Deuteronomy - ద్వితీయోపదేశకాండము 33 | View All

1. దైవజనుడైన మోషే మృతినొందకమునుపు అతడు ఇశ్రాయేలీయులను దీవించిన విధము ఇది; అతడిట్లనెను యెహోవా సీనాయినుండి వచ్చెను

1. దైవజనుడైన మోషే తాను చనిపోకముందు ఇశ్రాయేలు ప్రజలకు యిచ్చిన ఆశీర్వాదం ఇది.

2. శేయీరులోనుండి వారికి ఉదయించెను ఆయన పారాను కొండనుండి ప్రకాశించెను వేవేల పరిశుద్ద సమూహముల మధ్యనుండి ఆయన వచ్చెను ఆయన కుడిపార్శ్వమున అగ్నిజ్వాలలు మెరియు చుండెను.
యూదా 1:14

2. మోషే చేప్పినది; “యెహోవా సీనాయినుండి వచ్చెను. యెహోవా శేయీరులో ప్రభాత వెలుగులా ఉన్నాడు. ఆయన పారాను కొండ నుండి ప్రకాశించే వెలుగులా ఉన్నాడు. యెహోవా 10,000 మంది పరశుద్ధులతో వచ్చాడు. ఆయన కుడిచేతి వైపున దేవుని గొప్ప గొప్ప మహా సైనికులు ఉన్నారు.

3. ఆయన జనములను ప్రేమించును ఆయన పరిశుద్ధులందరు నీ వశమున నుందురు వారు నీ పాదములయొద్ద సాగిలపడుదురు నీ ఉపదేశమును అంగీకరింతురు.
ఎఫెసీయులకు 1:18, అపో. కార్యములు 20:32, అపో. కార్యములు 26:18

3. అవును, యెహోవా తన ప్రజలను ప్రేమిస్తాడు. ఆయన పరిశుద్ధ ప్రజలంతా ఆయన చేతిలో ఉన్నారు. వారు ఆయన అడుగుజాడల్లో నడుస్తారు. ప్రతి ఒక్కరూ ఆయన ప్రబోధాలు అంగీకరిస్తారు.

4. మోషే మనకు ధర్మశాస్త్రమును విధించెను అది యాకోబు సమాజ స్వాస్థ్యము.
ఎఫెసీయులకు 1:18, అపో. కార్యములు 20:32, అపో. కార్యములు 26:18

4. మోషే మనకు ధర్మశాస్త్రం యిచ్చాడు. అది యాకోబు ప్రజలందరికీ చెందుతుంది.

5. జనులలో ముఖ్యులును ఇశ్రాయేలు గోత్రములును కూడగా అతడు యెషూరూనులో రాజు ఆయెను.

5. ప్రజలు, వారి నాయకులు సమావేశమైనప్పుడు యెషూరూనుకు రాజు ఉన్నాడు. యెహోవాయే వారి రాజు.

6. రూబేను బ్రదికి చావక యుండునుగాక అతనివారు లెక్కింపలేనంతమంది అగుదురు.

6. “రూబేను మరణించక, జీవించునుగాక! ఆతని వంశంలో అనేకమంది ప్రజలు ఉందురు గాక! యూదాకు ఆశీర్వాదాలు

7. యూదానుగూర్చి అతడిట్లనెను యెహోవా, యూదా మనవి విని, అతని ప్రజల యొద్దకు అతనిని చేర్చుము. యూదా బాహుబలము అతనికి చాలునట్లుచేసి అతని శత్రువులకు విరోధముగా నీవతనికి సహాయుడవై యుందువు.

7. యూదా వంశం గూర్చి మోషే ఈ విషయాలు చెప్పాడు; “యెహోవా, యూదా నాయకుడు సహాయం కోసం మొరపెట్టినప్పుడు ఆలకించు. అతణ్ణి తన ప్రజల దగ్గరకు చేర్చు. ఆతణ్ణి బలంవతుణ్ణి చేయి. అతడు తన శత్రువులను ఓడించటానికి సహాయం చేయి!”

8. లేవినిగూర్చి యిట్లనెను నీ తుమీ్మము నీ ఊరీము నీ భక్తునికి కలవు మస్సాలో నీవు అతని పరిశోధించితివి మెరీబా నీళ్లయొద్ద అతనితో వివాదపడితివి.

8. లేవీని గూర్చి మోషే ఇలా చెప్పాడు. “నీ నిజమైన అనుచరుడు లేవీ ఊరీము, తుమ్మీమునకు కాపలా ఉండేవాడు. నీ పత్యేక మనిషి వాటిని కాపాడుతాడు. మస్సా దగ్గర నీవు లేవీ ప్రజలను పరీక్షించావు వాళ్లు నీ వాళ్లని (నిన్ను ప్రేమించుటకు) మెరీబా నీళ్ల దగ్గర నీవు రుజువు చేసావు.

9. అతడునేను వానినెరుగనని తన తండ్రిని గూర్చియు తన తల్లినిగూర్చియు అనెను తన సహోదరులను లక్ష్యపెట్టలేదు తన కుమారులను కుమారులని యెంచలేదు వారు నీ వాక్యమునుబట్టి నీ నిబంధనను గైకొనిరి.
మత్తయి 10:37, లూకా 14:26

9. లేవీ తన తండ్రి, తల్లిని గూర్చి చెప్పాడు. ‘వారి విషయం నేను లెక్క చేయను’ అతడు తన సొంత సోదరులను స్వీకరించ లేదు. తన సొంత పిల్లల్ని తెలుసుకో లేదు. లేవీయులు నీ మాటకు విధేయులయ్యారు నీ ఒడంబడికను నిలబెట్టారు.

10. వారు యాకోబునకు నీ విధులను ఇశ్రాయేలునకు నీ ధర్మశాస్త్రమును నేర్పుదురు నీ సన్నిధిని ధూపమును నీ బలిపీఠముమీద సర్వాంగబలిని అర్పించుదురు

10. యాకోబుకు నీ నియమాలను ఇశ్రాయేలుకు నీ ధర్మశాస్త్రాన్ని వారు బోధిస్తారు. వాళ్లు నీ యెదుట ధూపం వేస్తారు. నీ బలిపీఠం మీద పరిపూర్ణ దహన బలులు అర్చిస్తారు.

11. యెహోవా, అతని బలమును అంగీకరించుము అతడు చేయు కార్యమును అంగీకరించుమీ అతని విరోధులును అతని ద్వేషించువారును లేవ కుండునట్లు వారి నడుములను విరుగగొట్టుము.

11. యోహావా లేవీకి చెందిన వాటిని ాశీర్వదించు అతడు జరిగించే వాటిని స్వీకరించు. అతని మీద దాడి చేసే వాళ్లను నాశనం చేయి. బెన్యామీనుకు ఆశీర్వాదాలు

12. బన్యామీనునుగూర్చి యిట్లనెను బెన్యామీను యెహోవాకు ప్రియుడు ఆయనయొద్ద అతడు సురక్షితముగా నివసించును దినమెల్ల ఆయన అతనికి ఆశ్రయమగును ఆయన భుజములమధ్య2 అతడు నివసించును
2 థెస్సలొనీకయులకు 2:13

12. బెన్యామీను గూర్చి మోషే ఇలా చెప్పాడు. “యెహోవా బెన్యామీనును ప్రేమిస్తున్నాడు. బెన్యామీను ఆయన చెంత క్షేమంగా జీవిస్తాడు. అతనిని యెహోవా ఎల్లప్పుడూ కాపాడతాడు. మరియు యెహోవా అతని దేశంలో నివసిస్తాడు.”

13. యోసేపునుగూర్చి యిట్లనెను ఆకాశ పరమార్థములవలన మంచువలన క్రింద క్రుంగియున్న అగాధ జలములవలన

13. యోసేపును గూర్చి మోషే ఇలా చెప్పాడు. “యెహోవా అతని దేశాన్ని ఆశీర్వదించును గాక. ఆకాశం నుండి శ్రేష్ఠమైన వాటితో భూమి కింద దాగి ఉన్న లోతైన ధన సంపదతో

14. సూర్యునివలన కలుగు ఫలములోని శ్రేష్ఠపదార్థముల వలన చంద్రుడు పుట్టించు శ్రేష్ఠపదార్థములవలన

14. సూర్యుని శ్రేష్ఠఫలాలతో మాసాల శ్రేష్ఠపంటలతో

15. పురాతన పర్వతముల శ్రేష్ఠపదార్థములవలన నిత్యపర్వతముల శ్రేష్ఠపదార్థములవలన

15. ప్రాచీన పర్వతాల నుండి శ్రేష్ఠఫలాలంతో కొండల్లో శాశ్వతంగా ఉంచబడే శ్రేష్ఠ పదార్థాలతో

16. సంపూర్ణముగా ఫలించు భూమికి కలిగిన శ్రేష్ఠపదార్థ ములవలన యెహోవా అతని భూమిని దీవించును పొదలోనుండినవాని కటాక్షము యోసేపు తలమీదికి వచ్చును తన సహోదరులలో ప్రఖ్యాతినొందినవాని నడినెత్తి మీదికి అది వచ్చును.

16. భూమి నుండి శ్రేష్ఠమైన బహుమానాలు, దాని పూర్ణ ఆశీర్వాదాలతో, మండుతూ ఉండే పొదలో నివాసం చేసే యెహోవా కటాక్షంతో, తన సోదరులనుంచి వేరుగా వించబడ్డ యోసేపు తలమీద యోసేపు నడి నెత్తి మీద ఆశీర్వాదం వచ్చునుగాక.

17. అతని వృషభమునకు మొదట పుట్టినదానికి ఘనత కలదు. అతని కొమ్ములు గురుపోతు కొమ్ములు వాటివలన అతడు భూమ్యంతములవరకు జనులను త్రోసివేయును ఎఫ్రాయిముయొక్క పదివేలును మనష్షేయొక్క వేలును ఆలాగున నుందురు.

17. యోసేపు దొడ్డిలో మొట్టమొదట పుట్టిన ఎద్దుకు ఎంతో శోభ, ఈ ఎద్దు కొమ్ములు అడవి దున్నపోతు కొమ్ములంత పెద్దవిగా ఉంటాయి. యోసేపు మందలు మనుష్యుల్ని తోసివేస్తాయి. అందర్నీ, భూదిగాంతాల వరకు తోసివేస్తాయి. అవును, మనుష్షేకు వేలాది మంది ప్రజలు ఉన్నారు, అవును, ఎఫ్రాయిముకు పది వేలమంది ప్రజలు ఉన్నారు.’

18. జబూలూనునుగూర్చి యిట్లనెను జెబూలూనూ, నీవు బయలు వెళ్లు స్థలమందు సంతో షించుము ఇశ్శాఖారూ, నీ గుడారములయందు సంతోషించుము.

18. జెబూలూను గూర్చి మోషే చెప్పినది; “జెబూలూనూ, నీవు బయటకు వెళ్లినప్పుడు, ఇశ్శాఖారూ, నీ యింటివద్ద నీ గుడారాలలో సంతోషంగా ఉండు.

19. వారు జనములను కొండకు పిలిచిరి అక్కడ నీతి బలుల నర్పింతురు వారు సముద్రముల సమృద్ధిని ఇసుకలో దాచబడిన రహస్యద్రవ్యములను పీల్చుదురు.

19. వారు తమ ప్రజలను కొండకు (కర్మెలు) పిలుస్తారు. అక్కడ వారు సరెన బలులు అర్పిస్తారు. ఎందుకంటే, సముద్రాల్లోని సమృద్ధిని వారు తీసుకొంటారు. ఇసుకలో దిగి ఉన్న ఐశ్వర్యాలను మీరు తీసుకుంటారు గనుక.”

20. గాదునుగూర్చి యిట్లనెను గాదును విశాలపరచువాడు స్తుతింపబడును అతడు ఆడు సింహమువలె పొంచియుండును బాహు వును నడినెత్తిని చీల్చివేయును.

20. గాదును గూర్చి మోషే ఇలా చెప్పాడు; “గాదును విశాలపర్చే దేవునికి స్తోత్రాలు! గాదు సింహంలా పడుకుంటాడు, చేతిని, నడినెత్తిని చీల్చేస్తాడు.

21. అతడు తనకొరకు మొదటిభాగము చూచుకొనెను అక్కడ నాయకుని భాగము కాపాడబడెను. అతడు జనములోని ముఖ్యులతో కూడ వచ్చెను యెహోవా తీర్చిన న్యాయమును జరిపెను ఇశ్రాయేలీయులయొద్ద యెహోవా విధులను ఆచరించెను.

21. శేష్ఠభాగం అతడు తనకోసం ఎంచుకుంటాడు అక్కడ రాజభాగం అతనికి ఉంచబడుతుంది. ప్రజానాయకులు అతని దగ్గరకు వస్తారు ఇశ్రాయేలీయుల యెడల అతడు దయ చూపుతాడు. యెహోవా దృష్టికి మంచివాటిని అతడు చేస్తాడు యెహోవా అతని పక్షంగా తీర్పుతీరుస్తాడు.”

22. దానునుగూర్చి యిట్లనెను దాను సింహపుపిల్ల అది బాషానునుండి దుమికి దాటును.

22. దాను గూర్చి మోషే ఇలా చెప్పాడు; “దాను బాషాను నుండి దూకే సింహపు పిల్ల.”

23. నఫ్తాలినిగూర్చి యిట్లనెను కటాక్షముచేత తృప్తిపొందిన నఫ్తాలి, యెహోవా దీవెనచేత నింపబడిన నఫ్తాలి, పశ్చిమ దక్షిణ దిక్కులను స్వాధీనపరచుకొనుము.

23. నఫ్తాలీ గూర్చి మోషే ఇలా చెప్పాడు. “నఫ్తాలీ, నీవు దయపొంది తృప్తిగా ఉన్నావు, యెహోవా ఆశీర్వాదాలతో నిండిపోయావు, (గలలీ) పశ్చిమ, దక్షిణాల భూమిని నీవు తీసుకో.”

24. ఆషేరునుగూర్చి యిట్లనెను ఆషేరు తన సహోదరులకంటె ఎక్కువగా ఆశీర్వ దింపబడును. అతడు తన సహోదరులకంటె కటాక్షము నొందును తన పాదములను తైలములో ముంచుకొనును.

24. ఆషేరును గూర్చి మోషే ఇలా చెప్పాడు; “కుమారులలో ఆషేరు అత్యధికంగా ఆశీర్వదించబడినవాడు; అతణ్ణి తన సోదరులకు ప్రియ మైన వాడ్నిగా ఉండనియ్యుండి. అతణ్ణి తన పాదాలు తైలముతో కడుగ కోనివ్వండి.

25. నీ కమ్ములు ఇనుపవియు ఇత్తడివియునై యుండును.నీవు బ్రదుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును.

25. నీ తాళాలు యినుపవి, యిత్తడిని, నీ బలం జీవితం అంత ఉంటుంది.”

26. యెషూరూనూ, దేవుని పోలినవాడెవడును లేడు ఆయన నీకు సహాయము చేయుటకు ఆకాశవాహనుడై వచ్చును మహోన్నతుడై మేఘవాహనుడగును.

26. “ఓ యెషూరూనూ, దేవునివంటి వాడు ఎవ్వరూ లేరు. దేవుడు తన మహిమతో నీకు సహాయం చేసేందుకు. మేఘాల మీద ఆకాశంలో విహరిస్తాడు.

27. శాశ్వతుడైన దేవుడు నీకు నివాసస్థలము నిత్యముగనుండు బాహువులు నీ క్రిందనుండును ఆయన నీ యెదుటనుండి శత్రువును వెళ్ళగొట్టి నశింపజేయుమనెను.
ఎఫెసీయులకు 1:18

27. నిత్యుడైన దేవుడు నీకు భద్రతా స్థలం శాశ్వతంగా ఆదుకునే హస్తాలు నీకింద ఉన్నాయి. దేవుడు శత్రువును నీదగ్గర నుండి వెళ్లగొట్టేస్తాడు. ‘శత్రువును నాశనం చేయి’ అంటాడు.

28. ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును యాకోబు ఊట ప్రత్యేకింపబడును అతడు ధాన్య ద్రాక్షారసములుగల దేశములో నుండును అతనిపై ఆకాశము మంచును కురిపించును.

28. కనుక ఇశ్రాయేలు క్షేమంగా జీవిస్తాడు, ధాన్యం, ద్రాక్షారసం ఉండే దేశంలో యూకోబు ఊటక్షేమంగా ఉంటుంది. అవును, అతని ఆకాశం మంచును కురిపిస్తుంది.

29. ఇశ్రాయేలూ, నీ భాగ్యమెంత గొప్పది యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడెవడు? ఆయన నీకు సహాయకరమైన కేడెము నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయుదురు నీవు వారి ఉన్నతస్థలములను త్రొక్కుదువు.

29. ఇశ్రాయేలూ, నీవు సంతోషంగా ఉన్నావు. యెహోవా చేత రక్షించబడిన దేశంగా నీవలె ఏ దేశమూ లేదు. యెహోవాయే నీకు సహాయం చేసేవాడు. నీ విజయానికి యెహోవాయే ఖడ్గం. నీ శత్రువులు నీకు విధేయులై వస్తారు. వారి అబద్ధపు దేవతం పూజా స్థలాల మీద మీరు నడుస్తారు.”Shortcut Links
ద్వితీయోపదేశకాండము - Deuteronomy : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |