీ ధర్మకార్యములును దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి.

5. ఇప్పుడు నీవు యొప్పేకు మనుష్యులను పంపి, పేతురు అను మారు పేరుగల సీమోనును పిలిపించుము;

6. అతడు సముద్రపు దరినున్న సీమోనను ఒక చర్మకారుని యింట దిగియున్నాడని అతనితో చెప్పెను.

7. అతనితో మాటలాడిన దూతవెళ్లిన పిమ్మట అతడు తన యింటి పనివారిలో ఇద్దరిని, తన యొద్ద ఎల్లప్పుడు కనిపెట్టుకొని యుండువారిలో భక్తి పరుడగు ఒక సైనికుని పిలిచి

8. వారికి ఈసంగతులన్నియు వివరించి వారిని యొప్పేకు పంపెను.

9. మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు పండ్రెండు గంటలకు పేతురు ప్రార్థనచేయుటకు మిద్దెమీది కెక్కెను.

10. అతడు మిక్కిలి ఆకలిగొని భోజనము చేయగోరెను; ఇంటివారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై

11. ఆకాశము తెరవబడుటయు, నాలుగు చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటివంటి యొకవిధమైన పాత్ర భూమిమీదికి దిగివచ్చుటయు చూచెను.

12. అందులో భూమి యందుండు సకల విధములైన చతుష్పాద జంతువులును, ప్రాకు పురుగులును, ఆకాశపక్షులును ఉండెను.

13. అప్పుడు పేతురూ, నీవు లేచి చంపుకొని తినుమని ఒక శబ్దమతనికి వినబడెను.

14. అయితే పేతురువద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్ర మైనది ఏదైనను నేనెన్నడును తినలేదని చెప్పగా

లేవీ 11:1-47 మరియు యెహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెనుమీరు ఇశ్రాయేలీయులతో ఇట్లనుడి భూమిమీదనున్న జీవులన్నిటిలోను మీరు ఈ జీవులను మాత్రము తినవచ్చును;జంతువులలో ఏది డెక్కలు గలదై నెమరువేయునో దాని తినవచ్చును గానినెమరు వేయు వాటిలోను రెండు డెక్కలుగల వాటిలోను వీటిని తినకూడదు, ఒంటె నెమరువేయును గాని దానికి రెండు డెక్కలు లేవు గనుక అది మీకు అపవిత్రము.పొట్టి కుందేలు నెమరువేయును గాని దానికి రెండు డెక్కలు లేవు గనుక అది మీకు అపవిత్రము.కుందేలు నెమరు వేయును గాని దానికి రెండు డెక్కలు లేవు గనుక అది మీకు అపవిత్రము.పంది విడిగానుండు రెండు డెక్కలు గలదిగాని అది నెమరువేయదు గనుక అది మీకు అపవిత్రము.వాటి మాంసమును మీరు తిన కూడదు; వాటి కళేబరములను ముట్టకూడదు; అవి మీకు అపవిత్రములు.జలచరములన్నిటిలో వీటిని తినవచ్చును; సముద్ర ములో నేమి, నదులలో నేమి, యే నీళ్లలోనేమి, వేటికి రెక్కలు పొలుసులు ఉండునో వాటిని తినవచ్చును.సముద్రములలోనేమి, నదులలోనేమి, సమస్త జలచరములలోను సమస్త జలజంతువులలోను వేటికి రెక్కలు పొలుసులు ఉండవో అవన్నియు మీకు హేయములు;అవి మీకు హేయములుగానే ఉండవలెను. వాటి మాంసమును తినకూడదు, వాటి కళేబరములను హేయములుగా ఎంచుకొనవలెను.నీళ్లలో దేనికి రెక్కలు పొలుసులు ఉండవో అది మీకు హేయము.పక్షులలో వీటిని హేయములుగా ఎంచుకొనవలెను. వీటిని తినవద్దు ఇవి హేయములు; పక్షిరాజు, పెద్ద బోరువ,క్రౌంచపక్షి, గద్ద, తెల్లగద్ద, ప్రతివిధమైన గద్ద,ప్రతివిధమైన కాకి, నిప్పుకోడి,కపిరిగాడు, కోకిల,ప్రతివిధమైన డేగ,పైగిడికంటె, చెరువుకాకి, గుడ్లగూబ, హంస, గూడబాతు, నల్లబోరువ,సంకుబుడి కొంగ, ప్రతివిధమైన కొంగ, కుకుడుగువ్వ, గబ్బిలము.రెక్కలుకలిగి నాలుగుకాళ్లతో చరించు చరము లన్నియు మీకు హేయములు.అయితే నాలుగుకాళ్లతో చరించుచు నేల గంతులువేయుటకు కాళ్లమీద తొడలు గల పురుగులన్ని తినవచ్చును.నేత మిడతగాని చిన్న మిడతగాని ఆకుమిడతగాని మిడతలలో ప్రతివిధమైనది తినవచ్చును.నాలుగు కాళ్లుగల పురుగులన్నియు మీకు హేయములు.వాటివలన మీరు అపవిత్రులగుదురు వాటి కళేబరములను ముట్టిన ప్రతివాడు సాయంకాలము వరకు అపవిత్రుడగును.వాటి కళేబరములలో కొంచె మైనను మోసిన ప్రతివాడు తన బట్టలు ఉదుకుకొని సాయంకాలమువరకు అపవిత్రుడగును.రెండుడెక్కలు గల జంతువులన్నిటిలో విడిగా చీలిన డెక్కలు లేకయు, నెమరు వేయకయు నుండునవి మీకు అపవిత్రములు, వాటి కళేబరములను ముట్టిన ప్రతివాడు అపవిత్రుడగును.నాలుగు కాళ్లతో నడుచు సమస్త జీవరాసులలో ఏవి అరకాలితో నడుచునో అవన్నియు అపవిత్రములు; వాటి కళేబరములను ముట్టిన ప్రతివాడు సాయంకాలమువరకు అపవిత్రుడగును;వాటి కళేబరమును మోసిన ప్రతివాడు తన బట్టలు ఉదుకుకొని సాయంకాలమువరకు అపవిత్రుడగును; అవి మీకు అపవిత్రమైనవి.నేలమీద ప్రాకు జీవరాసులలో మీకు అపవిత్ర మైనవి ఏవేవనగా, చిన్నముంగిస, చిన్నపందికొక్కు, ప్రతి విధమైన బల్లి,ఊసరవెల్లి, నేలమొసలి, తొండ, సరటము, అడవి యెలుక.ప్రాకువాటిలో ఇవి మీకు అపవిత్రములు; ఇవి చచ్చిన తరువాత వీటిని ముట్టిన ప్రతి వాడు సాయంకాలమువరకు అపవిత్రుడగును.వాటిలో చచ్చిన దాని కళేబరము దేనిమీద పడునో అది అపవిత్ర మగును. అది చెక్కపాత్రయేగాని బట్టయేగాని చర్మమే గాని సంచియేగాని పనిచేయు ఉపకరణము ఏదియుగాని అయినయెడల దానిని నీళ్లలో వేయవలెను. అది సాయం కాలమువరకు అపవిత్రమైయుండును; తరువాత అది పవిత్ర మగును.వీటిలో ఏదైనను మంటిపాత్రలో పడినయెడల దానిలోనిదంతయు అపవిత్రమగును; మీరు దానిని పగుల గొట్టవలెను.తినదగిన ఆహారమంతటిలో దేనిమీద ఆ నీళ్ళు పడునో అది అపవిత్రమగును. అట్టి పాత్రలో త్రాగిన యే పానీయమును అపవిత్రము.వాటి కళేబరములలో కొంచెము దేనిమీదపడునో అది అపవిత్రమగును. అది పొయ్యియైనను కుంపటియైనను దానిని పగులగొట్టవలెను. అవి అపవిత్రములు, అవి మీకు అపవిత్రములుగా ఉండవలెను.అయితే విస్తారమైన నీళ్లుగల ఊటలోగాని గుంటలోగాని కళేబరము పడినను ఆ నీళ్లు అపవిత్రములుకావు గాని కళేబరమునకు తగిలినది అపవిత్రమగును.వాటి కళేబరములలో కొంచెము విత్తుకట్టు విత్తనములమీద పడినను అవి అపవిత్రములు కావు గానిఆ విత్తనములమీద నీళ్లు పోసిన తరువాత కళేబరములో కొంచెము వాటిమీద పడినయెడల అవి మీకు అపవిత్రములగును.మీరు తినదగిన జంతువులలో ఏదైనను చచ్చిన యెడల దాని కళేబరమును ముట్టువాడు సాయంకాలమువరకు అపవిత్రుడగును.దాని కళేబరములో ఏదైనను తినువాడు తన బట్టలు ఉదుకుకొని సాయంకాలమువరకు అపవిత్రు డగును. దాని కళేబరమును మోయువాడు తన బట్టలు ఉదుకుకొని సాయంకాలమువరకు అపవిత్రుడగును.నేలమీద ప్రాకు జీవరాసులన్నియు హేయములు, వాటిని తినకూడదు.నేలమీద ప్రాకు జీవరాసులన్నిటిలో కడుపుతో చరించుదానినైనను నాలుగుకాళ్లతో చరించుదానినైనను చాలా కాళ్లుగల దానినైనను మీరు తినకూడదు; అవి హేయములు.ప్రాకు జీవరాసులలో దేనినైనను తిని మిమ్మును మీరు హేయపరచుకొనకూడదు; వాటివలన అపవిత్రులగునట్లు వాటివలన అపవిత్రత కలుగజేసికొనకూడదు.నేను మీ దేవుడనైన యెహోవాను; నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై యుండునట్లు మిమ్మును మీరు పరిశుద్దపరచుకొనవలెను. నేలమీద ప్రాకు జీవరాసులలో దేనివలనను మిమ్మును మీరు అపవిత్ర పరచుకొనకూడదు.నేను మీకు దేవుడనైయుండుటకు ఐగుప్తుదేశములోనుండి మిమ్మును రప్పించిన యెహోవాను; నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులు కావలెను.అపవిత్రమైనదానికిని పవిత్రమైన దానికిని తినదగిన జంతు వులకును తినదగని జంతువులకును భేదము చేయునట్లుజంతువులనుగూర్చియు, పక్షులను గూర్చియు, జలచరము లైన సమస్త జీవులను గూర్చియు, నేలమీద ప్రాకు సమస్త జీవులను గూర్చియు చేసిన విధియిదే అని చెప్పుమనెను.

యెహే 4:14 అందుకు అయ్యో, ప్రభువా, యెహోవా, నేనెన్నడును అపవిత్రత నొందినవాడను కానే, బాల్యమునుండి నేటి వరకును చచ్చినదానినైనను మృగములు చీల్చినదానినైనను నేను తినినవాడను కానే, నిషిద్ధమైన మాంసము నా నోట ఎన్నడును పడలేదే అని నేననగా

15. దేవుడు పవిత్రము చేసినవాటిని నీవు నిషిద్ధమైన వాటినిగా ఎంచవద్దని మరల రెండవ మారు ఆ శబ్దము అతనికి వినబడెను.

16. ఈలాగు ముమ్మారు జరిగెను. వెంటనే ఆ పాత్ర ఆకాశమున కెత్తబడెను.

17. పేతురు తనకు కలిగిన దర్శనమేమై యుండునో అని తనలో తనకు ఎటుతోచక యుండగా, కొర్నేలి పంపిన మనుష్యులు సీమోను ఇల్లు ఏదని విచారించి తెలిసికొని, వాకిట నిలిచి యింటివారిని పిలిచి

18. పేతురు అను మారుపేరుగల సీమోను ఇక్కడ దిగియున్నాడా? అని అడిగిరి

19. పేతురు ఆ దర్శనమునుగూర్చి యోచించుచుండగా ఆత్మ ఇదిగో ముగ్గురు మనుష్యులు నిన్ను వెదకు చున్నారు.

20. నీవు లేచి క్రిందికిదిగి, సందేహింపక వారితో కూడ వెళ్లుము; నేను వారిని పంపియున్నానని అతనితో చెప్పెను.

21. పేతురు ఆ మనుష్యులయొద్దకు దిగి వచ్చిఇదిగో మీరు వెదకువాడను నేనే; మీరు వచ్చిన కారణ మేమని అడిగెను.

22. అందుకు వారునీతిమంతుడును, దేవునికి భయపడువాడును, యూద జనులందరివలన మంచిపేరు పొందినవాడునైన శతాధిపతియగు కొర్నేలియను ఒక మనుష్యుడున్నాడు; అతడు నిన్ను తన యింటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవలెనని పరిశుద్ధదూత వలన బోధింపబడెనని చెప్పిరి; అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యమిచ్చెను.

23. మరునాడు అతడు లేచి, వారితోకూడ బయలుదేరెను; యొప్పేవారైన కొందరు సహోదరులును వారితోకూడ వెళ్లిరి.

24. మరునాడు వారు కైసరయలో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారికొరకు కనిపెట్టుకొని యుండెను.

25. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతనిని ఎదుర్కొని అతని పాద ములమీద పడి నమస్కారము చేసెను.

26. అందుకు పేతురునీవు లేచి నిలువుము, నేనుకూడ నరుడనే అని చెప్పి అతని లేవనెత్తి

27. అతనితో మాటలాడుచు లోపలికి వచ్చి, అనేకులు కూడియుండుట చూచెను.

28. అప్పుడతడు అన్యజాతివానితో సహవాసము చేయుటయైనను, అట్టివానిని ముట్టుకొనుటయైనను యూదునికి ధర్మముకాదని మీకు తెలియును. అయితే ఏ మనుష్యుడును నిషేధింప దగినవాడనియైన అపవిత్రుడనియైనను చెప్పకూడదని దేవుడు నాకు చూపించియున్నాడు.

29. కాబట్టి నన్ను పిలిచినప్పుడు అడ్డమేమియు చెప్పక వచ్చితిని గనుక, ఎందునిమిత్తము నన్ను పిలువ నంపితిరో దానినిగూర్చి అడుగు చున్నానని వారితో చెప్పెను.

30. అందుకు కొర్నేలి నాలుగు దినముల క్రిందట పగలు మూడుగంటలు మొదలు కొని యీ వేళవరకు నేను ఇంట ప్రార్థన చేయుచుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన వాడొకడు యెదుట నిలిచి

31. కొర్నేలీ, నీ ప్రార్థన వినబడెను; నీ ధర్మకార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకముంచబడి యున్నవి గనుక నీవు యొప్పేకు వర్తమానము పంపి

32. పేతురు అను మారుపేరుగల సీమోనును పిలిపించుము; అతడు సముద్రపు దరినున్న చర్మకారుడైన సీమోను ఇంట దిగియున్నాడని నాతో చెప్పెను.

33. వెంటనే నిన్ను పిలిపించితిని; నీవు వచ్చినది మంచిది. ప్రభువు నీకు ఆజ్ఞా పించినవన్నియు వినుటకై యిప్పుడు మేమందరము దేవుని యెదుట ఇక్కడ కూడియున్నా మని చెప్పెను. అందుకు పేతురు నోరుతెరచి ఇట్లనెను

34. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి యున్నాను.

ద్వితి 10:17 ఏలయనగా నీ దేవుడైన యెహోవా పరమదేవుడును పరమప్రభువునై యున్నాడు. ఆయనే మహాదేవుడు పరాక్రమవంతుడు భయంకరుడైన దేవుడు. ఆయన నరులముఖమును లక్ష్యపెట్టనివాడు, లంచము పుచ్చుకొననివాడు.

2దిన 19:7 యెహోవా భయము మీమీద ఉండునుగాక; హెచ్చరికగానుండి తీర్పు తీర్చుడి; మన దేవుడైన యెహోవాయందు దౌష్ట్యములేదు, ఆయన పక్షపాతికాడు, లంచము పుచ్చుకొనువాడు కాడు.

35. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొనువానిని ఆయన అంగీకరించును.

కీర్త 65:2 ప్రార్థన ఆలకించువాడా, సర్వశరీరులు నీయొద్దకు వచ్చెదరు

36. యేసుక్రీస్తు అందరికి ప్రభువు. ఆయనద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానము మీరెరుగు దురు.

కీర్త 107:20 ఆయన తన వాక్కును పంపి వారిని బాగుచేసెను ఆయన వారు పడిన గుంటలలోనుండి వారిని విడిపించెను.

కీర్త 145:18 తనకు మొఱ్ఱపెట్టువారి కందరికి తనకు నిజముగా మొఱ్ఱపెట్టువారి కందరికి యెహోవా సమీపముగా ఉన్నాడు.

కీర్త 147:18 ఆయన ఆజ్ఞ ఇయ్యగా అవన్నియు కరిగిపోవును ఆయన తనగాలి విసరజేయగా నీళ్లు ప్రవహించును,

యెషయా 52:7 సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువర్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచురించువాని పాదములు, నీ దేవుడు ఏలుచున్నాడని సీయోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతములమీద ఎంతో సుందరములై యున్నవి.

నహూ 1:15 సువార్త ప్రకటించుచు సమాధాన వర్తమానము తెలియజేయువాని పాదములు పర్వతములమీద కనబడుచున్నవి. యూదా, నీ పండుగల నాచరింపుము, నీ మ్రొక్కు బళ్లను చెల్లింపుము. వ్యర్థుడు నీ మధ్య నిక సంచరించడు, వాడు బొత్తిగా నాశనమాయెను.

37. యోహాను బాప్తిస్మము ప్రకటించిన తరువాత గలిలయమొదలు కొని యూదయ యందంతట ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియును

38. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించెనను నదియే. దేవుడాయనకు తోడైయుండెను గనుక ఆయన మేలు చేయుచు, అపవాదిచేత పీడింపబడిన వారినందరిని స్వస్థపరచుచు సంచరించుచుండెను.

యెషయా 61:1 ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చియున్నది దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను నలిగిన హృదయముగలవారిని దృఢపరచుటకును చెరలోనున్నవారికి విడుదలను బంధింపబడినవారికి విముక్తిని ప్రకటించుటకును

39. ఆయన యూదుల దేశమందును యెరూషలేమునందును చేసినవాటికన్నిటికిని మేము సాక్షులము. ఆయనను వారు మ్రానున వ్రేలాడదీసి చంపిరి.

ద్వితి 21:22-23 మరణశిక్షకు తగిన పాపము ఒకడు చేయగా అతని చంపి మ్రానుమీద వ్రేలాడదీసినయెడలఅతని శవము రాత్రి వేళ ఆ మ్రానుమీద నిలువకూడదు. వ్రేలాడదీయ బడినవాడు దేవునికి శాపగ్రస్తుడు గనుక నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న దేశమును నీవు అపవిత్రపరచకుండునట్లు అగత్యముగా ఆ దినమున వానిని పాతిపెట్టవలెను.

40. దేవుడాయనను మూడవ దినమున లేపి

41. ప్రజలకందరికి కాక దేవునిచేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా ఆయన మృతులలోనుండి లేచిన తరువాత ఆయనతో కూడ అన్నపానములు పుచ్చుకొనిన మాకే, ఆయన ప్రత్యక్షముగా కనబడునట్లు అనుగ్రహించెను.

42. ఇదియుగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధి పతినిగా నియమించిన వాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢసాక్ష్యమియ్యవలెనని మాకు ఆజ్ఞాపించెను.

కీర్త 72:2-4 నీతినిబట్టి నీ ప్రజలకును న్యాయవిధులనుబట్టి శ్రమ నొందిన నీ వారికిని అతడు న్యాయము తీర్చును.నీతినిబట్టి పర్వతములును చిన్నకొండలును ప్రజలకు నెమ్మది పుట్టించును.ప్రజలలో శ్రమనొందువారికి అతడు న్యాయము తీర్చును బీదల పిల్లలను రక్షించి బాధపెట్టువారిని నలగగొట్టును.

43. ఆయనయందు విశ్వాసముంచువాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్త లందరు ఆయననుగూర్చి సాక్ష్య మిచ్చుచున్నారనెను.

యెషయా 33:24 నాకు దేహములో బాగులేదని అందులో నివసించు వాడెవడును అనడు దానిలో నివసించు జనుల దోషము పరిహరింపబడును.

యెషయా 53:5-6 మన యతిక్రమక్రియలనుబట్టి అతడు గాయపరచ బడెను మన దోషములనుబట్టి నలుగగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతనిమీద పడెను అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగు చున్నది.మనమందరము గొఱ్ఱెలవలె త్రోవ తప్పిపోతివిు మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను యెహోవా మన యందరి దోషమును అతనిమీద మోపెను.

యిర్మియా 31:34 నేను వారికి దేవుడనై యుందును వారు నాకు జనులగుదురు; వారు మరి ఎన్న డునుయెహోవానుగూర్చి బోధనొందుదము అని తమ పొరుగువారికిగాని తమ సహోదరులకుగాని ఉపదేశము చేయరు; నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక నెన్నడును జ్ఞాపకము చేసికొనను గనుక అల్పు లేమి ఘనులేమి అందరును నన్నెరుగుదురు; ఇదేయెహోవా వాక్కు.

దాని 9:24 తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతము వరకుండునట్టి నీతిని బయలు పరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకును పరిశుద్ధ పట్టణము నకును డెబ్బదివారములు విధింపబడెను.

44. పేతురు ఈ మాటలు ఇంక చెప్పుచుండగా అతని బోధ విన్నవారందరిమీదికి పరిశుద్ధాత్మ దిగెను.

45. సున్నతి పొందినవారిలో పేతురుతోకూడ వచ్చిన విశ్వాసులందరు, పరిశుద్ధాత్మ వరము అన్యజనులమీద సయితము కుమ్మరింప బడుట చూచి విభ్రాంతినొందిరి.

46. ఏలయనగా వారు భాషలతో మాటలాడుచు దేవుని ఘనపరచుచుండగా వినిరి.

47. అందుకు పేతురు మనవలె పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మము పొందకుండ ఎవడైనను నీళ్ళకు ఆటంకము చేయగలడా అని చెప్పి

48. యేసు క్రీస్తు నామమందు వారు బాప్తిస్మము పొందవలెనని ఆజ్ఞాపించెను. తరువాత కొన్ని దినములు తమయొద్ద ఉండుమని వారతని వేడుకొనిరి.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Acts - అపొ. కార్యములు 10 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

పీటర్‌ని పంపమని కొర్నేలియస్ ఆదేశించాడు. (1-8) 
ఇప్పటి వరకు, యూదులు, సమారిటన్లు మరియు మతమార్పిడి చేసినవారు మాత్రమే సున్తీకి కట్టుబడి మరియు ఆచార చట్టాలను పాటించేవారు క్రైస్తవ చర్చిలో బాప్టిజం పొందారు. ఏది ఏమైనప్పటికీ, ఒక ముఖ్యమైన మార్పు సంభవించింది, యూదులుగా మారడానికి ఎలాంటి అవసరం లేకుండానే అన్యజనులు దేవుని ప్రజల అధికారాలను ఆస్వాదించడానికి అనుమతించారు. స్వచ్ఛమైన మరియు నిజమైన మతపరమైన భక్తి అనేది ఊహించని విధంగా వ్యక్తమవుతుంది, ధార్మిక మరియు పవిత్రమైన చర్యలలో దేవుని భయాన్ని ప్రదర్శిస్తుంది, మరొకటి లేకపోవడాన్ని క్షమించదు.
నిస్సందేహంగా, కొర్నేలియస్ ఇంకా క్రీస్తుపై స్పష్టమైన విశ్వాసాన్ని పెంపొందించుకోనప్పటికీ, తన అవగాహన మేరకు దేవుని వాక్యంపై నిజాయితీగల విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. ఈ రూపాంతరమైన పని దేవుని ఆత్మకు ఆపాదించబడింది, యేసు మధ్యవర్తిత్వం ద్వారా సులభతరం చేయబడింది. ఒకప్పుడు ఆధ్యాత్మికంగా జీవం లేని మనం జీవం పోసుకున్నందున ఇది మనందరికీ పంచుకున్న అనుభవం. క్రీస్తు ద్వారా, కార్నెలియస్ ప్రార్థనలు మరియు దాతృత్వ చర్యలకు ఆమోదం లభించింది, అది తిరస్కరించబడి ఉండేది.
సంకోచం లేదా చర్చ లేకుండా, కార్నేలియస్ వెంటనే పరలోక దర్శనానికి విధేయత చూపాడు. మన ఆత్మలకు సంబంధించిన విషయాలలో, మనం సమయాన్ని వృధా చేయకూడదు.

పీటర్ దృష్టి. (9-18) 
అన్యజనుల పట్ల పీటర్ యొక్క పక్షపాతం, ప్రభువు అతన్ని ఈ మిషన్ కోసం సిద్ధం చేయకపోతే, కొర్నేలియస్‌ను సందర్శించకుండా అతన్ని అడ్డుకునేది. దేవుడు గతంలో అపరిశుభ్రమైన జంతువులను పరిశుభ్రంగా ఉంచినట్లు ప్రకటించాడని ఒక యూదునికి తెలియజేయడం అనేది మొజాయిక్ చట్టాన్ని రద్దు చేయడాన్ని సూచిస్తుంది. ఈ ప్రత్యక్షత యొక్క ప్రాముఖ్యతను పీటర్ వేగంగా గ్రహించాడు. దేవుడు మన ముందున్న పనులను మరియు వాటి కోసం మనల్ని ఎలా సన్నద్ధం చేయాలో అర్థం చేసుకుంటాడు. వాటిని అన్వయించుకోవడానికి మనల్ని ప్రేరేపించే సందర్భాలను మనం గ్రహించినప్పుడు ఆయన బోధల యొక్క ప్రాముఖ్యతను మనం గ్రహిస్తాము.

అతను కార్నెలియస్ వద్దకు వెళ్తాడు. (19-33) 
ఒక నిర్దిష్ట సేవకు మన పిలుపు స్పష్టంగా కనిపించినప్పుడు, పక్షపాతాలు లేదా గత భావనల నుండి ఉత్పన్నమయ్యే సందేహాలు లేదా సంకోచాల వల్ల మనం ఇబ్బంది పడకూడదు. పేతురు నుండి తాను ఊహించిన పరలోక జ్ఞానాన్ని వారితో పంచుకోవడానికి కొర్నేలియస్ తన స్నేహితులను సేకరించాడు. మన ఆధ్యాత్మిక అంతర్దృష్టిలో మాత్రమే పాలుపంచుకోవాలని కోరుకోవడం తగదు. మన బంధువులను మరియు స్నేహితులను మతపరమైన కార్యక్రమాలలో పాల్గొనమని ఆహ్వానించడం దయ మరియు గౌరవప్రదమైన చర్యగా పరిగణించాలి.
పీటర్‌ని పిలవమని అతనికి సూచించే దైవిక మార్గదర్శకత్వాన్ని కార్నెలియస్ బహిరంగంగా తెలియజేశాడు. సువార్త పరిచర్యకు హాజరవ్వడం అనేది దైవిక నియామకం యొక్క అంగీకారంలో మనం చేసినప్పుడు, ఆ ఆర్డినెన్స్‌లో నిమగ్నమవ్వమని మనల్ని పురికొల్పినప్పుడు అది మన ఉద్దేశ్యంతో సమానంగా ఉంటుంది. దేవుడు ఆజ్ఞాపించినదంతా వినడానికి సిద్ధంగా ఉన్నవారందరూ దేవుని దృష్టిలో ఉన్నారని ధృవీకరింపబడే చోట, ఎంత చిన్న సమావేశమైనా, అటువంటి సభలలో మంత్రులు ప్రసంగించడం చాలా అరుదు. అయినప్పటికీ, ఈ వ్యక్తులు తెలియజేయమని పేతురుకు దేవుడు సూచించిన వాటిని వినడానికి సిద్ధంగా ఉన్నారు.

కార్నెలియస్‌తో అతని ఉపన్యాసం. (34-43) 
క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తం ద్వారా సులభతరం చేయబడిన దయ యొక్క ఒడంబడిక ద్వారా మాత్రమే అంగీకారం పొందబడుతుంది. అయితే, నిజమైన మతం, అది ఎక్కడ కనిపించినా, పేర్లు లేదా శాఖలతో సంబంధం లేకుండా దేవుడు దానిని స్వీకరించాడు. నిజమైన మతం యొక్క సారాంశం దేవుని పట్ల భయం మరియు ధర్మాన్ని పాటించడం-ప్రత్యేక దయ యొక్క వ్యక్తీకరణలలో ఉంది. ఈ అంశాలు ఒకరి అంగీకారానికి కారణం కానప్పటికీ, అవి సూచికలుగా పనిచేస్తాయి. జ్ఞానం లేదా విశ్వాసం లోపించిన ఏదైనా ప్రక్రియను ప్రారంభించిన వ్యక్తి తగిన సమయంలో అందించబడతాడు.
వారు ఇశ్రాయేలు పిల్లలకు దేవుడు పంపిన సువార్త అనే పదం గురించిన సాధారణ జ్ఞానాన్ని కలిగి ఉన్నారు. ఈ సందేశం యేసుక్రీస్తు ద్వారా శాంతికి సంబంధించిన శుభవార్తలను తెలియజేసింది. వారి అవగాహన జాన్ బోధించిన పశ్చాత్తాప బాప్టిజంతో సహా సువార్తతో ముడిపడి ఉన్న వాస్తవాలకు విస్తరించింది. దేవుడు మరియు మానవాళిని పునరుద్దరించే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని పీటర్ నొక్కిచెప్పాడు-దేవుడు శాశ్వతంగా ఆశీర్వదించబడడమే కాకుండా మధ్యవర్తిగా కూడా ఉన్నాడు. స్వర్గంలో మరియు భూమిపై ఉన్న అన్ని అధికారాలు ఆయనకు అప్పగించబడ్డాయి మరియు అన్ని తీర్పులు ఆయనకు అప్పగించబడ్డాయి.
దేవుడు తాను అభిషేకించిన వారితో పాటుగా ఉంటాడు, ఎవరికి తన ఆత్మను ప్రసాదిస్తాడో వారితో నిలబడతాడు. అప్పుడు పేతురు క్రీస్తు మృతులలో నుండి పునరుత్థానాన్ని ధృవీకరిస్తూ, దాని వాస్తవికతకు రుజువును అందించాడు. విశ్వాసం సాక్ష్యంలో లంగరు వేయబడింది మరియు క్రైస్తవ విశ్వాసం అపొస్తలులు మరియు ప్రవక్తలు వేసిన పునాదిపై ఆధారపడి ఉంటుంది-వారు అందించిన సాక్ష్యం. విశ్వాసం మన న్యాయమూర్తిగా క్రీస్తుకు మన జవాబుదారీతనంపై కేంద్రీకరిస్తుంది, ప్రతి వ్యక్తి అతని అనుగ్రహాన్ని మరియు స్నేహాన్ని కోరుకునేలా చేస్తుంది. ఆయనయందు విశ్వాసముంచుట ద్వారా, అందరును ఆయన వారి నీతిగా సమర్థించుచున్నారు.
పాప క్షమాపణ అన్ని ఇతర సహాయాలు మరియు ఆశీర్వాదాలకు పునాదిని ఏర్పరుస్తుంది. పాపం క్షమించబడితే, అంతా బాగానే ఉంటుంది, శాశ్వతమైన మరియు సానుకూల ఫలితాన్ని నిర్ధారిస్తుంది.

పవిత్ర ఆత్మ యొక్క బహుమతులు కురిపించబడ్డాయి. (44-48)
వారి విశ్వాసాన్ని బలపరచడానికి బాప్టిజం తర్వాత పవిత్రాత్మ ఇతరులపైకి దిగింది. అయితే, ఈ అన్యుల విషయంలో, వారి బాప్టిజం ముందు ఆత్మ వచ్చింది, దేవుడు బాహ్య సంకేతాలకే పరిమితం కాదని నొక్కి చెప్పాడు. పరిశుద్ధాత్మ సున్నతి లేదా బాప్టిజం పొందని వారిపై ప్రసాదించబడింది, కేవలం కర్మ కంటే ఆత్మ యొక్క ప్రాధాన్యతను నొక్కి చెబుతుంది. "ఆత్మయే జీవింపజేయును, శరీరము దేనికీ ప్రయోజనము కలిగించదు." వారు దేవుణ్ణి మహిమపరిచారు మరియు క్రీస్తు గురించి మరియు విమోచన ప్రయోజనాల గురించి మాట్లాడారు.
మనకు ప్రసాదించిన బహుమతులు ఏమైనప్పటికీ, వాటితో దేవుడిని గౌరవించడం మన విధి. పరిశుద్ధాత్మ అన్యజనులపై కుమ్మరించబడిందని అక్కడున్న యూదు విశ్వాసులు ఆశ్చర్యపోయారు. తరచుగా, దైవిక ప్రావిడెన్స్ మరియు దయ గురించిన అపోహలు మన అవగాహనను క్లిష్టతరం చేస్తాయి. వారు నిస్సందేహంగా పరిశుద్ధాత్మ బాప్టిజం పొందినందున, వారికి నీటి బాప్టిజం నిరాకరించడం అసమంజసమని పీటర్ వాదించాడు. వాదన బలవంతపుది: పదార్థాన్ని స్వీకరించిన వారి నుండి మనం సంకేతాన్ని నిలిపివేయవచ్చా?
క్రీస్తు గురించి కొంత జ్ఞానం ఉన్నవారు సహజంగానే ఎక్కువ కోరుకుంటారు. పరిశుద్ధాత్మను పొందిన వారు కూడా సత్యం గురించి మరింత నిరంతరం నేర్చుకోవాల్సిన అవసరాన్ని గుర్తిస్తారు.



Shortcut Links
అపో. కార్యములు - Acts : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |